ట్రెండీ అవుట్ ఫిట్ లో ప్రియమణి మెరుపులు.. ఖతర్నాక్ ఫోజులతో మైమరిపిస్తున్న ‘ఢీ’ బ్యూటీ

First Published | Oct 5, 2023, 5:22 PM IST

సీనియర్ నటి ప్రియమణి నయా లుక్స్ తో ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో జోరు చూపిస్తోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలోనూ సందడి చేస్తోంది. ఎప్పటికప్పుడు క్రేజీగా పోస్టులు పెడుతూ ఆకట్టుకుంటోంది. 
 

సీనియర్ నటి ప్రియమణి (Priyamani) కెరీర్ టాలీవుడ్ తోనే ప్రారంభమైంది. ‘ఎవరే ఆటగాడు’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత మూడేళ్లకు వచ్చిన ‘పెళ్లైన కొత్తలో’ సినిమాతో ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. 
 

ఇక ప్రియమణికి కెరీర్ లో ‘యమదొంగ’, ‘నవ వసంతం’, ‘శంభో శివ శంభో’, ‘గోలీమార్’, ‘సాధ్యం’, ‘నారప్ప’, ‘విరాట పర్వం’ సినిమాలు గుర్తుండిపోయేవని చెప్పుకొచ్చు.. ఇక రీసెంట్ గా భారీ బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ Jawanలోనూ యాక్షన్ తో అదరగొట్టింది. తన పెర్ఫామెన్స్ తో ప్రేక్షకులను ఫిదా చేసింది. 


గతేడాది నుంచి ఈ ముద్దుగుమ్మ  కెరీర్ లో స్పీడ్ పెంచింది. సెకండ్ ఇన్సింగ్స్ లో వరుస చిత్రాలతో అలరిస్తోంది. ఈ ఏడాది ‘కస్టడీ’తోనూ అలరించింది. మరో మూడు చిత్రాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఇలా సినిమాల పరంగా బిజీగానే ఉంది. తన అభిమానులను వెండితెరపై అలరిస్తోంది.

మరోవైపు ప్రియమణి సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తోంది. అదిరిపోయే లా ఫొటోషూట్లు చేస్తూ తన బ్యూటీఫుల్ లుక్స్ లో కట్టిపడేస్తోంది. ముఖ్యంగా తాజాగా ట్రెండీ వేర్ లో దర్శనమిచ్చింది. ఖతర్నాక్ ఫొటోషూట్ తో ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను ఫిదా చేసింది. 

తాజాగా ప్రియమణి పంచుకున్న ఫొటోస్ ఆకట్టుకుంటున్నాయి. లెహంగా, పైన షర్ట్ ధరించి అట్రాక్ట్ చేసింది. గ్లామర్ షోకు పెద్దగా ఆస్కారం లేకుండా తన ఫ్యాషన్ సెన్స్ తోనే ఆకర్షించింది. కిర్రాక్ ఫోజులతో కుర్ర హృదయాలను కొల్లగొట్టింది. మెరిసిపోయే రూపసౌందర్యంతో ఖుషీ చేసింది. 

ఇలా ప్రస్తుతం అటు సినిమాలతో, ఇటు సోషల్ మీడియాలో  దర్శినమిస్తూ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. ఇక బుల్లితెరపైనా ‘ఢీ’షోకు జడ్జీగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఢీ14 వరకు ప్రియమణినే సందడి చేసింది. ఇక ప్రస్తుతం తమిళంలో ‘కొటేషన్ గ్యాంగ్, కన్నడలో ‘ఖైమారా’, హిందీలో ‘మైదాన్’ వంటి సినిమాల్లో నటిస్తోంది. 

Latest Videos

click me!