‘గుంటూరు కారం’ నుంచి పూజా హెగ్దే అవుట్? రీజన్ ఎంటీ? బుట్టబొమ్మ ఛాన్స్ ఆమెకేనా!

First Published | Jun 20, 2023, 2:24 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజాహెగ్దేకు భారీ షాక్ తగిలింది. మహేశ్ బాబు - త్రివిక్రమ్ ‘గుంటూరు కారం’ నుంచి ఆమెను తీసేసినట్టు వార్తలు వస్తున్నాయి. కారణం ఇదేంటూ ప్రచారం జరుగుతోంది. మరో హీరోయిన్ పేరు గట్టిగానే వినిపిస్తోంది. 
 

కొంతకాలంగా పూజా హెగ్దే (Pooja Hegde)కు కాలం కలిసి రావడం లేదు. తను నటించిన సినిమాలు వరుసగా బోల్తా పడుతున్నాయి. అయినా, తెలుగులో ఈ ముద్దుగుమ్మకు భారీ క్రేజ్ ఉండటంతో ఇంకా ఆఫర్లు వస్తున్నాయి. కానీ మధ్యలోనే పూజాకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. 
 

పూజా హెగ్దే  హీరోయిన్ గా స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ - విజయ్ దేవరకొండ కాంబోలోని ‘జన గణ మన’ అర్ధంతరంగా ఆగిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వచ్చిన చిత్రాలు కూడా పెద్దగా ఆడలేదు. దీంతో బుట్టబొమ్మ పరిస్థితి ఆందోళనలో పడింది. 


కానీ, సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) సరసన మరోసారి నటించే ఛాన్స్ దక్కడంతో కాస్తా సేఫ్ జోన్ లోకి వచ్చింది. త్రివిక్రమ్ - మహేశ్ బాబు కాంబోలోని ‘గుంటూరు కారం’లో హీరోయిన్ గా అలరించబోతోందని అఫీషియల్ గా ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. 
 

ఏమైందో గానీ సడెన్ గా పూజాహెగ్దే ను తొలగించినట్టు వార్తలు వస్తున్నాయి. మొదటి నుంచి గుంటూరు కారం చిత్రం స్క్రిప్ట్, రిలీజ్ డేట్, ఇతర నటీనటుల విషయంలో మార్పులు జరుగుతూనే వచ్చాయి. తాజాగా పూజాహెగ్దేనూ తీసేసినట్టు టాక్ వినిపిస్తోంది. 

అయితే పూజా హెగ్దేకు కొన్ని విషయాల్లో ఇబ్బంది కలిగించిందని తెలుస్తోంది. అందుకే ఈ నిర్ణయం తీసుకుంటన్నారంటూ టాక్. అలాగే జున్, డిసెంబర్ లలో పూజాకు తన అప్ కమింగ్ ప్రాజెక్ట్స్  తో బిజీగా ఉంది. ఈ విషయంలో తానే తప్పుకుందని కూడా అంటున్నారు. ఏదేమైనా పూజా ‘గుంటూరు కారం’ నుంచి అవుట్ అనే అంటున్నారు. 
 

పూజా హెగ్దే, మహేశ్ గతంలో ‘మహార్షి’తో అలరించారు. ఇప్పుడు పూజా సైడ్ అవ్వడంతో మరో హీరోయిన్ పేరు గట్టిగా వినిపిస్తోంది. ఇటీవల క్రేజీ హీరోయిన్ గా మారిన సంయుక్త మీనన్ సెట్స్ లో అడుగుపెట్టబోతుందని తెలుస్తోంది. దీనిలో ఎంత నిజముందో తెలియాల్సి ఉంది. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 13న గ్రాండ్ గా విడుదల కానుంది. 
 

Latest Videos

click me!