Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో భాగంగా 66వ రోజు హౌస్ లో ఆసక్తికర పరిణామాలు, కొందరు హౌస్ మేట్స్ మరచిపోలేని మధురమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి.
బిగ్ బాస్ హౌస్ లో 66వ రోజు కొందరు హౌస్ మేట్స్ కి మరచిపోలేని క్షణాలని మిగిల్చింది. ముకేశ్, శివ కుమార్ హౌస్ లో ఎంతో మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ పొందారు. బుధవారం రోజు ఎపిసోడ్ లో హౌస్ లోకి ముకేశ్ తల్లి ఎంట్రీ ఇచ్చారు. తల్లిని చూడగానే ముకేశ్ ఎమోషనల్ అయ్యాడు. ఆమె రాగానే కొడుకుని హగ్ చేసుకుని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది.
24
ముకేశ్ తల్లి ఎంట్రీ
ముకేశ్ తల్లి హౌస్ లో అందరినీ ఆప్యాయంగా పలకరించారు. ముకేశ్, ముకేశ్ తల్లి, వర్షిణి మధ్య కొన్ని ఆసక్తికర సంభాషణలు జరిగాయి. బిగ్ బాస్ లో నన్ను చూస్తున్నప్పుడు నాలో ఏమైనా మైనస్ లు కనిపిస్తున్నాయా అని ముకేశ్ తల్లిని అడిగాడు. దీనికి ఆమె నీ కోపం అని సమాధానం ఇచ్చింది. నా కోపాన్ని వర్షిణి చాలా వరకు తగ్గించేసింది అని ముకేశ్ బదులిచ్చాడు. ఇంకా తగ్గించుకోవాలి అని తల్లి సూచించింది. హౌస్ మేట్స్ కి ముకేశ్ తన తల్లి గురించి చెబుతూ.. నాన్నకు స్ట్రోక్ వచ్చినప్పుడు అమ్మ ఒక్కరే 2 ఏళ్ళ పాటు మంచాన ఉన్న నాన్నని చూసుకున్నారు. ఒక్క సారి కూడా ఆమె విసుక్కోవడం నేను చూడలేదు. అమ్మని చూసే జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అని డిసైడ్ అయినట్లు ముకేశ్ తెలిపారు.
34
సర్ప్రైజ్ ఇచ్చిన ప్రియాంక జైన్
ఆ తర్వాత హౌస్ లోకి అమన్ తండ్రి వచ్చారు. ఆయన కూడా ఇంటి సభ్యులని ఆప్యాయంగా పలకరించి, కొడుకుతో కాసేపు సమయం గడిపి వెళ్లారు. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి మాజీ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ ఎంట్రీ ఇచ్చింది. ప్రియాంక సీజన్ 7లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సీజన్ 10లో హౌస్ లో ఉన్న శివకుమార్, ప్రియాంక కాబోయే దంపతులు.
శివకుమార్ కి సర్ప్రైజ్ ఇచ్చే క్రమంలో ప్రియాంక సీక్రెట్ గా హౌస్ లోకి వచ్చింది. కానీ శివకుమార్ తో పాటు హౌస్ మేట్స్ అందరూ ఆమెని గుర్తు పట్టేశారు. కాబోయే దంపతులు ఇద్దరూ ఒకరినొకరు కౌగిలించుకుని ముద్దుల్లో మునిగిపోయారు. ఆ తర్వాత హౌస్ మేట్స్ సమక్షంలో ఇద్దరి ఎంగేజ్ మెంట్ చాలా రొమాంటిక్ గా జరిగింది. ఎంగేజ్మెంట్ డ్రెస్ లో శివకుమార్, ప్రియాంక జంట చూడ ముచ్చటగా కనిపించారు.