Salaar: కేజిఎఫ్ 2 థియేటర్స్ లో సలార్ ఫస్ట్ గ్లింప్స్.. ప్లాన్ అదిరింది, మోత మోగడమే ఇక..

Published : Apr 07, 2022, 01:38 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ కి తగ్గ సక్సెస్ బాహుబలి తర్వాత దక్కడం లేదు. బాహుబలి 2 తర్వాత వచ్చిన సాహో ఉసూరుమనిపించింది. రొమాంటిక్ గా హిట్ కొడతాడని భావించిన రాధే శ్యామ్ కూడా నిరాశపరిచింది.

PREV
16
Salaar: కేజిఎఫ్ 2 థియేటర్స్ లో సలార్ ఫస్ట్ గ్లింప్స్.. ప్లాన్ అదిరింది, మోత మోగడమే ఇక..
kgf2, salaar

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ కి తగ్గ సక్సెస్ బాహుబలి తర్వాత దక్కడం లేదు. బాహుబలి 2 తర్వాత వచ్చిన సాహో ఉసూరుమనిపించింది. రొమాంటిక్ గా హిట్ కొడతాడని భావించిన రాధే శ్యామ్ కూడా నిరాశపరిచింది. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ డం స్థాయికి తగ్గ విజయం కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. 

26
KGF2

ప్రభాస్ సినిమాల జాబితాలో నెక్స్ట్ రేసులో ఉన్నవి సాలార్, ఆది పురుష్ చిత్రాలు. సలార్ చిత్రం జూలైలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ప్రభాస్ ఆర్మీ కమాండర్ గా పవర్ ఫుల్ రోల్ లో నటిస్తున్నాడు. కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకుడు కావడంతో అంచనాలు మరో స్థాయిలో ఉన్నాయి. 

36
Salaar

ఇదిలా ఉండగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కెజిఎఫ్ చాప్టర్ 2 ఏప్రిల్ 14న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. కెజిఎఫ్ మొదటి భాగం ఇండియా వ్యాప్తంగా తిరుగులేని విజయం సాధించింది. దీనితో కేజిఎఫ్ 2పై కనీవినీ ఎరుగని అంచనాలు ఉన్నాయి. 

46
Salaar

కెజిఎఫ్ క్రేజ్ ని క్యాష్ చేసుకునే పనిలో ప్రశాంత్ నీల్ ఉన్నట్లు తెలుస్తోంది. కేజీఎఫ్ 2 ప్రదర్శించబోతున్న థియేటర్స్ లో ప్రభాస్ సలార్ చిత్ర ఫస్ట్ గ్లింప్స్ ని ప్రదరించబోతున్నట్లు టాక్. ఈ మేరకు కెజిఎఫ్ 2 ప్రింట్స్ లో సలార్ గ్లింప్స్ ని అటాచ్ చేస్తున్నారట. 

56
Salaar

ఆల్రెడీ సమాచారాన్ని ఎగ్జిబిటర్లకు కూడా చేరవేసినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు సలార్ చిత్రం నుంచి ప్రభాస్ లుక్ మాత్రమే బయటకు వచ్చింది. కనీసం చిన్న టీజర్ అయినా విడుదల చేస్తే బావుంటుంది అని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. 

66
Salaar

కెజిఎఫ్ 2 థియేటర్స్ లో సలార్ గ్లింప్స్ ని విడుదల చేస్తే అభిమానుల దాహం కొంతైనా తీరుతుంది. ఇదే కనుక జరిగితే కెజిఎఫ్ 2థియేటర్స్ లో మోత మోగడం ఖాయం. ఎందుకంటే ప్రశాంత్ నీల్ ఎలివేషన్స్ మామూలుగా ఉండవు. పవర్ ఫుల్ ఎలివేషన్స్ లో కొన్ని సెకండ్ల పాటు ప్రభాస్ కనిపించినా అభిమానులకు పూనకాలు తప్పవు. ఈ చిత్రంలో ప్రభాస్ కి జోడిగా శృతి హాసన్ నటిస్తోంది. ఈశ్వరి రావు, పృథ్వి రాజ్ సుకుమారన్, జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories