Ustaad Bhagat Singh Box Office: ఉస్తాద్‌ ఫస్ట్ డే కలెక్షన్లు.. పవన్‌ కళ్యాణ్‌ మూవీ హిట్‌ కావాలంటే ఎన్ని కోట్లు రావాలంటే?

Published : Mar 19, 2026, 05:07 PM IST

పవన్‌ కళ్యాణ్‌ నటించిన `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` మూవీ ఈ గురువారం ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి మొదటి రోజు ఎంత కలెక్షన్లు వస్తాయి? బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌ ఎంత అనేది చూస్తే. 

PREV
15
ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ మూవీ టాక్‌

పవర్‌ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ నటించిన `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` మూవీ నేడు గురువారం ఆడియెన్స్ ముందుకు వచ్చింది. హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో శ్రీలీలా, రాశీఖన్నా హీరోయిన్లుగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య నేడు ఆడియెన్స్ ముందుకు వచ్చింది. అయితే ఆ అంచనాలను అందుకుందా అంటే కష్టమనే చెప్పొచ్చు. దీనికి మిశ్రమ స్పందన లభిస్తోంది. రెగ్యూలర్‌ కమర్షియల్‌ మూవీ అనే టాక్‌ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ హిట్‌ కావాలంటే ఎంత రావాలి? మొదటి రోజు కలెక్షన్లు ఎంత రావచ్చు అనేది చూస్తే.

25
ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ థియేట్రికల్‌ బిజినెస్‌

పవన్‌ కళ్యాణ్‌ హీరోగా వచ్చిన ఈ మూవీ బిజినెస్‌ భారీగానే జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో గట్టిగానే అయ్యిందని సమాచారం. పవన్‌ గత మూవీ `ఓజీ` పెద్ద హిట్‌ అయ్యింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాని కూడా భారీ రేటుకి కొన్నట్టు సమాచారం. ఓవరాల్‌గా `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ.137 కోట్ల థియేట్రికల్‌ బిజినెస్‌ అయ్యిందని ట్రేడ్‌ పండితులు చెబుతున్నారు. ఇందులో తెలంగాణలో రూ.50కోట్లు, ఆంధ్రాలో రూ.54కోట్లు, సీడెడ్‌లో రూ.16 కోట్లకు అమ్ముడు పోయిందట. ఇక ఓవర్సీస్ లో రూ.12కోట్లు, కర్నాటకలో రూ.5 కోట్లకు అమ్ముడయ్యిందట. ఇలా బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌ ఇప్పుడు రూ.137కోట్లు అని టాక్‌.

35
ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ మూవీ బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌

ఈ సినిమాకి రూ.150కోట్లకుపైగా బడ్జెట్‌ అయ్యిందట. థియేట్రికల్‌ రైట్స్ రూపంలో బాగానే వచ్చింది. అదే సమయంలో ఓటీటీ కూడా గట్టిగానే అమ్ముడుపోయిందట. నెట్‌ ఫ్లిక్స్ ఈ హక్కులను సొంతం చేసుకుంది. వంద కోట్లకుపైగానే ఓటీటీ రూపంలో వచ్చిందని సమాచారం. ఈ లెక్కన నిర్మాతలకు రెండు వందల కోట్లకుపైగానే రిలీజ్‌కి ముందే వచ్చింది. వాళ్లు మంచి లాభాల్లో ఉన్నారు. మరి ఇప్పుడు థియేట్రికల్‌గా ఈ సినిమా సత్తా చాటుతుందా అనేది పెద్ద ప్రశ్న. ఈ సినిమా బ్రేక్‌ ఈవెన్‌ కావాలంటే దాదాపు రూ. 138కోట్ల షేర్‌ రావాలి. అంటే రూ.270కోట్లు రావాలి. ఓజీ స్థాయిలో ఆడితేనే వర్కౌట్‌ అవుతుంది. లేదంటే నష్టాలు తప్పవు. మరి ఏ రేంజ్‌లో సత్తా చాటుతుందో చూడాలి.

45
ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ మూవీ మొదటి రోజు కలెక్షన్ల అంచనా

ఇక ఉస్తాద్‌ భగత్ సింగ్‌ మూవీ తొలి రోజు ఎంత కలెక్ట్ చేస్తుందనేది చూస్తే, అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఇది రూ.28 కోట్ల వరకు వచ్చినట్టు టాక్‌. ఇక ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు రూ.60-70కోట్ల వరకు రాబట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు. అయితే దీనికి లాంగ్‌ వీకెండ్‌ కలిసి వస్తుంది. గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం వరకు బాగా ఆడుతుంది. రెండో వారంలోనూ సెలవులు ఉన్నాయి. ఇవన్నీ సినిమాకి హెల్ప్ అవుతాయి. అది కూడా పాజిటివ్‌ టాక్‌ వస్తేనే. లేదంటే కష్టమే. మరి పవన్‌ కళ్యాణ్‌ ఏ మేరకు బాక్సాఫీసు వద్ద సత్తా చాటుతాడో చూడాలి.

55
ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ మూవీ కథేంటంటే?

`ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` మూవీ ఎలా ఉందంటే ఇది రొటీన్‌ కమర్షియల్‌ మూవీ. కాకపోతే పవన్‌ కళ్యాణ్‌ అభిమానులను ఆకట్టుకునేలా తెరకెక్కించాడు దర్శకుడు హరీష్‌ శంకర్‌. అనాథ అయిన ఉస్తాద్‌.. ఒక గురువు ద్వారా ప్రయోజకుడు అవుతాడు. ఆ తర్వాత బాగా చదివి ఐపీఎస్‌ అవుతాడు. తన గురువు సీఎం అవుతాడు. గురువు ఆపద ఉన్నప్పుడు ఉస్తాద్‌ ఎలా అండగా నిలిచాడు, శత్రువులను ఎలా మట్టుపెట్టాడు అనే కథాంశంతో మూవీ సాగుతుంది. యాక్షన్‌, డాన్సులు, ఫన్‌ కొంత వరకు బాగుంది. ఊహించిన కథనం, రొటీన్‌ క్లైమాక్స్ మైనస్‌గా చెప్పొచ్చు. రీమిక్స్ సాంగ్స్ బాగున్నాయి. పవన్‌ కామెడీ ఫర్వాలేదు. ఓవరాల్‌గా ఇది యావరేజ్‌ మూవీ అని చెప్పొచ్చు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories