రెమ్యునరేషన్ లో తగ్గేది లేదన్నాడు.. తారక్ పై కామెంట్!

First Published Mar 19, 2019, 7:09 PM IST

సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన పరుచూరి పలుకులు ప్రోగ్రాంలో జూనియర్ ఎన్టీఆర్ కి సంబందించిన ఒక సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. నరసింహుడు ప్లాప్ అవ్వగానే రెమ్యునరేషన్ విషయంలో ఒక సలహా ఇస్తే జూనియర్ అందుకు ఒప్పుకోలేదని వివరణ ఇచ్చారు.  

సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన పరుచూరి పలుకులు ప్రోగ్రాంలో జూనియర్ ఎన్టీఆర్ కి సంబందించిన ఒక సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. నరసింహుడు ప్లాప్ అవ్వగానే రెమ్యునరేషన్ విషయంలో ఒక సలహా ఇస్తే జూనియర్ అందుకు ఒప్పుకోలేదని వివరణ ఇచ్చారు.
undefined
జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.. 2005లో చినరామయ్యతో నరసింహుడు రిలీజ్ అయినప్పుడు చాలా టెన్షన్ పడ్డాను. నిర్మాత ట్యంక్ బండ్ దగ్గర దూకేయడం చాలా బాధగా అనిపించింది. చినరామయ్య ఎలా ఉన్నాడో అని పలకరించడానికి వెళ్లి ఒక సలహా ఇచ్చాను.
undefined
మీరు ఏడాదికి ఒక ఒకటో రెండో సినిమాలు చేస్తున్నారు. అందుకే ఇప్పుడు తీనుకున్న రెమ్యునరేష్ లో నాలుగవ వంతు తీసుకో.. ఆ విధంగా మూడు నెలలకు ఒక సినిమా చేయి.. మొత్తంగా ఒక ఏడాదిలో నాలుగు సినిమాలు చేయి.
undefined
అది కూడా చలసాని గోపి - అర్జున్ రాజు - త్రివిక్రమ రావ్ - దేవి ప్రసాద్ - అశ్విని దత్ - రామానాయుడు లాంటి మీ తాత గారి నిర్మాతలు 12 మంది ఉన్నారు కాబట్టి అలాంటి వారితోనే చేయి. నువ్ అంత రెమ్యునరేషన్ తీసుకొని చేసుకుంటూ వెళితే ఆ నిర్మాతలు నీ దగ్గరే ఉంటారు.
undefined
అప్పుడు మిగతా వాళ్ల రెమ్యునరేషన్ కూడా తగ్గుతుంది. అలాగే నీతో సినిమా చేసినవాళ్లకు మొదటి వారంలోనే డబ్బులు వచ్చేస్తాయి ఇక ప్లాప్ అనేది నీ చరిత్రలో ఉండదు. సినిమా ఆడిందా లేదా అనేది తరువాత సంగతి పెట్టిన డబ్బులు నిర్మాతకు వచ్చాయా లేదా అనేదే ముఖ్యం.
undefined
'ఒకటి రెండు వారాల్లో డబ్బులు వచ్చేస్తాయి అని తారక్ తో చెబితే ఇలా అన్నాడు'
undefined
లేదు పెదనాన్న.. ఇది పోటీ యుగం.. ఎక్కడ తలపడాలో అక్కడే తలపడాలి హైయ్యెస్ట్ రెమ్యునరేషన్ ఎవరికైతే ఉందొ వారితో పోటీ పడి నేను తీసుకోవాల్సిందే మిగతా వారు ఎంత తీసుకుంటే అంత తీసుకుంటా..
undefined
నేను ఇలానే ఉంటా అని తారక్ చెప్పినట్లు పరుచూరి గోపాల కృష్ణ వివరణ ఇచ్చారు. సరే నీ ఇష్టం నానా అంటూ ప్రతి హీరో ఇప్పుడు అలానే ఆలోచిస్తున్నారని ఆ విధంగా హీరోలు అభిమానులకు చాలా ఆలస్యంగా కనిపిస్తున్నట్లు తన వివరణ ఇచ్చారు.
undefined
click me!