Pawan Kalyan Body : పవన్ కళ్యాణ్ బాడీని చూస్తే నోరెళ్ల బెట్టాల్సిందే.. మేక్ ఓవర్ మామూలుగా లేదు కదా.!

Published : Apr 07, 2022, 11:20 AM ISTUpdated : Apr 07, 2022, 11:39 AM IST

పవన్ కళ్యాణ్ బాడీ ట్రాన్స్ ఫామ్ షాకింగ్ గా ఉంది. చూస్తుచూస్తుండగానే పవర్ స్టార్ తన బాడీని ఫిట్ గా మార్చేశాడు. తాజా లుక్ లో వపన్ ని చూస్తే  దిమ్మతిరిపోవాల్సిందే. లేటెస్ట్ మేక్ ఓవర్ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

PREV
18
Pawan Kalyan Body : పవన్ కళ్యాణ్ బాడీని చూస్తే నోరెళ్ల బెట్టాల్సిందే.. మేక్ ఓవర్ మామూలుగా లేదు కదా.!

పాత్రకు అనుగుణంగా తన బాడీని తయారు చేసుకోవడంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దిట్ట అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా పవన్ నటిస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’ కోసం తన శరీరాకృతిని పూర్తిగా మార్చేశాడు పవర్ స్టార్. భీమ్లానాయక్ పాత్ర నుంచి వీరమల్లుగా పవన్ మేక్ ఓవర్ ఆకట్టుకుంటోంది.
 

28

భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది పవర్ స్టార్ రాబోయే చిత్రం హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu). 17వ శతాబ్దానికి  చెందిన ప్రాచీన కథతో ప్రేక్షకులను అలరించేందుకు డైరెక్టర్ క్రిష్ అన్ని విధాలుగా సిద్ధమవుతున్నారు. ఈ మేరకు షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసేందుకు మళ్లీ రెడీ అయ్యారు. 
 

38

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (PowerStar Pawan Kalyan)తన కెరియర్లోనే ఫస్ట్ టైమ్ హిస్టారికల్ మూవీ చేస్తున్నాడు. ఆల్ రెడీ శాతకర్ణి, మణికర్ణిక లాంటి సినిమాలతో సత్తా చాటిన క్రిష్ డైరెక్షన్ లో పవర్ స్టార్ హరి హర వీరమల్లుగా కనిపించనున్నాడు. 

48

అయితే, ఈ పాన్ ఇండియా మూవీ కోసం పవర్ స్టార్ తన బాడీని ఉక్కులా మార్చేశాడు. భారీ యుద్ధ విన్యాసాల కోసం ఫిట్ గా తయారయ్యాడు. తాజాగా రిలీజ్ అయిన ‘భీమ్లా నాయక్’ (Bheemla Nayak)కు.. ప్రస్తుతానికి పవన్ శరీరాకృతిలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. 

58

బాడీని ఫిట్ గా ఉంచేందుకు పవన్ ప్రత్యేక ఎక్సర్ సైజ్ లు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు హరిహర వీరమల్లులోని యుద్ధ విన్యాసాల కోసం ఫ్లైక్సిబుల్ బాడీ కోసం శ్రమిస్తున్నాడు పవన్. ఈ మేరకు హరిహర వీరమల్లు కోసం చేస్తున్న పవర్ ఫుల్ రిహార్సల్స్ కు సంబంధించిన ఫొటోలను మేకర్స్ షేర్ చేశారు. 

68

ఫొటోల్లో పవన్ కళ్యాణ్ ఫుల్ ఎనర్జిటిక్ గా, ఫిట్ గా కనిపిస్తున్నారు. తన షోల్డర్స్, చెస్ట్ డెవలప్ మెంట్ చూస్తే సినిమా కోసం ఎంతలా వర్క్ అవుట్స్ చేస్తున్నాడో ఇట్టే తెలిసిపోతోంది. మరోవైపు బళ్లెం, కర్రసాములోనూ ప్రత్యేకంగా రిహార్సల్స్ చేస్తున్నారు. ఈ దృశ్యాలను చూస్తుంటే క్రిష్ అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. 
 

78

హరిహర వీరమల్లు చిత్రం.. ఈ పాటికి పూర్తయ్యి ఉండాలి. కానీ కరోనా నేపథ్యంలో షూటింగ్ షెడ్యూల్ కూడా వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పటి వరకు 50 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకున్న టీం.. మిగితా పార్ట్ ను శరవేగంగా పూర్తి చేయనుంది. ఇందుకు ఏప్రిల్ 8 (రేపు) నుంచి రెగ్యూలర్ షూటింగ్ జరుపుకోనున్నారు. 
 

88

పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ (Nidhi Agarwal) హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. డైరెక్టర్ క్రిష్ ఈ భారీ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్  బ్యానర్ పై నిర్మాత ఏ దయాకర్ రావు రూ.200 కోట్లతో ఈ పీరియడ్ యాక్షన్ అడ్వెంచర్ ను తెరక్కిస్తున్నారు. ఎంఎం కీరవాణీ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా మొగల్ చక్రవర్తుల కాలంలో నడుస్తుందని సమాచారం.  
 

Read more Photos on
click me!

Recommended Stories