ప్రణీత సుభాష్ బేబీ షవర్ ఫోటోలు వైరల్

First Published | Aug 23, 2024, 9:42 PM IST

సినీ నటి ప్రణీత సుభాష్ మళ్ళీ తల్లి కాబోతున్న సంతోషంలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆమె సీమంతం వేడుకను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు. 
 

నటి ప్రణీత సుభాష్ మళ్ళీ తల్లి కాబోతున్నారు. రెండో బిడ్డకు ఆమె త్వరలో జన్మనివ్వబోతున్నారు. మళ్లీ తల్లి కాబోతున్నందుకు తన ఆనందాన్ని పంచుకుంది.  

బావ  సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ప్రణీత సుభాష్. సెకండ్ హీరోయిన్ గా  ఎక్కువ సినిమాల్లో నటించి మెప్పించింది. 


మంచి ఫామ్ లో ఉండగానే పెళ్లి చేసుకుంది ప్రణీత.  2021లో నితిన్ రాజుతో ప్రణీత సుభాష్ వివాహం జరిగింది. పెళ్ళి తరువాత కొంత విరామం తీసుకుంది ప్రణీత. బిడ్డ పుట్టిన తరువాత  మళ్లీ సినిమాల్లో నటిస్తున్న ఈ భామ.. తాజాగా మరోబిడ్డను కనబోతోంది. 

మొదట పాపకు జన్మనిచ్చిన ప్రణీత.. ప్రస్తుతం రెండో సారి ప్రెగ్నెంట్ అయ్యింది.  తన రెండో గర్భం గురించి ప్రణీత సుభాష్  సంతోషంతో ప్రకటనచేసింది. 

సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉండే ప్రణీత సుభాష్.. ఎప్పటికప్పుడు తనకు సబంధించిన విషయాలు అభిమానులకు అప్ డేట్ చేస్తుంటుంది. తన పోటోలు షేర్ చేస్తుంటుంది. 

బెంగళూరులోని బెస్టియన్ గార్డెన్ సిటీలో ప్రణీత సుభాష్ బేబీ షవర్ వేడుక చాలా ఘనంగా జరిగింది. బంధువులు, స్నేహితులు.. ఇండస్ట్రీ నుంచి ప్రణీత ఆత్మీయులు ఈ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. 

ఇక ఈ వేడుకల్లో ప్రణీత కుటుంబం డ్రెస్ కోడ్ ను ఫలో అయ్యారు.  ఫ్యామిలీ అంతా.. వైట్ కలర్ డ్రెస్సుల్లో మెరిసిపోయారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోసల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఫ్యాన్స్ రకరకాల కామెంట్లు కూడా చేస్తున్నారు. 

Latest Videos

click me!