మలయాళీ నటి ప్రియా ప్రకాష్ వారియర్ తన తాజా బీచ్ ఫోటోలతో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఈ 25 ఏళ్ల యంగ్ బ్యూటీ ఇండోనేసియాలోని బాలీ దీవుల్లో వెకేషన్‌కి వెళ్లింది. అక్కడ బీచ్ ఒడ్డున దిగిన గ్లామరస్ ఫోటోలని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఈ ఫోటోలకు ప్రియా వారియర్ 'అలలని రొమాంటిక్ గా మార్చేస్తున్నా' అని క్యాప్షన్ ఇచ్చింది.
25
ట్రెండీ అవుట్ ఫిట్ లో ప్రియా వారియర్
ప్రియా వారియర్ ఈ ఫొటోలో బికినీ తరహాలో ట్రెండీ టచ్ ఇస్తూ ఫ్లోరల్ టాప్, డెనిమ్ షార్ట్‌లను ధరించి స్టైలిష్‌గా మెరిసింది. బీచ్ వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తూ తీసిన ఈ ఫొటోలు ప్రస్తుతం నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. ప్రియా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో బాలీలో తన పర్యటనకు సంబంధించిన అనేక ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేస్తూ అభిమానులకు విజువల్ ట్రీట్ అందిస్తోంది.
35
గుడ్ బ్యాడ్ అగ్లీతో హిట్
ఇక సినిమాల విషయానికి వస్తే, ప్రియా ప్రకాష్ వారియర్ ఈ ఏడాది ఇప్పటివరకు రెండు ముఖ్యమైన తమిళ చిత్రాల్లో నటించింది. అజిత్ హీరోగా నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీలో, ధనుష్ ప్రధాన పాత్రలో వచ్చిన నిలవుకు ఎన్ మేల్ ఎన్నాడి కోబం (తెలుగులో జాబిలమ్మ నీకు అంత కోపమా) చిత్రాల్లో కీలక పాత్రలో నటించింది.
ప్రస్తుతం ఈ నటి రెండు బాలీవుడ్ ప్రాజెక్ట్స్‌పై పని చేస్తోంది. ఒకటి అర్జున్ రాంపాల్ నటిస్తున్న 3 మంకీస్, మరొకటి లవ్ హాకర్స్ అనే థ్రిల్లర్. ఈ రెండు సినిమాలు త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నాయి.
55
కెరీర్ లో బిజీగా..
ఓవైపు వెకేషన్ ఎంజాయ్ చేస్తూనే, మరోవైపు సినిమాలతో ప్రియా ప్రకాష్ వారియర్ తన కెరీర్‌లో బిజీగా మార్చుకుంది. ఆమె నటనతో పాటు గ్లామర్ ప్రెజెన్స్‌తో కూడా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటోంది. గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలో ప్రియా వారియర్.. సిమ్రన్ పాటకి చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.