టాలీవుడ్ లో పవన్ ఒక్కడే సింహం, అందరూ చిట్టెలుకలే..  నాగబాబు వివాదాస్పద కామెంట్

Published : Apr 13, 2021, 10:20 AM IST

మెగా బ్రదర్ నాగబాబు వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారిపోతున్నారు. తనకు అనిపించింది ఏదైనా సోషల్ మీడియాలో పంచుకుంటూ సంచలనాలకు తెరలేపుతున్నారు. తాజాగా ఆయన టాలీవుడ్ హీరోలపై వివాదాస్పద కామెంట్ చేశాడు.   

PREV
16
టాలీవుడ్ లో పవన్ ఒక్కడే సింహం, అందరూ చిట్టెలుకలే..  నాగబాబు వివాదాస్పద కామెంట్
గతవారం విడుదలైన వకీల్ సాబ్ మూవీ బెనిఫిట్ షోస్, టికెట్ల ధరల పెంపు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించింది. బెనిఫిట్ షోలకు అనుమతి నిరాకరించడంతో పాటు ధరల పెంపుకు వీలు లేదని, ప్రత్యేక జీవో జారీ చేసింది.

26
ఈ విషయంలో రాజకీయ చర్చ కూడా జరిగింది. జనసేన, బీజేపీ నాయకులు సీఎం జగన్ కక్షపూరితంగానే పవన్ సినిమా వసూళ్లను దెబ్బతీశారని విమర్శలు చేశారు. ఈ విషయంపై స్పందించిన నాగబాబు, ఇది సీఎం జగన్ నిర్ణయం కాదు, ఆయన పక్కన ఉన్న కొందరు మంత్రులు చేసిన దుశ్చర్య అని అన్నారు.

36
అయితే వకీల్ సాబ్ మూవీ విషయంలో ఏపీ ప్రభుత్వ నిర్ణయాలను పరిశ్రమ పెద్దలు ఎందుకు ప్రశ్నించడం లేదనే ప్రశ్నను ఒకరు లేవనెత్తగా, నాగబాబు కొంచెం ఘాటు వ్యాఖ్య చేశారు.

46
నిన్న ఇంస్టాగ్రామ్ లో అభిమానులతో ఆయన ఛాట్ చేశారు. ఆ సమయంలో ఒకరు... వకీల్ సాబ్ మూవీకి జరుగుతున్న అన్యాయాన్ని టాలీవుడ్ కి చెందిన ఎవరూ ప్రశ్నించరు, ఏమిటని.. నాగబాబును అడిగారు.  దానికి నాగబాబు 'లయన్ కి చిట్టెలుక సాయం చేసినా, చేయకున్నా ఫరక్ ఏమీ పడదు, ఆయన సూపర్ హిట్ మూవీకి ఎవరి సపోర్ట్ అవసరం లేదు' అని సదరు నెటిజెన్ కి సమాధానం చెప్పారు.

56
పరిశ్రమలో ఉన్న చిరంజీవితో పాటు మిగతా హీరోలను, ప్రముఖులను నాగబాబు చిట్టెలుకలుగా... పవన్ కళ్యాణ్ ని సింహంగా పోల్చడం జరిగింది. అయితే పరిశ్రమలో ఆయన కూడా ఉన్నాడు, చివరికి పవన్ కూడా పరిశ్రమకు చెందినవాడే.

66
పవన్ కూడా ఈ విషయంపై నోరుమెదపలేదు. కాబట్టి నాగబాబు సింహం అని భావిస్తున్న పవన్ కూడా చిట్టెలుక క్రిందే లెక్కని.. యాంటీ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

click me!

Recommended Stories