‘పొలిమేర’వివాదం,చంపేస్తానన్నాడంటూ నిర్మాత పోలీస్ ఫిర్యాదు

Published : Jul 16, 2024, 06:17 AM IST

 ఒకవేళ తనపై కంప్లైంట్ ఫైల్ చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని భయపెట్టారంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు కృష్ణ ప్రసాద్. 

PREV
112
‘పొలిమేర’వివాదం,చంపేస్తానన్నాడంటూ నిర్మాత పోలీస్ ఫిర్యాదు
Polimera 2


సినిమా ఫెయిల్యూర్ అయితే ఆ నిర్మాతకు, డిస్ట్రిబ్యూట్ చేసిన వారికి అందరికీ ఆర్దిక కష్టాలు చుట్టు ముడుతూంటాయి. మరో సినిమా తీసి హిట్ కొట్టేవరకూ ఆ నిర్మాతకు ఇబ్బందులే ఇబ్బందులు. సక్సెస్ అయ్యాక కూడా కొందరికి తిప్పలు తప్పలు. డిస్ట్రిబ్యూటర్స్ నుంచి డబ్బులు వసూలు చేసుకుని సెటిల్మెంట్ చేసుకోవటం మరో పెద్ద యజ్ఞం. రెగ్యులర్ నిర్మాతలకు తప్పించి కొత్తవారికి అది బాగా కష్టం. సినిమా హిట్ అయ్యినా రూపాయి తమకు వెనక్కి రాలేదని వాపోతూంటారు. డిస్ట్రిబ్యూటర్స్ పై మండిపడుతూంటారు. ఇదిగో చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ కొట్టిన ‘పొలిమేర 2’కు ఇదే సమస్యగా మారింది. వివాదం పోలిస్ స్టేషన్ కు ఎక్కింది. 

212

2021లో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అయ్యింది ‘పొలిమేర’.సత్యం రాజేష్ ప్రధాన పాత్రలో  అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ఓటిటిలో దుమ్ము దులిపింది.  నిల్ విశ్వనాధ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య, గెటప్ శీను లాంటి నటులు చేసారు. ఓటిటిలో విజయం తరువాత ఈ సినిమాకి సీక్వెల్ గా 'పొలిమేర 2' థియేటర్స్ లో విడుదల చేశారు.

312


 'పొలిమేర 2'  కు ఓ రేంజి ఓపినింగ్స్ రావటమే కాకుండా  మొదటి రెండు రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యింది. .చేతబడి ,మర్డర్ మిస్టరీల చుట్టూ తిరిగే ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది .చేతబడి,క్షుద్ర పూజల చుట్టూ తిరుగుతుంది.ఈ సినిమాలో వచ్చే ఊహించని ట్విస్టులు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి.

412


పొలిమేర2 చిత్రం గత ఏడాది నవంబర్ 3 వ తేదీన థియేటర్స్ లో రిలీజ్ అయి అద్భుత విజయం సాధించింది .ఈ సినిమాకు కలెక్షన్స్ భారీగా వచ్చాయి .థియేటర్ లో ఆకట్టుకున్న పొలిమేర 2 మూవీ ఓటిటిలో కూడా అదరగొట్టింది.గత ఏడాది డిసెంబర్ 8 వ తేదీన ఆహా ఓటిటిలో విడుదల అయి అక్కడ కూడా అద్భుత విజయం సాధించింది.  ప్రతిష్టాత్మకమైన 14 వ దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ 2024 లో ఈ చిత్రం అధికారికంగా ఎంపిక చేయబడింది.

512


 పొలిమేర 2 చిత్రం  ఘన విజయం సాధించటంతో ఇప్పుడు ఈ సినిమాకి ఇంకో సీక్వెల్ తయారవుతోంది. అనిల్ విశ్వనాధ్ దర్శకత్వంలో 'పొలిమేర 3' త్వరలోనే ప్రారంభం కానుంది అని అధికారికంగా సామాజిక మాధ్యమం 'ఎక్స్' లో ప్రకటించారు. డిస్ట్రిబ్యూటర్ వంశి నందిపాటి ఈ 'పొలిమేర 3' తో నిర్మాతగా మారుతున్నారు. స్క్రిప్ట్ పని అంతా అయిపోయిందని, ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని, త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ జరుపు కుటుందని చెప్పారు. అయితే ఇప్పుడే ట్విస్ట్ పడింది. 

612


‘పొలిమేర 2’  నిర్మాత గౌరీ కృష్ణ తనను మరో నిర్మాత చంపేస్తానని బెదిరిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మా ఊరి పొలిమేర 2 సినిమాని గత ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురాగా అది సూపర్ హిట్ గా నిలిచింది. అయితే ఆ సినిమాకి సంబంధించి తనకు రావాల్సిన షేర్ ఇవ్వకుండా అడిగితే చంపేస్తామని బెదిరిస్తున్నారు అంటూ డిస్ట్రిబ్యూటర్ నుంచి నిర్మాత గా మారుతున్న వంశీ నందిపాటి  మీద గౌరీ కృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో  ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. 
 

712


 తాను మా ఊరి పొలిమేర 2 అనే సినిమా నిర్మాతనని ఆ సినిమా నిర్మించిన తర్వాత సినిమాని వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తామని హక్కులు తమకు ఇవ్వాల్సిందిగా నందిపాటి వంశీ, సుబ్బారెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు తనను అప్రోచ్ అయ్యారని చెప్పుకొచ్చారు.  తనకు కూడా వారి అగ్రిమెంట్ నచ్చడంతో వారికి సినిమా రైట్స్ రాసిచ్చానని గౌరీ కృష్ణ వెల్లడించారు. 
 

812

అయితే సినిమా రిలీజ్ అయి సూపర్ హిట్ గా నిలిచిన తర్వాత దాదాపు 30 కోట్ల రూపాయలు కలెక్షన్లు రాబట్టినట్టు తెలుగులో లీడింగ్ న్యూస్ పేపర్లతో పాటు మీడియా కూడా కవర్ చేసిందని ఈ నేపథ్యంలో తనకు రావలసిన షేర్ ని అడిగితే ముందు కొన్నాళ్ల పాటు కాలం గడుపుతూ వచ్చిన వంశీ నందిపాటి తరువాత ఆ విషయాన్ని పట్టించుకోవడం మానేశాడని చెప్పుకొచ్చారు. 

912


తాను వాళ్ళ ఆఫీస్ కి వెళ్లి అడిగితే డబ్బులు ఇచ్చేది లేదని ఇంకా గట్టిగా మాట్లాడితే చంపేస్తామని బెదిరిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏదైనా ఆఫీసులకు వెళ్లినా, సంఘాలకు వెళ్లి ఫిర్యాదు చేస్తే ప్రాణాలు దక్కవని కూడా హెచ్చరించినట్లు వెల్లడించారు. తనకు ప్రాణ భయంతో పాటు తనకు రావాల్సిన డబ్బులు ఇప్పించాల్సిందిగా కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు గౌరీ కృష్ణ పేర్కొన్నారు.

1012


ఇక 'పొలిమేర', 'పొలిమేర 2' లో నటించిన సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల లు ఈ 'పొలిమేర 3' లో కూడా కంటిన్యూ అవుతారు. వీళ్ళతో పాటుగా బాలాదిత్య, గెటప్ శీను, రాకేందు మౌళి కూడా ఇందులో నటిస్తున్నారని తెలిసింది. వీళ్ళే కాకుండా ఇంకా కొంతమంది నటీనటులు ఉంటారని తెలుస్తోంది. 'పొలిమేర' సినిమాకి నిర్మాతగా వున్న భోగేంద్ర గుప్త ఈ సినిమాకి కో ప్రొడ్యూసర్ గా ఉంటారని తెలిసింది.  

1112

ఇప్పటికే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ‘పొలిమేర 1’ స్ట్రీమింగ్ అవుతోంది.   ‘మా ఊరి పొలిమేర-2’  ఓటీటీలో కూడా సత్తాచాటింది. మా ఊరి పొలిమేర-2 సినిమా డిసెంబర్ 8వ తేదీన ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఆహా గోల్డ్ సబ్‍స్క్రైబర్లకు అంతకంటే 24 గంటలు ముందుగానే అందుబాటులోకి వచ్చింది. ఆహా ఓటీటీలోనూ ఈ చిత్రం ప్రస్తుతం దూసుకెళుతోంది. స్ట్రీమింగ్‍కు వచ్చిన నాలుగు రోజుల్లోనే ఆహాలో 100 మిలియన్ల స్ట్రీమింగ్ నిమిషాల మార్కును మా ఊరి పొలిమేర-2 దాటేసింది. 

1212

`మా ఊరి పొలిమేర -2` చిత్రం విడుదలకు సిద్ధమైంది.  శ్రీకృష్ణ క్రియేష‌న్స్ బ్యానర్ పై గౌరు గ‌ణ‌బాబు స‌మ‌ర్ప‌ణ‌లో  గౌరికృష్ణ నిర్మాత‌గా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. డా.అనిల్ విశ్వ‌నాథ్ ద‌ర్శ‌కుడు.  స‌త్యం రాజేష్‌, డా. కామాక్షి భాస్కర్ల, గెట‌ప్ శ్రీను, రాకెండ్ మౌళి, బాలాదిత్య, సాహితి దాస‌రి,  ర‌వి వ‌ర్మ‌, చిత్రం శ్రీను, అక్ష‌త శ్రీనివాస్‌ ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు.  

click me!

Recommended Stories