శాకుంతలంకి కలెక్షన్లు అందుకే రాలేదు, ఆమెని రాళ్లతో కొట్టడం.. పరుచూరి ఆసక్తికర వ్యాఖ్యలు

First Published May 27, 2023, 6:26 PM IST

గుణశేఖర్, సమంత కాంబినేషన్ లో వచ్చిన పౌరాణిక చిత్రం శాకుంతలం. ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలం అయింది. దుశ్యంతుడు, శకుంతల ప్రేమ.. వారికి భరతుడు జన్మించిన కథని గుణశేఖర్ ఎమోషల్ గా ప్రజెంట్ చేయాలనుకున్నారు. 

గుణశేఖర్, సమంత కాంబినేషన్ లో వచ్చిన పౌరాణిక చిత్రం శాకుంతలం. ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలం అయింది. దుశ్యంతుడు, శకుంతల ప్రేమ.. వారికి భరతుడు జన్మించిన కథని గుణశేఖర్ ఎమోషల్ గా ప్రజెంట్ చేయాలనుకున్నారు. కానీ ఆడియన్స్ ని మెప్పించలేదు. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం నుంచి ఈ కథని తీసుకున్నారు. 

తాజాగా సీనియర్ రచయిత పరుచూరి గోపాల కృష్ణ శాకుంతలం చిత్రంపై రివ్యూ ఇచ్చారు. శాకుంతలం కథ తనకి ఒక మధుర జ్ఞాపకం అని పరుచూరి అన్నారు. తాను ఉపన్యాసకుడిగా ఉన్నప్పుడు శాకుంతలం కథని నాటకాల రూపంలో చూశాను అని తెలిపారు. ఇప్పుడు గుణశేఖర్ తెరకెక్కించిన శాకుంతలం చూసాను. 

గుణశేఖర్ రానాతో హిరణ్యకశ్యప తెరకెక్కించాలని అనుకున్నారు. అది కుదరకపోయే సరికి మళ్ళీ శాకుంతలం రూపంలో పౌరాణిక కథనే ఎంచుకున్నారు. శకుంతల గర్భం దాల్చిన తర్వాత మహారాజుని కలవడానికి వెళుతుంది. అప్పుడు ఆయన వెళ్లిపొమ్మని కేకలు వేస్తారు. శకుంతల వెళ్ళేటప్పుడు గ్రామస్థులు ఆమెని రాళ్లతో కొడతారు. నాకు తెలిసినంత వరకు అభిజ్ఞాన శాకుంతలంలో అది లేదు. రాళ్లతో కొట్టడం రాయలేదు. 

బహుశా గుణశేఖర్ సింపతీ కోసం ఆ సీన్ పెట్టి ఉంటారు. సినిమా మొత్తం బాగున్నా కొన్నిసార్లు ఒక్క సీన్ వాళ్ళ అభిప్రాయమే మారిపోతుంది. ఈ చిత్రానికి కలెక్షన్స్ రాకపోవడానికి కారణం సెకండ్ హాఫ్ అని అనుకుంటున్నా. గుణశేఖర్ దర్శకత్వంలో లోపం లేదు.. కానీ చిత్రాన్ని ఎలా చూపించాము అనేది ముఖ్యం.. ఆడియన్స్ కి నచ్చే విధంగా ఉండాలి అని పరుచూరి అన్నారు. 

ప్రజలు మరచిపోతున్న మహాభారతంలోని ముఖ్య ఘట్టాన్ని గుణశేఖర్ సొంత ఖర్చులతో నిర్మించి దర్శకత్వం వహించినందుకు ఆయనకి హ్యాట్సాఫ్. సమంత, దేవ్ మోహన్ ఇద్దరూ అద్భుతంగా నటించారు అని పరుచూరి అన్నారు. 

పరుచూరి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. సమంత ఎంతో ఇష్టపడి శాకుంతలంలో నటించింది. పౌరాణిక చిత్రం కాబట్టి తనకు కొత్త ఇమేజ్ తీసుకువస్తుంది అని భావించింది. కానీ సినిమా నిరాశపరచడంతో అది జరగలేదు. 

click me!