పవన్‌ కళ్యాణ్‌, క్రిష్‌ మధ్య విభేదాలు..? అది తేలే వరకు షూటింగ్‌ స్టార్ట్ కాదా? టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్

Published : Oct 17, 2022, 06:19 PM ISTUpdated : Oct 17, 2022, 09:16 PM IST

పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం `హరిహర వీరమల్లు` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడు రీ స్టార్ట్ అవుతుందనేది పెద్ద సస్పెన్స్‌. అయితే ఆలస్యానికి మరో కారణం ఉందని టాక్.   

PREV
17
పవన్‌ కళ్యాణ్‌, క్రిష్‌ మధ్య విభేదాలు..? అది తేలే వరకు షూటింగ్‌ స్టార్ట్ కాదా? టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్

పవన్‌ కళ్యాణ్‌ చివరగా `భీమ్లా నాయక్‌` చిత్రంతో అలరించారు. ఈ సినిమా తక్కువ టికెట్‌ రేట్లలోనూ మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత ఆయన క్రిష్‌ దర్శకత్వంలో `హరిహర వీరమల్లు` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో నిధి అగర్వాల్‌ కథానాయికగా నటిస్తుండగా, ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. 

27
Hari Hara Veera Mallu

పీరియాడికల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు క్రిష్‌. ఇందులో వీరమల్లు పాత్రలో పవన్‌ నటించబోతున్నారు. ఫస్ట్ టైమ్ ఆయన కాస్ట్యూమ్‌ బేస్డ్ చిత్రంలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ లకు విశేష స్పందన లభించింది. పవన్‌ యుద్ధ విద్యలతో చేసే యాక్షన్‌ అదరహో అనిపించేలా ఉంది. 

37

అయితే ఈ సినిమా 40 నుంచి 50శాతం వరకు చిత్రీకరణ పూర్తయిందని సమాచారం. ఇటీవల సినిమాని రీ సార్ట్ చేసేందుకు ప్రయత్నించింది యూనిట్‌. ప్రీ వర్క్ షాప్‌ నిర్వహించారు. మూడు నాలుగు రోజులు టీమ్‌ అంతా కూర్చొని స్క్రిప్ట్ రీడింగ్‌ చేశారు. సెట్‌లో ఇక ఎలాంటి సందేహాలు లేకుండా డైరెక్ట్ గా షూటింగ్‌లు జరుపుకునేలా ప్లాన్‌ చేశారు. పవన్‌ సైతం యాక్షన్‌కి సంబంధించిన ప్రాక్టీస్‌ కూడా చేశారు. 
 

47

అక్టోబర్‌లోనే షూటింగ్‌ ప్రారంభమవుతుందనే వార్తలొచ్చాయి. శరవేగంగా చిత్రీకరణ జరపాలనే టీమ్‌ ప్లానింగ్‌లో ఉందన్నారు. కానీ ఇప్పటి వరకు షూటింగ్‌ ప్రారంభం కాలేదు. పైగా పవన్‌ ప్రస్తుతం రాజకీయంగా బిజీగా ఉన్నారు. ఆయన ఇప్పట్లో షూటింగ్‌లో పాల్గొనే అవకాశం కనిపించడం లేదు. దీంతో `హరిహర వీరమల్లు` వ్యవహారం మళ్లీ మొదటికొచ్చిందా అనేట్టుగా మారిపోయింది. 
 

57

ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఫిల్మ్ నగర్‌లో వినిపిస్తుంది. ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో దర్శకుడికి, పవన్‌కి మధ్య బేదాభిప్రాయాల కారణంగానే సినిమా ఆలస్యమవుతుందని సమాచారం. స్క్రిప్ట్ లో పవన్‌ కొన్ని మార్పులు సూచించారట. వాటిని ఛేంజ్‌ చేయమని చెప్పగా, క్రిష్‌ ఆ మార్పులు చేసేందుకు సిద్ధంగా లేరట. ఇటీవల స్క్రిప్ట్ నెరేషన్‌ కూడా తన అసిస్టెంట్ల ద్వారా చెప్పగా, తాను చెప్పిన మార్పులు లేకపోవడంతో ఆయన అసంతృప్తికి లోనయ్యారని, తాను చెప్పిన మార్పులు చేశాకే షూటింగ్‌ మొదలు పెడదామని పవన్‌ స్పష్టం చేసినట్టు టాక్. 
 

67
Pawan Kalyan Chiranjeevi

మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. కానీ  ఈ గుసగుసలు కాస్త గట్టిగానే వినిపిస్తున్నాయి. అంతా బాగుంటే షూటింగ్‌ చేయడానికి ప్రాబ్లెం ఏముంటుందని, ఇది నిజమయ్యే అవకాశమే ఎక్కువగా ఉంటుందంటున్నారు నెటిజన్లు. మరి దీనిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్‌ చేయాల్సిందే. 
 

77

పవన్ కోసం ఇంకా ముగ్గురు దర్శకులు వెయిటింగ్‌లో ఉన్నారు. అటు సముద్రఖని, హరీష్‌ శంకర్‌, అలాగే సురేందర్‌ రెడ్డిలు నెక్ట్స్ క్యూలో ఉన్నారు. `హరిహర వీరమల్లు` షూటింగ్‌ పూర్తయితేనే పవన్‌ ఆ సినిమాలు చేసే అవకాశం ఉంది. దీంతో మొత్తం గందరగోళంగా మారిపోయింది. ఈ సస్పెన్స్ కి ఎప్పుడు తెరపడుతుందో, పవన్‌ సినిమాలు ఎప్పుడు పూర్తి చేస్తాడోగానీ అభిమానులు మాత్రం పవర్‌ స్టార్‌ని తెరపై చూసేందుకు ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories