పవన్‌ కళ్యాణ్‌ `వకీల్‌సాబ్‌` ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఏకంగా ఫోర్‌ స్టార్స్..బాబోయ్‌!

First Published Apr 7, 2021, 7:59 AM IST

పవన్‌ కళ్యాణ్‌ సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతో ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. మూడేళ్ల తర్వాత ఆయన మళ్లీ సిల్వర్‌ స్క్రీన్స్ పై కనిపించబోతున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ఓవర్సీస్‌ సెన్సార్‌ రివ్యూ అంటూ నాలుగు స్టార్స్ ఇవ్వడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. 

పవన్‌ కళ్యాణ్‌ రీఎంట్రీ తర్వాత నటించిన చిత్రం `వకీల్‌సాబ్‌` ఈ నెల 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహించగా, ఇందులో అంజలి, నివేదా థామస్‌, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషించారు.
undefined
దిల్‌రాజు నిర్మించిన ఈ సినిమా ఓవర్సీస్‌ ప్రీమియర్స్ రేపు(గురువారం) పడబోతున్నారు. దీనికితోడు బెనిఫిట్‌ షోస్‌ కూడా భారీగా ప్లాన్‌ చేశారు. పవన్‌ ఫ్యాన్స్ నుంచి వస్తోన్న ఒత్తిడి మేరకు బెనిఫిట్‌ షోస్‌ ప్లాన్‌ చేయగా, భారీగా టికెట్‌ ధరలు పలుకబోతున్నట్టు టాక్‌.
undefined
ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి అప్పుడే రివ్యూ వచ్చేసింది. ఫస్ట్ రివ్యూ పేరుతో సౌత్‌ మోస్ట్ కాంట్రవర్షియల్‌ క్రిటిక్‌ ఉమర్‌ సంధు తన రివ్యూని రెండు రోజుల క్రితమే ఇచ్చేశాడు. ఓవర్సీస్‌ సెన్సార్‌ రివ్యూ పేరుతో సినిమాకి ఆయన రేటింగ్‌ కూడా ఇచ్చారు. సినిమాకి నాలుగు స్టార్స్ ఇవ్వడం విశేషం. దీంతో ఇప్పుడాయన రివ్యూలు వైరల్‌ అవుతున్నాయి.
undefined
ఇందులో ఆయన చెబుతూ, అన్ని సార్లు డిజప్పాయింట్‌ అవ్వదు అని పేర్కొన్నాడు. సినిమా చాలా గ్రిప్పింగ్‌ స్క్రీన్‌ప్లే తో సాగుతుందట. చివరి వరకు ఆడియెన్స్ అటెన్షన్‌ని హోల్డ్ చేస్తుందని చెప్పాడు. ఫస్టాఫ్‌ కాస్త స్లోగా సాగుతుందట. క్రమ క్రమం ఎంగేజ్‌ చేస్తుందని చెప్పారు.
undefined
పవన్‌ కల్యాణ్‌ అద్భుతమైన నటనని ప్రదర్శించాడని, తన నటనతో అందరి మనసులను దోచుకుంటాడని, కెరీర్‌ బెస్ట్ పర్‌ఫెర్మెన్స్ ఇచ్చాడని తెలిపారు.
undefined
పవన్‌తోపాటు ఇతర తారాగణం కూడా పవర్‌ఫుల్‌ పర్‌ఫెర్మెన్స్ ఇచ్చారట. సినిమా ఆడియెన్స్ ని దిగ్ర్భాంతికి గురి చేస్తుందని, శక్తివంతమైన సందేశాన్ని అందిస్తుందని, అది మనకు తలపై కొట్టినట్టుగా ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన సినిమాకి నాలుగు స్టార్లు ఇచ్చాడు.
undefined
అయితే ఉమర్‌ సంధు రివ్యూ అంటే అది పూర్తి అపోజిట్‌గా ఉంటుందనే టాక్ ఉంది. ఆయన గతంలో ఇచ్చిన రివ్యూలన్నీ దాదాపు ఇలానే జరిగాయి. నాలుగు స్టార్లు ఇచ్చిన సినిమాలన్నీ డిజాస్టర్‌గా నిలిచాయి. దీంతో ఆయన్ని ఎవరూ నమ్మడం లేదు. ఒకానొక దశలో ఆయన ట్విట్టర్‌ అకౌంట్‌ని కూడా బ్లాక్‌ చేశారు. కానీ మళ్లీ కొత్త అకౌంట్‌తో ఇప్పుడు ఈ పోస్ట్ లు పెడుతున్నారు.
undefined
ఓవర్సీస్‌ సెన్సార్‌ బోర్డ్ మెంబర్‌ని అని చెప్పుకుంటూ తన పాపులారిటీ కోసం ఉమన్‌ సంధు ఇలా చేస్తాడనే టాక్‌ ఉంది. అయితే పవన్‌ ఫ్యాన్స్ సైతం ఆయనపై విరుచుకుపడుతున్నారు. బూతులతో రెచ్చిపోతున్నారు. నువ్వు రివ్యూ ఇవ్వడమేంట్రా? అసలు నువ్వు సినిమా చూశావా? మూసుకో అంటూ కామెంట్ల రూపంలో విమర్శిస్తున్నారు. మరి ఆయన రివ్యూ ఏమేరకు వర్కౌట్‌ అవుతుందో చూడాలి.
undefined
click me!