Pooja Updates: రజనీకాంత్‌తో సినిమా ఆఫర్‌పై పూజా హెగ్డే రియాక్షన్‌.. మరో ఐటెమ్‌ నెంబర్‌కి గ్రీన్‌ సిగ్నల్‌

Published : Apr 11, 2022, 01:40 PM IST

బుట్టబొమ్మ పూజా హెగ్డేకి సంబంధించిన ఆసక్తికర విషయాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. రజనీ సినిమా, ఐటెమ్‌ సాంగ్‌, విజయ్‌తో నటించడంపై ఆమె చెప్పిన విషయాలు వైరల్‌ అవుతున్నాయి. 

PREV
16
Pooja Updates: రజనీకాంత్‌తో సినిమా ఆఫర్‌పై పూజా హెగ్డే రియాక్షన్‌.. మరో ఐటెమ్‌ నెంబర్‌కి గ్రీన్‌ సిగ్నల్‌

ఇటీవల `రాధేశ్యామ్‌`తో ఆడియెన్స్ ముందుకొచ్చిన పూజా హెగ్డే ఇప్పుడు `బీస్ట్`(Beast)తో రాబోతుంది. ఇది ఈ నెల 13న రిలీజ్‌ కాను కేవలం నెల రోజుల గ్యాప్‌తోనే రెండు సినిమాలతో ఆడియెన్స్ ని ఎంటర్‌టైన్‌ చేయబోతుంది పూజా హెగ్డే. సినిమా ప్రమోషన్‌లో భాగంగా `బీస్ట్` లో విజయ్‌తో నటించడంపై ఆమె రియాక్ట్ అయ్యింది. తన సంతోషాన్ని పంచుకుంది. విజయ్‌తో సినిమా చేయాలని చాలాకాలంగా ఉన్న కోరిక అని, ఈ చిత్రంతో నెరవేరిందని చె్పింది. విజయ్‌పై ప్రశంసలు కురిపించింది. ఆయన చాలా ఫ్రెండ్లీ పర్సన్‌ అని, వర్క్ విషయంలో ఎంతో డెడికేషన్‌తో ఉంటారని, చాలా హార్డ్ వర్కర్‌ అని చెప్పింది. 

26

ఆయన్నుంచి చాలా విషయాలను నేర్చుకున్నట్టు తెలిపింది పూజా. అంతేకాదు తనకు ఓ సర్‌ప్రైజ్‌ ఇచ్చారట. తన బర్త్ డే సందర్భంగా సీక్రెట్‌గా సర్‌ప్రైజ్‌ ప్లాన్‌ చేశారట. ఆ రోజుని మర్చిపోలేనని తెలిపింది. `బుట్ట బొమ్మ` తర్వాత  `బీస్ట్`లోని `అరబిక్‌ కుత్తు` పాట తనని ఎంతగానో పాపులర్‌ చేసిందని, వరల్డ్ వైడ్‌గా గుర్తింపు వచ్చిందని చెప్పింది. 
 

36

`బీస్ట్` చిత్రానికి నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకుడు. నెక్ట్స్ ఆయన సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో 169వ చేస్తున్నారు. రజనీకాంత్‌ చిత్రంలో నటించే అవకాశం ఉందా? అనే ప్రశ్నకి పూజా రియాక్ట్ అయ్యింది. ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ తనకైతే ఇప్పుడు తెలియదని, ఏదైనా జరగొచ్చని చెప్పింది. ఛాన్స్ వస్తే నటించేందుకు సిద్ధమే అనే హింట్‌ ఇచ్చింది బుట్టబొమ్మ. 

46

మరోవైపు పూజాహెగ్డేకి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్‌ విషయం వైరల్‌ అవుతుంది. ఆమె మరోసారి ఐటెమ్‌ నెంబర్‌ చేయబోతుందట. సుకుమార్‌ రూపొందించిన `రంగస్థలం` చిత్రంలో చరణ్‌తో ఐటెమ్‌ నెంబర్‌ చేసింది పూజా. ఇందులో `జిగేల్‌ రాణి` పాటలో ఉర్రూతలూగించింది. ఇప్పుడు మరోసారి లెగ్స్ షేక్‌ చేయబోతుందట. 

56


వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ కలిసి నటిస్తున్న `ఎఫ్‌ 3` చిత్రంలో పూజా హెగ్డే స్పెషల్‌ సాంగ్‌ చేయబోతుందని టాక్‌. ఇందులో తమన్నా, మెహరీన్‌ కథాయికలు. ఈ సినిమా మే 27న విడుదల కానుంది. అయితే సినిమాకి ముందుగా ఓ ప్రమోషన్‌ సాంగ్‌ ప్లాన్‌ చేశారట. కానీ దాన్ని ఐటెమ్‌ సాంగ్‌గా మార్చాలని, పూజా హెగ్డేతో చేయించాలని భావించారట. అందుకు  పూజా సైతం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిందని సమాచారం. ఇదే నిజమైతే జిగేల్‌ రాణి రచ్చ మామూలుగా ఉండదని చెప్పొచ్చు. 

66

ప్రస్తుతం పూజా హెగ్డే నటించిన `ఆచార్య` చిత్రం కూడా ఏప్రిల్‌ 29న రాబోతుంది. మరోవైపు మహేష్‌తో త్రివిక్రమ్‌ సినిమా చేస్తుంది. దీంతోపాటు నాగచైతన్యతో వెంకట్‌ ప్రభు సినిమా చేయనుందట. అలాగే బాలీవుడ్‌లో సల్మాన్‌ ఖాన్‌ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైంది. మరోవైపు పవన్‌తో `భవదీయుడు భగత్‌ సింగ్‌` చిత్రం చేయబోతుందని టాక్‌. స్టార్‌ హీరోలకు ఫస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుంది పూజా. బిజీగా కారణంగా ఆమె విజయ్ 66 చిత్ర ఛాన్స్ ని మిస్‌ చేసుకుంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories