పాన్ ఇండియా స్టార్ హోదా తెచ్చుకుంటే మార్కెట్ పది రెట్లు పెరుగుతుంది. అదే స్థాయిలో రెమ్యూనరేషన్ కూడా పెరుగుతుంది. దానికి ప్రభాస్ నిదర్శనం. ప్రభాస్ తో మూవీ అంటే రూ. 500 కోట్ల బడ్జెట్ కావాలి. ఇక ప్రభాస్ రూ. 100 నుండి 150 కోట్లు రెమ్యూనరేషన్ గా తీసుకుంటున్నాడు. గత మూడు దశాబ్దాలుగా బాలీవుడ్ లో సక్సెస్ కావాలని సౌత్ హీరోలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్క రజినీకాంత్ మాత్రమే సక్సెస్ అయ్యారు. చిరంజీవి, నాగార్జున లాంటి హీరోలు ప్రయత్నించినా పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదు. కాగా ప్రస్తుతం ఆరుగురు సూపర్ స్టార్స్ బాలీవుడ్ లో తమ మార్క్ క్రియేట్ చేశారు. రజనీకాంత్ (Rajinikanth)కి ఎప్పటి నుండో బాలీవుడ్ లో మార్కెట్ ఉంది. ఆయన అమితాబ్ తో పాటు కొందరు స్టార్ హీరోలతో హిందీ మల్టీస్టారర్స్ చేశారు. సోలో హీరోగా కూడా భారీ విజయాలు ఆయన దక్కించుకున్నారు. రోబో, 2.0 చిత్రాలు వసూళ్ల వర్షం కురిపించాయి.