మెడలో హారంతో `ఢీ` పూర్ణ రాజహంస పోజులు.. చీరకట్టులోనూ యమా హాట్‌గా ఉందంటూ నెటిజన్ల కామెంట్‌..

Published : Oct 14, 2021, 04:46 PM IST

`ఢీ` పూర్ణ నటిగా మంచి గుర్తింపుని తెచ్చుకుంది. హీరోయిన్‌గా సిల్వర్‌ స్క్రీన్‌పై మెప్పించింది. నటిగానూ అలరించింది. ఇప్పుడు బుల్లితెరపై కూడా తన టాలెంట్‌ని చాటుకుంటుంది. సినిమాలకు మించిన క్రేజ్‌ని సోషల్‌ మీడియా ద్వారా పొందుతుంది పూర్ణ. 

PREV
18
మెడలో హారంతో `ఢీ` పూర్ణ రాజహంస పోజులు.. చీరకట్టులోనూ యమా హాట్‌గా ఉందంటూ నెటిజన్ల కామెంట్‌..

`ఢీ` డాన్స్  షో తెలుగు నాట ఎంతగా పాపులర్ అయ్యిందో తెలిసిందే. మట్టిలో మాణిక్యాలను వెలికి తీసినట్టు, అద్భుతమైన డాన్సర్లని, కొరియోగ్రాఫర్లని తయారు చేస్తుంది `ఢీ` షో. ఈ షో లేటెస్ట్ సీజన్ లో ప్రియమణి, గణేష్‌ మాస్టర్‌లతో కలిసి పూర్ణ(poorna) కూడా జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. జడ్జ్ సీట్‌లో కూర్చొని తన జడ్జ్ మెంట్‌లో ఆకట్టుకుంటుందీ భామ. 

28

పూర్ణ మంచి డాన్సర్‌ కూడా. డాన్సింగ్‌లో మంచి పట్టుంది. అందులోని లోటు పాట్లు తెలుసు. అందుకే  dhee  లాంటి ప్రతిష్టాత్మక రియాలిటీ షోకి జడ్జ్ గా వ్యవహరిస్తుంది. ఇందులో కేవలం జడ్జ్ గా మాత్రమే కాదు, తనదైన డైలాగులు, ముద్దు ముద్దు మాటలతోనూ ఎట్రాక్ట్ చేస్తుంది. అదే సమయంలో సుడిగాలి సుధీర్‌, హైపర్‌ ఆదిలపై పంచ్‌లు వేస్తూ ఆకట్టుకుంటుంది పూర్ణ. 
 

38

ఈ షో కోసం ప్రతి వారం గ్లామరస్‌గా ముస్తాబై కనువిందు చేస్తుంది పూర్ణ. ట్రెండీ వేర్‌లో అందాలను చూపిస్తూ కుర్రాళ్లని హంట్‌ చేస్తుంది. పొట్టిదుస్తులు ధరించి ఫోటోలకు పోజులిస్తూ కుర్రాళ్ల కొంప కొల్లేరు చేస్తుంది. తాజాగా పట్టు శారీలో మెరిసింది పూర్ణ. poorna saree looks.
 

48

విజయదశమి సందర్బంగా `ఢీ` షో బుధవారం రాత్రి ప్రసారమైన విషయం తెలిసిందే. దీంతో పండుగ కళని తీసుకొస్తుంది. అందులో భాగంగా పట్టు శారీలో హోయలు పోయింది. మెడలో హారంతో, చెవికి దుద్దులతో రాజహంసలా ఉంది పూర్ణ. ప్రస్తుతం పూర్ణ పంచుకున్న ఈ లేటెస్ట్ ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. అభిమానులు అలరిస్తున్నాయి. 
 

58

పూర్ణ హాట్‌ అందాలను మిస్‌ అవుతున్నామని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతుందే, విజయదశమి పండుగ కళ మొత్తం మీలోనే కనిపిస్తుందంటూ మరికొందరు ప్రశంసిస్తున్నారు. పూర్ణ ఫోటోలను సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ చేస్తున్నారు. 
 

68

పూర్ణ ఇటీవల `సుందరి` చిత్రంతో ఆడియెన్స్ ముందుకొచ్చింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్‌ కాలేదు. మరోవైపు `తలైవి`లోనూ మెరిసింది. తమిళనాడు మాజీ సీఎం జయలలిత జీవితం ఆధారంగా రూపొందిన చిత్రమిది. ఇందులో జయలలిత సహాయకురాలు శశికళ పాత్రలో అబ్బురపరిచింది. 
 

78

ప్రస్తుతం పూర్ణ బాలకృష్ణతో `అఖండ`, వెంకటేష్‌తో `దృశ్యం 2` చిత్రాలతోపాటు `బ్యాక్‌ డోర్‌`, `తెలుగులో నాకు నచ్చని పదం ప్రేమ` చిత్రాల్లో నటిస్తుంది. ఈ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. వీటితోపాటు తమిళం, మలయాళం, కన్నడ చిత్రాలతోనూ బిజీగా ఉంది. 
 

88

ఓ వైపు సినిమాలు, మరోవైపు టీవీ షోస్‌, ఇంకోవైపు వెబ్‌ సిరీస్‌లు కూడా చేస్తుంది పూర్ణ. తమిళంలో గతేడాది `కన్నమోచి` వెబ్‌ సిరీస్‌లో నటించింది. ఇప్పుడు తమిళంలో `నవరస`లో నటిస్తుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories