కొరియోగ్రాఫర్ గా కెరీర్ ప్రారంభించిన అమ్మ రాజశేఖర్.. దర్శకుడిగా కూడా రాణించారు. తెలుగులో అమ్మ రాజశేఖర్.. రణం, ఖతర్నాక్, టక్కరి లాంటి చిత్రాలు తెరకెక్కించారు. వీటిలో రణం మాత్రమే హిట్ అయింది. మిగిలిన చిత్రాలు డిజాస్టర్ గా నిలిచాయి. ప్రస్తుతం అమ్మరాజశేఖర్ తెరకెక్కించిన 'హయ్-ఫైవ్' మూవీ త్వరలో రిలీజ్ కి రెడీ అవుతోంది.