ఇద్దరి మధ్య ప్రేమకు కారణమైన అయాన్ ముఖర్జీ..
2017లో దర్శకుడు అయాన్ ముఖర్జీ బ్రహ్మాస్త్ర మూవీ ప్రకటించారు. అలాగే ఈ మూవీలో రన్బీర్, అలియా నటిస్తున్నట్లు తెలియజేశారు. బ్రహ్మాస్త్ర మూవీ రన్బీర్, అలియాలను దగ్గర చేసింది. వీరి మధ్య ఏదో నడుస్తోందన్న పుకార్లు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో సోనమ్ కపూర్ పెళ్లి వేడుకలో జంటగా పాల్గొన్న అలియా-రన్బీర్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారు. తర్వాత కొద్దిరోజులకే రన్బీర్ అలియాతో తన రిలేషన్షిప్ పై ఓపెన్ అయ్యారు.