రూ. 100 కోట్ల క్లబ్ లోకి పొన్నియిన్ సెల్వన్.. రెండో రోజు కలెక్షన్స్ వివరాలు ఇలా.!

First Published Oct 2, 2022, 3:59 PM IST

తమిళంలో రూపుదిద్దుకున్న భారీ చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్ 1’ కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. కేవలం రెండు రోజుల్లో రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరినట్టు తెలుస్తోంది. రెండో రోజు కలెక్షన్ల వివరాలు తాజాగా వెల్లడయ్యాయి. 
 

ప్రముఖ తమిళ దర్శకుడు మణిరత్నం (Mani Ratnam) డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన  చిత్రం  ‘పొన్నియిన్ సెల్వన్ 1’ (Ponniyin Selvan 1) థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. ఐశ్వర్యరాయ్, చియాన్ విక్రమ్, కార్తీ, త్రిష మరియు జయం రవి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం టిక్కెట్ కౌంటర్ల వద్ద జోరుగా సాగుతోంది.
 

‘పొన్నియిన్ సెల్వన్ 1’ బాక్సాఫీస్ వద్ద రెండు రోజు మరింత దూకుడుగా వ్యవహరించింది. పాన్ ఇండియా ఫిల్మ్ గా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ చిత్రం తొలిరోజు కన్న మరింత జోరు కొనసాగించింది. తాజాగా రెండో రోజు వసూళ్ల  వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల గ్రాస్ వసూళ్లు రూ. 150 కోట్ల వరకు వచ్చిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.  
 

ఈ చిత్రం తమిళం, హిందీ, తెలుగు, మలయాళం మరియు కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. శనివారం ఈ మూవీకి భారతదేశంలో రూ. 38 కోట్లు (రూ. 34.6 కోట్ల నికర) గ్రాస్ ను వసూలు చేసింది. తమిళంలో ₹27.6 కోట్లు, తెలుగులో ₹3.45 కోట్లు, హిందీలో ₹2.85 కోట్లు, మలయాళంలో ₹70 లక్షలు వసూలు చేసింది. 
 

ఓవర్సీస్ తో కలుపుకొని పొన్నియిన్ సెల్వన్ రెండో రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.70 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో కేవలం రెండు రోజుల్లో వరల్డ్ వైడ్ రూ.153 కోట్ల గ్రాస్ కు చేరుకుందని తెలుస్తోంది. ఇవ్వాళ్టి కలెక్షన్లతో రూ.100  కోట్ల క్లబ్ లోకి నెట్ కలెక్షన్లతో అడుగుపెట్టనున్నట్టు తెలుస్తోంది. 

ప్రస్తుతం థియేటర్లలో భారీ చిత్రాలేవీ లేకపోవడంతో ప్రేక్షకుల చూపు పొన్నియిన్ సెల్వన్ వైపే ఉంది. మిక్డ్స్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం దూసుకెళ్తోంది. ఇక ఆదివారం కూడా PS1 మంచి వసూళ్లను రాబట్టిందని అంటున్నారు. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.80 కోట్ల గ్రాస్ ఓపెనింగ్‌తో 2022లో ఉత్తమ తమిళ చిత్రంగా నిలిచింది. 
 

ప్రముఖ రచయిత రచించిన ‘పొన్నియిన్ సెల్వన్’ కథను  అదే టైటిల్ తో దర్శకుడు మణిరత్నం రెండు భాగాలుగా చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం మొదటి భాగం విజయవంతంగా కొనసాగుతోంది. ఇక రెండో భాగాన్ని వచ్చే ఏడాది తెరకెక్కించేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ అద్భుతమైన సంగీతం అందించారు. మరోవైపు మూవీలోని యుద్ధ సన్నివేశాలు, వీఎఫ్ ఎక్స్ అదిరిపోయాయి. 
 

click me!