ఈ మొత్తం వ్యవహారంలో నాని అటు ప్రొడ్యూసర్స్, ఇటు అభిమానుల నడుమ నలిగిపోతున్నాడు. నాని ఫ్యాన్స్ అంతా తమ హీరో చిత్రాన్ని థియేటర్స్ లోనే చూడాలని కోరుకుంటారు. ఇప్పటికే నాని నటించిన 'వి' చిత్రం ఓటిటిలో రిలీజయింది. ఇప్పుడు టక్ జగదీశ్ కూడా అదే బాటలో నడుస్తుండడంతో తాను క్రాస్ రోడ్స్ లో ఉన్నట్లు నాని ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.