పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు నందమూరి నటసింహం బాలకృష్ణ సినిమాల్లో బాగా ఇష్టమైన సినిమా ఏదో తెలుసా? ఆ సినిమాను పవన్ 100 సార్లు చూశారా? ఆసినిమా ఎందుకంత ఇష్టం.. నిజమెంత?
టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ - మెగా హీరో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య స్నేహం ఇప్పటిది కాదు. వీరిద్దరు మంచి అనుబంధం కలిగి ఉన్నా విషయం తెలిసిందే. సినీ, రాజకీయ వర్గాల్లో ఎప్పటినుంచో వీరి స్నేహం చర్చనీయాంశం అవుతూనే ఉంది. వ్యక్తిగతంగా మాత్రమే కాకుండా, ప్రస్తుతం రాజకీయంగా కూడా వీరిద్దరూ మంచి మిత్రులుగా ఉన్నారు. ఇక బాలయ్య హోస్ట్ గా వచ్చిన అన్ స్టాపబుల్ షోలో పవన్ కళ్యాణ్ సందడి చేసిన విషయం కూడా తెలిసిందే.
25
స్వభావంలో ఇద్దరు ఇద్దరే..
బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ఇద్దరూ స్వభావంలో స్ట్రైట్ ఫార్వర్డ్‌గా ఉంటారని, నచ్చిన విషయం నచ్చిందని, నచ్చని విషయం నచ్చలేదని నేరుగా చెప్పే వ్యక్తులుగా గుర్తింపు కలిగి ఉన్నారు. ఇదే స్వభావం ఈ హీరోలిద్దరి మీద నెగెటివిటీకి కూడా కారణం అయ్యింది. పరత్యర్ధులు విమర్శించడానికి పాయింట్ అయ్యింది. ఇక ఈ ఇద్దరు హీరోలు ఒకరినొకరు బాగా గౌరవించుకుంటారు. ఒకరి సినిమాపై మరొకరు ప్రశంసించుకుంటారు కూడా. ఇక పవన్ కళ్యాణ్ కు బాలకృష్ణ సినిమాలంటే చాలా ఇష్టమని, ఆయన నటించిన దాదాపు అన్ని సినిమాలను అతను చూస్తాడని సమాచారం.
35
పవన్ కు నచ్చిన బాలయ్య సినిమా..
అందులో ప్రత్యేకంగా సమరసింహా రెడ్డి సినిమా తనకు ఎంతో ఇష్టమని పవన్ కళ్యాణ్ పలుమార్లు చెప్పినట్లు తెలుస్తోంది. ఆ సినిమాలో బాలయ్య బాబు తన పూర్తిస్థాయి నటనను ప్రదర్శించారని, యాక్షన్ ఎపిసోడ్స్ కూడా అద్భుతంగా ఉంటాయని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. ఫ్యాక్షన్ నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రంలో బాలకృష్ణ నటన, డైలాగ్ డెలివరీ, మేనరిజాలు తనను బాగా ఆకట్టుకున్నాయని పవన్ కళ్యాణ్ భావించినట్లు తెలుస్తోంది.
ఇక మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సమరసింహా రెడ్డి సినిమాను పవన్ దాదాపు ఓ 100 సార్లు చూశానని పవన్ కళ్యాణ్ తన సన్నిహితుల వద్ద తరచూ చెప్పుకుంటూ ఉంటారట. ఒకే సినిమాను ఇన్ని సార్లు తిరిగి చూడడం సాధారణ విషయం కాదని సినీ అభిమానులు భావిస్తున్నారు. ఇది బాలకృష్ణపై పవన్ కళ్యాణ్‌కు ఉన్న అభిమానానికి నిదర్శనం అంటున్నారు అభిమానులు. ఈ విషయంలో నిజం ఎంతో కానీ.. సోషల్ మీడియాలో మాత్రం ఈ విషయం తెగ వైరల్ అవుతోంది.
55
దూసుకెళ్తున్న బాలయ్య..
65 ఏళ్ల వయసులో నందమూరి నటసింహం బాలయ్య బాబు దూసుకెళ్తున్నాడు.. వరుస విజయాలతో సందడి చేస్తున్నాడు. రీసెంట్ గా అఖండ2 తో పర్వాలేదనిపించాడు బాలకృష్ణ. నెక్ట్స్ మలినేని గోపీచంద్ తో మూవీ ప్లాన్ చేస్తున్నాడు బాలకృష్ణ. ఈసినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తున్నట్టు సమాచారం.