Pranitha Subhash Seemantham: తల్లైన పవన్ హీరోయిన్ ప్రణీత... సీమంతం ఫోటోలు వైరల్!

Published : May 16, 2022, 03:08 PM IST

పవన్ కళ్యాణ్ హీరోయిన్ ప్రణీత సుభాష్ సాంప్రదాయం ప్రకారం సీమంతం వేడుక జరుపుకుంటుంది. కుటుంబ సభ్యులు, బంధువులు సమక్షంలో ఘనంగా ఈ వేడుక జరిగింది. పసుపు పచ్చ పట్టు చీరలో ప్రణీత నిండుగా తయారయ్యారు. 

PREV
18
Pranitha Subhash Seemantham: తల్లైన పవన్ హీరోయిన్ ప్రణీత... సీమంతం ఫోటోలు వైరల్!
Pranitha Subhash

తన సీమంత వేడుక ఫోటోలు ప్రణీత (Pranitha Subhash) ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఇక అభిమానులతో పాటు పరిశ్రమ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆమెకు బెస్ట్ విషెష్ తెలియజేస్తున్నారు. ఆమెకు పండంటి బిడ్డ పుట్టాలని ఆశీర్వదిస్తున్నారు. 
 

28
Pranitha Subhash


గతేడాది మే30న వ్యాపార వేత్త నితిన్ ను ప్రేమించి పెండ్లి చేసుకుంది హీరోయిన్ ప్రణీత సుభాష్. కరోనా కారణంగా తన వివాహానికి సంబంధించిన అప్డేట్ కూడా ఇవ్వకుండా ఈ జంట ఒక్కటైంది. ఆ తర్వాత అభిమానులకు వివరణ ఇస్తూ.. కరోనా నేపథ్యంలో డేట్ విషయంలో కన్ష్యూషన్ ఉండటంతో రహస్యంగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని తెలియజేశారు. 
 

38
Pranitha Subhash

కాగా, నితిన్, సుభాష్ బెంగళూరులో వివాహాం చేసుకుని ఇఫ్పటికీ ఏడాది కూడా పూర్తి కాలేదు. ఈ లోపే ప్రణీత తన అభిమానులు శుభవార్త చెప్పింది. త్వరలో తను తల్లి కాబోతున్నట్టు తెలియజేసింది. ఈ మేరకు తన భర్తతో కూడిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.

48
Pranitha Subhash


ఇక  తెలుగులో ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)వంటి టాప్ స్టార్స్ పక్కన ప్రణీత నటించారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ హీరోగా తెరకెక్కిన అత్తారింటికి దారేది బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ మూవీలో ప్రణీత సెకండ్ హీరోయిన్ రోల్ చేశారు. 
 

58
Pranitha Subhash

అలాగే ఎన్టీఆర్(NTR) కి జంటగా రామయ్యా వస్తావయ్యా చిత్రం చేశారు. అయితే ఈ చిత్రం అనుకున్నంత విజయం సాధించలేదు. తెలుగులో స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకోలేకపోయిన ప్రణీత అడపాదడపా చిత్రాలు చేశారు.

68
Pranitha Subhash


తెలుగులో ప్రణీత చివరి చిత్రం ఎన్టీఆర్ కథానాయకుడు. ప్రస్తుతం ఆమె హిందీలో చిత్రాలు చేస్తున్నారు. ప్రణీత హీరోయిన్ గా నటించిన హంగామా 2, బుజ్ చిత్రాలు విడుదలయ్యాయి. ఆమె నటిస్తున్న కన్నడ చిత్రం రావణ అవతారం అనే కన్నడ చిత్రంలో నటిస్తున్నారు.

78
Pranitha Subhash


కాగా కరోనా సమయంలో ప్రణీత చేసిన సేవలు ప్రాచుర్యం పొందాయి. ఆమె అనేక మంది పేద ప్రజలకు ఆహారం అందించారు. లాక్ డౌన్ సమయంలో కార్మికులను ఆమె ఆదుకున్నారు. ప్రతిరోజు ఆమె పేదలకు అన్నం పెట్టారు.

88
Pranitha subhash

ఇక పెళ్లి తర్వాత ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కారణం చేతనే ఆమె కొత్త ప్రాజెక్ట్స్ కి సైన్ చేయడం లేదట. ప్రస్తుతం గర్భవతి కూడా అయిన ప్రణీత వెండితెరకు పాక్షికంగానో లేక పర్మినెంట్ గానో దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories