వరుస సినిమాలు, రాజకీయ యాత్రలతో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన నటించి బ్రో సినిమా రీసెంట్ గా రిలీజైంది. తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‍తో కలిసి సముద్రఖని దర్శకత్వంలో చేసిన ఈ మూవి అనుకున్న రిజల్ట్ ని ఇవ్వలేకపోయింది. ఈ నేపధ్యంలో పవన్ నుంచి రాబోయే చిత్రాలు ఉస్తాద్ భగత్‍సింగ్, ఓజీలపైనే అందరి దృష్టి ఉంది. ముఖ్యంగా ఓజీ (ఒరిజినల్ గ్యాంగ్‍స్టర్) కు విపరీతమైన క్రేజ్ ఉంది. పవన్ కూడా ఈ సినిమాని బాగా నమ్మి చేస్తున్నారు. అందుకు సాక్షం ఎక్కువ డేట్స్ కేటాయించటమే.