ఆ స్టార్ హీరోయిన్ ని బాలయ్యకు తల్లిగా పరిచయం చేసిన ఎన్టీఆర్... నటసింహం రియాక్షన్ ఏమిటో తెలుసా?

Published : Jul 15, 2024, 11:32 PM IST

నందమూరి తారక రామారావు కెరీర్లో ఎందరో స్టార్స్ హీరోయిన్స్ తో జతకట్టారు. ఒక హీరోయిన్ తో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఆమె బాలకృష్ణకు తల్లి కాని తల్లి అయ్యింది...   

PREV
17
ఆ స్టార్ హీరోయిన్ ని బాలయ్యకు తల్లిగా పరిచయం చేసిన ఎన్టీఆర్... నటసింహం రియాక్షన్ ఏమిటో తెలుసా?
NTR

నందమూరి తారక రామారావు సిల్వర్ స్క్రీన్ పై తిరుగులేని స్టార్డం అనుభవించాడు . దశాబ్దాల పాటు ఆయన నెంబర్ వన్ హీరో. ముఖ్యంగా పౌరాణిక పాత్రలకు ట్రెండ్ సెట్టర్. రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు, కర్ణుడు, రావణుడు వంటి ఐకానిక్ రోల్స్ కి ఒక బెంచ్ మార్క్ సెట్ చేశారు. 

 

27
NTR

సుదీర్ఘ కెరీర్లో ఎన్టీఆర్ అనేక మంది స్టార్ హీరోయిన్స్ తో జతకట్టాడు. దాదాపు మూడు జనరేషన్స్ హీరోయిన్స్ ఎన్టీఆర్ కి జంటగా నటించారు. ఆయన సినిమాల్లో బాలనటులుగా చేసినవారు హీరోయిన్స్ గా నటించడం విశేషం. వారిలో శ్రీదేవి ఒకరు. 

37
NTR

బడిపంతులు మూవీలో శ్రీదేవి ఎన్టీఆర్ మనవరాలు పాత్ర చేసింది. శ్రీదేవి పెద్దయ్యాక హీరోయిన్ అయ్యారు. ఆమె స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది. శ్రీదేవి ఫార్మ్ లో కి వచ్చే నాటికి ఎన్టీఆర్ మాస్ కమర్షియల్ చిత్రాలు చేస్తున్నారు. జయప్రద, జయసుధ, శ్రీదేవి సమకాలీన హీరోయిన్స్ . ఈ ముగ్గురు హీరోయిన్స్ మధ్య తీవ్ర పోటీ ఉండేది. 


 

47

ఇక శ్రీదేవి-ఎన్టీఆర్ కాంబోలో బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. వేటగాడు, సర్దార్ పాపారాయుడు, కొండవీటి సింహం, గజ దొంగ, సత్యం శివం, జస్టిస్ చౌదరి, బొబ్బిలి పులి వంటి భారీ హిట్ చిత్రాల్లో శ్రీదేవి, ఎన్టీఆర్ జతకట్టారు. ఎన్టీఆర్-శ్రీదేవి కాంబినేషన్ కి ఆడియన్స్ లో ఓ క్రేజ్ ఉండేది. 
 

57
NTR

ఎన్టీఆర్ తర్వాత తరం హీరోలతో కూడా శ్రీదేవి నటించడం విశేషం. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లతో శ్రీదేవి చిత్రాలు చేశారు. వారికి జంటగా నటించింది. చిరంజీవి-శ్రీదేవి జంటగా నటించిన జగదేకవీరుడు అతిలోక సుందరి ఇండస్ట్రీ హిట్. వెంకీతో క్షణం క్షణం మూవీ చేసిన శ్రీదేవి, నాగార్జునతో గోవిందా గోవిందా మూవీలో నటించారు. 
 

67
NTR


అయితే బాలకృష్ణతో శ్రీదేవి నటించలేదు. అందుకు చాలా పెద్ద కారణమే ఉందట. తండ్రి ఆదేశం మేరకే బాలకృష్ణ హీరోయిన్ శ్రీదేవితో జత కట్టలేదట. ఎన్టీఆర్ కి జంటగా శ్రీదేవి నటించిన నేపథ్యంలో తన కొడుకు బాలయ్యకు ఆమె తల్లి అవుతారనే భావనలో ఆయన ఉండేవాడట. 
 

77
NTR

నువ్వు ఎవరితో నటించినా ఓకే... శ్రీదేవితో మాత్రం మూవీ చేయకు. నీ మూవీలో హీరోయిన్ గా ఎప్పటికీ శ్రీదేవి ఉండకూడదు అన్నాడట. దాంతో శ్రీదేవి పక్కన నటించాలనే కోరికను బాలకృష్ణ అణచుకున్నాడట. తండ్రికిచ్చిన మాట ప్రకారం శ్రీదేవితో నటించే అవకాశం వచ్చినా వదిలేశాడట. మరి ఈ వాదనలో నిజమెంత ఉందో తెలియదు..

click me!

Recommended Stories