Prabhas kalki 2 movie : మెగా బడ్జెట్ సినిమా రెండో భాగం నుంచి దీపికా పదుకొణె తప్పుకోవడంతో, ఆమె స్థానంలో ప్రియాంక చోప్రాను తీసుకునేందుకు నిర్మాతలు ఆలోచిస్తున్నారని సమాచారం.
అంతర్జాతీయ స్టార్ ప్రియాంక చోప్రా మార్కెట్ ఇప్పుడు టాప్‌లో ఉంది. రాజమౌళి సినిమాలో నటించడంతో పాటు, ఇప్పుడు కల్కి 2లో దీపిక స్థానంలో నటించనుందని వార్తలు వస్తున్నాయి.
24
దీపికా పదుకొణె బదులు ప్రియాంక చోప్రా
బ్లాక్‌బస్టర్ 'కల్కి 2898 AD' రెండో భాగం నుంచి దీపిక తప్పుకుంది. 8 గంటల షిఫ్ట్ అడగడమే కారణమని అంటున్నారు. ఇప్పుడు ఆమె స్థానంలో ప్రియాంక చోప్రాను నిర్మాతలు పరిశీలిస్తున్నారు.
34
నేపథ్యం ఏంటి?
గతంలో దీపిక స్థానంలో అలియా భట్ పేరు వినిపించింది. కానీ రాజమౌళి సినిమాతో ప్రియాంక మార్కెట్ పెరగడంతో, కల్కి 2కు ఆమెను తీసుకుంటే సినిమాకు ప్లస్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన 'కల్కి 2898 AD' రూ.1042 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు దీని సీక్వెల్ 'కల్కి 2898 AD 2'ను సుమారు రూ.700 కోట్ల భారీ బడ్జెట్‌తో తీయబోతున్నారు.