ఇటీవల పూజాకు సరైన హిట్ పడలేదనే చెప్పాలి. ‘అలా వైకుంఠపురం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’తో హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ ‘రాధే శ్యామ్, బీస్ట్, ఆచార్య’తో ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోవడం లేదు. దీంతో తన తదుపరి చిత్రం ‘జన గన మణ’ (JGM)పై ఆశలు పెట్టుకుంది. ఈ మూవీలో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) సరసన నటిస్తోంది.