Prabhas Salaar Movie : రెండు భాగాలుగా ప్రభాస్ సలార్ మూవీ..? అందుకే బుచ్చిబాబును ఎన్టీఆర్ లైన్ లో పెట్టాడా..?

First Published | Jan 30, 2022, 7:44 AM IST

పాన్ ఇండియ ఆడియన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా సలార్. ప్రభాస్ (Prabhas) హీరోగా భారీ అంచనాలను పెంచుకుంటున్న ఈసినిమాను కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు. ఇక ఈమూవీ గురించి మరో వార్త ఇప్పుడు సంచలనంగా మారింది.   

ప్రస్తుతం వరుసగా సినిమాలను లైన్‌లో పెట్టేశాడు ప్రభాస్(Prabhas). రాధే శ్యామ్ ఆల్రెడీ పూర్తయింది. ఆది పురుష్ షూటింగ్ కూడా కంప్లిట్ అయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు నడుస్తున్నాయి. ఇక సలార్(Salaar) షూటింగ్ ఫుల్ స్వింగులో ఉంది. ఇది వరకే రెండు షెడ్యూల్స్ అయిపోయాయి. ప్రాజెక్ట్ కే కూడా ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. స్పిరిట్ సినిమా ప్రకటించారు. కానీ ఇంకా షూటింగ్ మొదలుపెట్టలేదు. ఈ మధ్యలో మారుతి సినిమాకు సంబంధించిన రూమర్లు వచ్చాయి. ఇక మైత్రీ మూవీస్ నిర్మించే సినిమాకు సంబంధించిన రూమర్లు కూడా వచ్చాయి.

ఇక ఇప్పుడు సలార్ సినిమాకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ సినిమా రెండు పార్టులుగా రిలీజ్ కాబోతుందట. కేజేఎఫ్(KGF) మాదిరిగానే సలార్ ను కూడా  రెండు భాగాలుగా చేస్తే ఎలా ఉంటుందనే విషయాన్నిప్రభాస్ తో చర్చిస్తున్నాట దర్శకుడు ప్రశాంత్ నీల్. అయితే దీనీపై ఇప్పటి వరకూ ప్రభాస్(Prabhas)  నుంచి ఎటివంటి స్పందన రాలేదని తెలుస్తోంది. అయితే ప్రభాస్(Prabhas) కూడా ఈ విషయంలో పాజిటీవ్ గానే ఉన్నట్టు సమాచారం. దీనిపై ఇప్పటి వరకూ ఎటువంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు.


ఈ విషయం గురించి త్వరలో హోంబళే నుంచి అపీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది.  అంతే కాదు.. ఈ మూవీకి సంబంధించి మరో రూమర్ కూడా గట్టిగా  నడుస్తుంది.  ఇందులో ఓ సీన్ కోసం ఏకంగా 80 కోట్లు ఖర్చు పెట్టబోతోన్నాడట. ఈ చిత్రంలో ప్రభాస్(Prabhas) అత్యంత క్రూరంగా కనిపించబోతోన్నాడని టాక్.  భారీ ఎత్తున నిర్మించే యాక్షన్ సీన్ల కోసం మిలటరీ వాన్‌లు, గన్స్ వంటివాటిని కూడా వాడుతున్నారట.

ప్రస్తుంతం రెండు భాగాలుగా సినినిమాలను తెరకెక్కించే ట్రెండ్ గట్టిగా నడుస్తోంది. ఇప్పటికే ప్రభాస్(Prabhas) రెండు భాగాలుగా తెరకెక్కిన బాహుబలిలో నటించగా దర్శకుడు ప్రశాంత్ కూడా కేజీఎఫ్ రెండో భాగం సిద్ధమవుతోంది. అల్లు అర్జున్(Allu Arjun) పుష్ప కూడా రెండు భాగాలుగానే తెరకెక్కుతోంది. ఫస్ట్ పార్ట్ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో ఏంత హిట్ అయ్యిందో చూశాం.

ఈ కారణంగానే సలార్(Salaar) రెండు పార్టులపై ఆలోచన చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఒకవేళ అదే నిజమైతే స్క్రిప్ట్ డెవలప్మెంట్, బడ్జెట్, కాల్ షీట్స్ ఇలా అన్నీ పొడగించుకోవాల్సిందే. దాంతో ప్రభాస్ తో పాటు ప్రశాంత్ నీల్ చేయాల్సిన సినిమాల షెడ్యూల్స్ లో కూడా ఛేంజ్ తప్పదు. ఇటు ప్రభాస్ మరో నాలుగైదు సినిమాలు కమిట్ అయ్యి ఉన్నాడు అటు ప్రశాంత్ కూడా ఎన్టీఆర్ తో సినిమా కమిట్ అయ్యి ఉన్నాడు.  మరి ఇదంతా ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాల్సి ఉంది.

అయితే ఈ సినిమాపైన అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తే.. అటు ఎన్టీఆర్(NTR) కూడా తన షెడ్యూల్స్ ను మార్చుకునే అవకాశం ఉంది. ఎంతుకంటే.. సలార్ తరువాత ప్రశాంత్ నీల్ వెంటనే ఎన్టీఆర్ సినిమాను స్టార్ట్ చేయాలి అనుకున్నాడు. అటు ఎన్టీఆర్ కూడా కొరటాల శివతో సినిమాను త్వరగా పూర్తి చేసి.. వెంటనే ప్రశాంత్ తో జాయిన్ అవ్వాలి అనుకున్నాడు.  కాని ఇప్పుడు పరిస్థితులు ఇలా మారిపోవడంతో.. కొరటాల శివ తరువాత ఎన్టీఆర్(NTR)... ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుకు ఛాన్స్ ఇవ్వబోతున్నాడు అనే టాక్ గట్టిగానడుస్తుంది.

నిజంగాసలార్(Salaar) రెండు భాగాలు ఉంటే.. సెకండ్ పార్ట్ మూవీ కంప్లీట్ అయ్యే సరికి ఈ ఏడాది అయిపోతోంది. ఈలోపు ఎన్టీఆర్ తన కమిట్ మెంట్స్ ను కంప్లీట్ చేసుకుంటే.. లెక్క సరిపోతుంది కదా అని ఆలోచిస్తున్నట్టు సమాచారం. మరో వైపు ప్రభాస్ కూడా తన వరుస సినిమాల షెడ్యూల్స్ నుంచి కొన్ని కాల్షీట్స్ ను సలార్ 2 కోసం త్యాగం చేయాల్సి ఉంటుంది. మరి ఏ సినిమాకు ఎసరు పెట్టి ప్రభాస్ (Prabhas).. సలార్2ను కంప్లీట్ చేస్తాడో చూడాలి. అసలిది ఆచరణలోకి వస్తుందా..? రూమర్ గానే మిగిలిపోతుందా అనేది కూడా చూడాలి.

ఈ సినిమాలో స్టార్ట్ కాస్ట్ ను రంగంలోకి దింపాడు ప్రశాంత్ నిల్. హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తోంది. ఆద్య పాత్రలో ఆమెకు సంబంధించిన లుక్ ను.. శృతి భర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశారు టీమ్. మరో పాత్రలో జగపతి బాబు చాలా క్రూయెల్ గా కనిపించబోతున్నారు. మొత్తానికి.. ఓవర్ ఆల్ గా సలార్ సినిమా అంచానలు మరింత పెంచుకుంటూ పోతోంది.

Latest Videos

click me!