పాయల్‌ మోకాలికి రక్తం మరకలు.. `జిన్నా` ఈవెంట్‌లో పింక్‌ డ్రెస్‌లో రచ్చ.. ఏం జరిగిందంటూ ఫ్యాన్స్‌ ఆరా

Published : Sep 09, 2022, 08:04 PM ISTUpdated : Sep 09, 2022, 09:24 PM IST

పాయల్‌ రాజ్‌పుత్.. తాజాగా `జిన్నా` టీజర్‌ ఈవెంట్‌లో  సందడి చేసింది. మంచు విష్ణు, సన్నీ లియోన్‌లతో కలిసి ఆమె రచ్చ చేసింది. కానీ ఇందులో ఆమె మోకాలికి గాయంతో కనిపించడం హాట్‌ టాపిక్‌ అవుతుంది. 

PREV
18
పాయల్‌ మోకాలికి రక్తం మరకలు.. `జిన్నా` ఈవెంట్‌లో పింక్‌ డ్రెస్‌లో రచ్చ.. ఏం జరిగిందంటూ ఫ్యాన్స్‌ ఆరా

పాయల్‌ నెమ్మదిగా సినిమా అవకాశాలను పెంచుకుంటుంది. ఒకానొక దశలో ఆమెకి సినిమాలు రావడం లేదు, ఇక పాయల్‌ పని అయిపోయిందనుకునే టైమ్‌లో సైలెంట్‌గా ఆఫర్స్ చేజిక్కించుకుకుంటూ కెరీర్‌ని ముందుకు నడిపిస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ `జిన్నా` చిత్రంలో మంచు విష్ణుతో కలిసి నటిస్తుంది.
 

28

సన్నీలియోని ఇందులో మరో కథానాయికగా నటిస్తుంది. ఫ్యామిలీ ఎలిమెంట్స్, ఎంటర్‌టైనర్‌మెంట్‌, హర్రర్‌ అంశాలతో ఈ చిత్రం రూపొందినట్టు తాజాగా విడుదలైన టీజర్‌ని చూస్తుంటే అర్థమవుతుంది. `జిన్నా` టీజర్‌ విడుదల కార్యక్రమం శుక్రవారం జరిగిన విషయం తెలిసిందే. 
 

38

ఇందులో మంచు విష్ణు, టీమ్‌తోపాటు పాయల్‌ రాజ్‌పుత్‌, సన్నీలియోన్‌లు పాల్గొని సందడి చేశారు. ట్రెండీ వేర్‌ ధరించి గ్లామర్‌తో మెస్మరైజ్‌ చేశారు. ఈ సందర్భంగా దిగిన ఫోటోలు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్నాయి. ఇందులో పాయల్‌, సన్నీ కలిసి చేసిన రచ్చ మామూలు లేదని చెప్పొచ్చు. 

48

ఇందులో పింక్‌ డ్రెస్‌లో మెరిసింది పాయల్‌. బాడీ ఫిట్‌ పింక్‌ ట్రెండీ వేర్‌లో హోయలు పోయింది. పరువాల విందుతో మతిపోగొట్టే పోజులిచ్చింది. ఇందులో దిగిన పాయల్‌ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఫ్యాన్స్ ని కట్టిపడేస్తున్నాయి. టైట్‌ ఫిట్‌ డ్రెస్‌ లో పాయల్‌ తన చుట్టుకొలతలు చూపిస్తుందా? అనేట్టుగా ఉంది. 

58

ఇదిలా ఉంటే ఇందులో పాయల్‌ రాజ్‌పుత్‌ గాయంతో కనిపించడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. పాయల్‌ సీట్లో కూర్చొన్న సమయంలో ఆమె ఎడమ కాలు మోకాలికి రక్తం మరకలున్నాయి. ఆ గాయం ఏంటనేది ఇప్పుడు సరికొత్త చర్చకి దారి తీస్తుంది. 
 

68

అయితే కొన్నిసార్లు పాయల్‌ ఆ గాయాన్ని కవర్‌ చేసే ప్రయత్నం చేసింది. చేయి అడ్డు పెట్టుకుంది. నిల్చొన్నప్పుడు ఎడమ కాలుని కుడి కాలుతో కవర్‌ చేస్తూ కనిపించింది. ఆర్టిఫీషియల్‌ నవ్వుతో కనిపించింది పాయల్‌. అయితే ఆమెకి ఏం జరిగింది? ఆ గాయానికి కారణమేంటనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. 
 

78

అనుకోకుండా పాయల్‌ గాయపడిందా? జారి పడిందా? లేక గాయం కాబడిందా? అనే ప్రశ్నలు లేవనెత్తున్నారు అభిమానులు. పాయల్ కి గాయం పట్ల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మోకాలికి రక్తం మరకలేంటని ఆరాతీస్తున్నారు. మరి ఈ గాయం వెనకాల రహస్యం ఏంటనేది ఇప్పుడు పెద్ద సస్పెన్స్ గా మారింది. సోషల్‌ మీడియాలో దీనిపై మీమ్స్, ట్రోల్స్ స్టార్ట్ అవుతుండటం గమనార్హం. 
 

88

ఇక ఇటీవల `తీస్‌ మార్‌ ఖాన్‌` చిత్రంతో అలరించిన పాయల్‌ రాజ్‌పుత్‌ ఇప్పుడు మంచు విష్ణుతో `జిన్నా` చిత్రం చేస్తుంది.ఇది అక్టోబర్‌లో విడుదల కాబోతుంది. దీంతోపాటు మరో రెండు సినిమాలున్నాయి. కాకపోతే అవి ఎప్పుడు పూర్తయితాయి, ఎప్పుడు రిలీజ్‌ అవుతాయనేది సస్పెన్స్ గా ఉంది. పాయల్‌ సినిమాలే కాదు, ఓటీటీ ఫిల్మ్స్ చేసేందుకు కూడా రెడీగానే ఉండటం విశేషం. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories