సడెన్ గా ఇండియాలో ప్రత్యక్ష్యం అయిన ప్రియాంక చోప్రా, కారణం ఏంటంటే..?

First Published | Oct 28, 2023, 8:49 AM IST

హాలీవుడ్  లో సెటిల్ అయిన బాలీవుడ్ హీరోయిన్   ప్రియాంక చోప్రా.. అప్పుడప్పుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ తో .. వార్తల్లో నిలుస్తోంది.  ఏదో ఒక రకంగా వైరల్ న్యూస్ అవుతుంది. ఆమె చేసే కామెంట్స్.. లేక ఆమె చేసే పనులు హార్ట్ టాపిక్స్ అవుతున్నాయి. అయితే ఈమధ్య వరకూ కాంట్రవర్సీ కామెంట్స్ తో వార్తల్లో నిలిచిన ప్రియాంక..  

హాలీవుడ్ పాప్ సింగర్  నిక్‌ జోనస్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత అమెరికాలో స్థిరపడిపోయింది బాలీవుడ్ స్టార్ బ్యూటీ ప్రియాంక చోప్రా. ఈవిషయం తెలిసిందే. ప్రస్తుతం హాలీవుడ్ ప్రాజెక్ట్స్ చేసుకుంటూ బిజీ బిజీ అయిపోయింది. ఎక్కువగా వెబ్ సిరీస్ లు చేస్తోంది. ఇక హాలీవుడ్ లో ఉండి కూడా..బాలీవుడ్ లో తాను పడిన ఇబ్బందులకు.. తన పంచ్ లతో రివేంజ్ తీర్చుకుంటుంది బ్యూటీ. 
 

ఎప్పుడో ఒక్క సారి ఇండియాకి ఇలా వచ్చి..అలా వెళ్ళిపోతూ ఉంటుంది బ్యూటీ.. చాలా కాలం తర్వాత తాజాగా ఇండియాలో లాండ్ అయ్యింది  ప్రియాంకా చోప్రా.  ముంబైకి సర్ ప్రైజింగ్ విజిట్ ఇచ్చింది. అది కూడా పొద్దున పొద్దునే ముంబైలో ల్యాండవడం విశేషం. ఇంతకీ ప్రియాంకా చోప్రా ఇలా సడెన్‌గా ముంబై రావ డానికి కారణం ఏంటీ అని ఆమె ఫ్యాన్స్ తో పాటు.. సినీ జనాలు తలలు బద్దలు కొట్టుకుని మరీ ఆలోచిస్తున్నారు. 
 


ఇంతకీ ప్రియాంక ఇండియాకు ఎందుకు వచ్చిందంటే..? ముంబైలో Jio MAMI Film Festival 2023 ఓపెనింగ్‌ నైట్‌ ఈవెంట్‌లో పాల్గొనేందుకు వచ్చింది. చాలా స్టైలీష్ లుక్ లో కనిపించింది గ్లోబల్ బ్యూటీ..  బ్లాక్‌ క్రాప్‌ టాప్‌ మ్యాచింగ్‌ ప్యాంట్ తో ముంబై ఎయిర్‌పోర్టులో సందడి చేసింది బ్యూటీ. ఇక ఆమె కనిపిస్తే.. జనాలు ఊరుకోరు.. కెమెరా కళ్లు అయితే అస్సలు ఊరుకోవు.. దొరికినకాడ..దొరికినన్ని ఫోటోలు క్లిక్‌మనిపించాయి. 

ముంబైలోని బాంద్రా కుర్ల కాంప్లెక్స్‌ జియో వరల్డ్‌ సెంటర్‌లో ఈ ఫెస్టివల్‌ జరుగనుంది. ఈ ఈవెంట్ లో ఆమె సందడి చేయబోతోంది. ఇక ప్రియాంకా చోప్రా చివరగా 2016లో వచ్చిన జై గంగాజల్‌ హిందీ మూవీలో నటించి మెప్పించింది. ఆ తర్వాత హాలీవుడ్ ప్రాజెక్ట్‌లతో బిజీ అయిపోయింది. కేజీఎఫ్‌ ఫేం ప్రశాంత్ నీల్‌ డైరెక్షన్‌లో ఎన్టీఆర్‌ 31 గా రాబోతున్న సినిమాతో ప్రియాంకా చోప్రా రీఎంట్రీ ఇవ్వబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి అది ఎంత వరకూ నిజమో తెలియాల్సి ఉంది. 

ఇక హాలీవుడ్ లో ప్రియాంక చోప్రా.. బిజీ బిజీ.. తన ఫ్యామిలీని చూసుకోవాలి.. బిడ్డ ఆలనా పాలనాచూసుకోవాలి. అటు సినిమాలు.. ఇటు వెబ్ సిరీస్ లు.మరో వైపు సినిమా ఫంక్షన్లు.. ఇంకోవైపు సోషల్ మీడియా.. ఇన్నిబాధత్యల నడుమ.. టైట్ షెడ్యూల్ లో ఉంది బ్యూటీ. ఆమెకు ఏమాత్రం తీరక లేదంట. కాని అప్పుడప్పుడు బాలీవుడ్ గురించి స్పందిస్తూ.. కాంట్రవర్సీలు మాత్రం చేస్తుంటుంది ప్రియాంక. 
 

బోల్ట్ స్టేట్ మెంట్స్ ఇవ్వడంతో.. బాలీవుడ్ ను విమర్షించడంలో కాస్త హుషారు చూపిస్తోంది హాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా. ఆమధ్య ట్రిపుల్ ఆర్ చూడలేదని సంచలన స్టేట్ మెంట్ ఇచ్చింది. ఆతరువాత  కాస్టింగ్ కౌచ్ గురించి ఓ దర్శకుడిపై ఆరోపణలు చేసింది. ఇలా బాలీవుడ్ పై పెంచుకున్న కోపం అప్పుడప్పుడు ఇలా బయట పెడుతుంటుంది. 
 

priyanka chopra

ప్రస్తుతం ప్రియాంక బ్యాక్ టు బ్యాక్ హాలీవుడ్ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంది. ఇటీవలే ఈ అమ్మడు నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ ప్రైమ్ లో విడుదలై మంచి వ్యూవర్ షిప్ ను సాధిస్తుంది. దీనితో పాటుగా లవ్ ఎగేన్ అనే రొమాంటిక్ కామెడీ డ్రామా చేసింది. ప్రస్తుతం ప్రియాంక హెడ్స్ ఆఫ్ స్టేట్ అనే సినిమా చేస్తుంది.

Latest Videos

click me!