“నేను హిందీ సినిమాలు చూస్తూ పెరిగాను. అందుకే 'రావణ్' హిందీ వెర్షన్‌లో నటించే అవకాశం రాగానే చాలా ఎగ్జైట్ అయ్యాను. ఆ సినిమా తర్వాత బాలీవుడ్‌లో నాకు బోలెడన్ని అవకాశాలు వస్తాయని ఆశించాను” అని నటి ప్రియమణి అన్నారు.
దక్షిణాదిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జాతీయ అవార్డు గ్రహీత ప్రియమణి, ఇప్పుడు కేవలం సౌత్ సినిమాలకే పరిమితం కాలేదు. 'ది ఫ్యామిలీ మ్యాన్', 'ది గుడ్ వైఫ్' వంటి వెబ్ సిరీస్‌లు, షారుఖ్ ఖాన్ 'జవాన్' సినిమా విజయంతో ఆమె పాన్ ఇండియా స్టార్‌గా వెలిగిపోతోంది.
27
ప్రియమణి బాలీవుడ్ జర్నీ
అయితే, బాలీవుడ్‌లో ఆమె ప్రయాణం అంత సులభంగా సాగలేదు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రియమణి తన బాలీవుడ్ జర్నీ, వ్యక్తిగత ఎదుగుదల గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.
37
హిందీ సినిమాలు చూస్తూ పెరిగాను
మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'రావణ్' సినిమాతో ప్రియమణి హిందీలోకి ఎంట్రీ ఇచ్చింది. "హిందీ సినిమాలు చూస్తూ పెరిగాను. అభిషేక్ బచ్చన్, రవి కిషన్, పంకజ్ త్రిపాఠి వంటి గొప్ప నటులతో పనిచేసే అవకాశం వచ్చింది. ఆ సినిమా తర్వాత బాలీవుడ్‌లో చాలా అవకాశాలు వస్తాయని ఆశించాను" అని చెప్పింది.
'రావణ్' తర్వాత బాలీవుడ్‌లో ఎందుకు ఎక్కువ కనిపించలేదన్న ప్రశ్నకు.. "నిజం చెప్పాలంటే, కొన్ని అవకాశాలు వచ్చాయి. కానీ నేను పాత్రల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉండేదాన్ని. కొన్ని ఆఫర్లు నచ్చలేదు. అప్పటికే సౌత్‌లో బిజీగా ఉండటంతో పెద్దగా బాధపడలేదు" అని ప్రియమణి స్పష్టం చేసింది.
57
18 ఏళ్లకే ఇండస్ట్రీకి
ప్రియమణి తన పాత రోజులను గుర్తుచేసుకుంటూ, "18 ఏళ్లకే ఇండస్ట్రీకి వచ్చాను. మా కుటుంబంలో ఎవరూ ఈ ఫీల్డ్‌లో లేరు. నాకు మార్గనిర్దేశం చేయడానికి గాడ్‌ఫాదర్ ఎవరూ లేరు. నా పాత ఫొటోలు చూసుకుంటే, 'నేను ఎందుకిలా ఉన్నాను?' అని నవ్వొస్తుంది. అప్పుడు మేకప్, హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ సెన్స్ గురించి ఏమీ తెలిసేది కాదు" అని చెప్పింది.
67
నా భర్త ముస్తఫా రాజ్ నా జీవితంలోకి వచ్చాక..
నన్ను నేను ఎలా ప్రేమించుకోవాలో, అందంగా ఎలా కనిపించాలో ఆలస్యంగా నేర్చుకున్నానని ప్రియమణి చెప్పింది. "2011 లేదా 2012 ప్రాంతంలో స్టైలిస్ట్‌ల ప్రాముఖ్యత తెలిసింది. ముఖ్యంగా నా భర్త ముస్తఫా రాజ్ నా జీవితంలోకి వచ్చాక, నాపై నేను ఇన్వెస్ట్ చేయడం నేర్చుకున్నాను" అని తెలిపింది.
77
భర్త ప్రోత్సాహం
"మెనిక్యూర్, పెడిక్యూర్ చేయించుకోవడం, నీట్‌గా కనిపించడం ఎంత ముఖ్యమో అప్పుడు తెలిసింది" అని తన భర్త ప్రోత్సాహం గురించి ప్రియమణి చెప్పింది. మొత్తానికి, ప్రియమణి ఇప్పుడు నటనతో పాటు తన స్టైలింగ్‌తోనూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.