షాపింగ్ మాల్ ను ప్రారంభించిన పూజా హెగ్దే.. హాట్ టాపిక్ గ్గా రెమ్యునరేషన్?

First Published | Aug 26, 2023, 6:11 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే తాజాగా ఓ షాపింగ్ మాల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా చీరకట్టులో మెరిసింది. అయితే, షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు బుట్టబొమ్మ తీసుకున్న రెమ్యునరేషన్ హాట్ టాపిక్ గ్గా మారింది.
 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే (Pooja Hegde) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బడా హీరోల సరసన నటించి మెప్పించింది. ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను దక్కించుకుంది. ప్రస్తుతం సినిమాల జోరు పెద్దగా లేదు. 
 

సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన  ‘గుంటూరు కారం’లో నటించాల్సిన పూజా హెగ్దే.. పలు కారణాలతో తప్పుకున్నట్టు  తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో ఎలాంటి ప్రాజెక్ట్స్ లేవు. నెక్ట్స్ ఎలాంటి సినిమాలో మెరుస్తుందోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు. 
 


అటు సోషల్ మీడియాలోనూ పూజా పెద్దగా సందడి లేదు. కానీ తాజాగా ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు హాజరై రచ్చ చేసింది. ఆంధ్రప్రదేశ్  కడపలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్  స్టోర్ ను ప్రారంభించింది. ఈ సందర్భంగా పూజాను చూసేందుకు అభిమానులు తరలివచ్చారు. 

షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో పూజా బ్లూ కలర్ శారీ, స్లీవ్ లెస్ బ్లౌజ్ లో మెరిసింది. బ్యూటీఫుల్ లుక్ తో పాటు గ్లామర్ మెరుపులతో కట్టిపడేసింది. ఓపెనింగ్ సందర్భంగా డాన్స్ మూవ్స్ తోనూ అభిమానులను ఖుషీ చేసింది. వారితో సెల్ఫీలు కూడా దిగింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. 
 

మరోవైపు పూజా హెగ్దే షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు తీసుకున్న రెమ్యునరేషన్ అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది. ఒక్క షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి హాజరైతే పూజా రూ.40 లక్షలకు పైగా పారితోషికం తీసుకుంటున్నారంట. ఇదే విషయం నెట్టింట చక్కర్లు కొడుతోంది. 
 

ఇక కెరీర్ విషయానికొస్తే.. పూజా హెగ్దే వరుసగా నాలుగైదు ఫ్లాప్స్ ను అందుకుంది. ‘రాధే శ్యామ్’, ‘బీస్ట్’, ‘ఆచార్య’, ‘సర్కస్’, ‘కిసి కా బాయ్ కిసి కి జాన్’ చిత్రాలు ఆశించిన ఫలితాలనివ్వలేదు. దీంతో బుట్టబొమ్మ క్రేజ్ తగ్గిపోయిందంటున్నారు. ఇప్పటి వరకూ నెక్ట్స్ సినిమాపై అప్డేట్ ఇవ్వలేదు. ఈ క్రమంలో తదుపరి చిత్ర ప్రకటన కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. 
 

Latest Videos

click me!