కోట్ల విలువైన కారు వదిలేసి ఆటోలో పూజా హెగ్డే జర్నీ.. చిలిపి నవ్వులతో శ్రీలంకలో బుట్టబొమ్మ సందడి

Published : May 01, 2023, 01:53 PM IST

పూజా హెగ్డే వెకేషన్‌ ఎంజాయ్‌ చేస్తుంది. ఆమె నటిస్తున్న షూటింగ్‌లకు గ్యాప్‌ రావడంతో వెకేషన్‌కి వెళ్లింది. ప్రస్తుతం ఈ బ్యూటీ శ్రీలంకలో సందడి చేస్తుంది. ఈ సందర్భంగా షేర్‌ చేసిన ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.   

PREV
15
కోట్ల విలువైన కారు వదిలేసి ఆటోలో పూజా హెగ్డే జర్నీ.. చిలిపి నవ్వులతో శ్రీలంకలో బుట్టబొమ్మ సందడి

పూజా హెగ్డే ప్రస్తుతం మహేష్‌ బాబుతో `ఎస్‌ఎస్‌ఎంబీ 28` చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం వాయిదా పడింది. దీంతో మహేష్‌బాబు ఫారెన్‌ వెళ్లారు. మరోవైపు పూజా హెగ్డే సైతం వెకేషన్‌కి వెళ్లింది. అందులో భాగంగా ఆమె శ్రీలంకలో సందడి చేస్తుంది. ఇందులో  జబ్బలపై టాప్‌ జారిపోతుండగా, చిలిపి నవ్వులు చిందిస్తూ పూజా హెగ్డే ఆద్యంతం ఆకట్టుకుంటుంది. నెటిజన్లని కట్టిపడేస్తుంది. 
 

25

ఇందులో బుట్టబొమ్మ చేసిన పనికి నెటిజన్లు అభినందనలు తెలియజేస్తున్నారు. పూజా సినిమాల ద్వారా కోట్లు సంపాదిస్తుంది. ఇక్కడ కోట్ల విలువ చేసే లగ్జరీ కార్లు వాడుతుంది. అలాగే శ్రీలంకలోనూ కావాలంటే లగ్జరీ కార్లు బుక్‌ చేసుకోవచ్చు. కానీ ఆటోలో ప్రయాణించడం ఆశ్చర్యపరుస్తుంది. త్వరగా వెళ్లేందుకు తాను ఆటోని ఆశ్రయించినట్టుగా పేర్కొంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. 
 

35

దీనిపై నెటిజన్ల నుంచిప్రశంసలు దక్కుతున్నాయి. ఆమె తన అవసరం కోసం ఆటోలో వెళ్లినా, మే డే రోజు ఆటోలో ప్రయాణించడంతో అభినందనలు తెలియజేస్తున్నారు. కార్మికుల్లో ఒకరైన ఆటో డ్రైవర్లకి కొంత సపోర్ట్ గా నిలిచినట్టే అవుతుందని, వారిని గౌరవించినట్టే అవుతుందని అంటున్నారు. అందుకే ఈ బ్యూటీని అభినందిస్తున్నారు. మరోవైపు ఆటోలో ఆమె ఉన్న లుక్‌ ని చూసి బుట్టబొమ్మ స్టన్నింగ్ లుక్‌ అంటూ కామెంట్ చేస్తున్నారు.
 

45

పూజాహెగ్డే చేతిలో ఇప్పుడు ఒక్క సినిమానే ఉంది. మహేష్‌బాబుతో త్రివిక్రమ్‌ చిత్రంలో నటిస్తుంది. అయితే ఇంకా ఆమె షూటింగ్‌లో జాయిన్‌ కాలేదని సమాచారం. ఈ సినిమాకి సంబంధించిన విషయాలు చర్చనీయాంశంగా మారుతుంది. ఇప్పటి వరకు తీసిన ఫైట్స్, కీలక సీన్ల విసయంలో మహేష్‌ అసంతృప్తిగా ఉన్నారని, అటు త్రివిక్రమ్‌ సైతం డిజప్పాయింట్‌ అయ్యారని, దీంతో అన్ని పక్కన పెట్టి మళ్లీ షూట్‌ చేస్తున్నారనే వార్తలొచ్చాయి. ఆ గ్యాప్‌ రావడంతోనే మహేష్‌ వెకేషన్‌కి వెళ్లారని టాక్‌. 
 

55

మరోవైపు పవన్‌ కళ్యాణ్ తో హరీష్‌ శంకర్‌ సినిమా `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌`లో నటించాల్సి ఉంది. కానీ ఆమెని తప్పించారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇటీవల హిందీలో సల్మాన్‌ ఖాన్‌తో కలిసి నటించిన `కిసి కా భాయ్‌ కిసి కీ జాన్‌` చిత్రం విడుదలై నెగటివ్‌ టాక్‌కి తెచ్చుకుంది. కానీ సుమారు వంద కోట్ల కలెక్షన్లని రాబట్టినట్టు సమాచారం. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories