Parari Review : ‘పరారి’ మూవీ రివ్యూ.!

First Published | Mar 30, 2023, 8:02 PM IST

శ్రీరామ నవమి సందర్భంగా  లవ్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన  చిత్రం ‘పరారి’(Parari). ఈరోజు (మార్చి 30) థియేటర్లలో విడుదలైంది. సినిమా ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం.
 

కంటెంట్ లో బలం ఉంటే చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అన్నీ రకాల సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. భారీ యాక్షన్ చిత్రాలనే కాకుండా.. ఫ్యామిలీ, క్రైం అండ్  కామెడీ చిత్రాలనూ వీక్షిస్తున్నారు. నచ్చితే బ్లాక్ బాస్టర్ కూడా చేసేస్తున్నారు. ఇలా చిన్న సినిమాలూ ఊహించని విధంగా సక్సెస్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే లవ్ అండ్ క్రైం కామెడీ ఫిల్మ్ గా ‘పరారి’ చిత్రం ఇవ్వాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యువనటీనటులు యోగేశ్వర్ (Yogeswar), అతిధి (Athidhi) జంటగా నటించారు. సాయి శివాజీ దర్శకత్వం వహించారు. ఇంతకీ సినిమా కథ ఏంటీ? ఎలా సాగింది? ఇంట్రెస్టింగ్ అంశాలేమైనా ఉన్నాయా? అనేది రివ్యూలో చూద్దాం.
 

కథ : హీరోహీరోయిన్లు యోగి(యోగీశ్వర్), అతిథి(అతిథి) ఓకే కాలేజీలో చదువుకుంటున్నారు. అప్పటికే ప్రేమలోనూ పడ్డారు. యోగి తండ్రి (షయాజి షిండే) ఒక వ్యాపార వేత్త. కొడుకును బాగా చూసుకుంటాడు.  ఇక యోగి, అతిధి లవ్ లో మునిగితేలుతూనే తమ స్నేహితులు (జబర్దస్త్ రఘు కారుమంచి, భూపాల్)తో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. భూపాల్ శివాని సైనిఅనే అమ్మాయిని ప్రేమిస్తుంటారు. వీరు ఐదుగురు చాలా స్నేహపూర్వకంగా ఉంటారు. అయితే ప్రశాంతంగా సాగిపోతున్న వీరంతా ఓ మర్డర్ మిస్టరీలో చిక్కుకుంటారు. దాన్నుంచి బయటపడేందుకు చాలా ఇబ్బందులు పడుతారు. ఆ సమయంలోనే హీరో తండ్రి యోగిని పాండే (మకరంద్ దేశ్ ముఖ్ పాండే) కిడ్నాప్ చేస్తాడు. వారందరూ మర్డర్ మిస్టరీలో ఎలా ఇరుక్కున్నారు? హీరో తండ్రిని ఎందుకు కిడ్నాప్ చేశారు? మర్డర్ మిస్టరీ నుంచి మళ్లీ ఎలా తప్పించుకున్నారు. యోగి తన తండ్రిని ఎలా కాపాడుకున్నాడనేదే మిగితా సినిమా. 
 


విశ్లేషణ : లవ్ అండ్ క్రైం కామెడీ చిత్రాలూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ తరహా సినిమాలు ఎప్పుడూ ఇంట్రెస్టింగ్ గానే ఉంటాయి. గతంలో ఈ జానర్ లో చాలా సినిమాలు వచ్చి మెప్పించాయి. బలమైన కథ, ఆకట్టుకునే స్క్రీన్ ప్లే, జంపింగ్ లు లేకుండా ఉంటే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకునే అవకాశం ఉంది. ఇక.. ఈ సినిమా విషయానికొస్తే.. టైటిల్ (పరారి)కి తగ్గట్టుగానే సినిమాలోని క్యారెక్టర్లు సాగాయి. ఈ క్రమంలోనే ప్రేక్షకులను నవ్వించే సన్నివేశాలూ ఉన్నాయి. ప్రథమ అర్థం క్యారెక్టర్ల పరిచయం, ఆ తర్వాత కొన్ని సరదాగా సన్నివేశాలు, అడల్డ్ కామెడీ, రొమాంటిక్ సీన్స్ తో సాగిపోయింది. కొన్నిసాగదీసే సన్నివేశాలు ఇబ్బందిగా అనిపించాయి. ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ తో సినిమాపై ఆసక్తి పెరుగుతుంది. సెకండ్ ఆఫ్ లో మర్డర్ మిస్టరీతో వేగం పుంజుకుంది. ఆ తర్వాత నుంచి ఆతృతగానే సాగింది. ప్రథమార్థంపై దర్శకుడు మరింతగా ఫోకస్ పెడితే బాగుండేది. ఇక కిడ్నాప్ సీన్స్, విలన్స్ తో కంపోజ్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ చాలా కొత్తదనంతో పాటు నవ్వులు పూయించేలా ఉన్నాయి. చివరిగా క్లైమాక్స్ సీన్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండాఫ్ బాగుంది. 
 

నటీనటులు : హీరోగా తొలి సినిమా అయినా హీరో యోగీశ్వర్ బాగా నటించారు. తన డాన్స్, ఫైట్స్ తో ఆకట్టుకున్నాడు. మరోవైపు తన డైలాగ్ డెలివరీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. సినిమా మొత్తంలో యోగీశ్వర్ నటన అందరినీ మెప్పిస్తుంది. హీరోయిన్ అతిథి కూడా పర్వాలేదని పించింది. తన గ్లామర్ తో ఆకట్టుకుంది. హీరోకు తగ్గజోడీగా అనిపించింది. ఇక హీరోతో పాటు నటించిన భూపాల్, రఘ పాత్రలు నవ్వులు పూయించాయి. అందుకు తగ్గట్టుగానే వారి పెర్ఫామెన్స్ ఉంది. ముఖ్యంగా విలన్ పాత్రలో నటించిన బాలీవుడ్ యాక్టర్ మకరంద్ దేశ్ ముఖ్ పాండే అటు విలనిజాన్ని చూపిస్తూనే ఇటు పొట్ట చెక్కలయ్యేలా నవ్వించాడు. కామెడీ విలన్ గా తన పాత్రలో జీవించారు. క్లైమాక్స్ లో ఈయన నటన ఆకట్టుకుంటుంది. మిగితా ఆర్టిస్టులు తమ పాత్రల మెరకు నటించి మెప్పించారు. 
 

టెక్నీషియన్లు : చిత్రానికి పనిచేసిన టెక్నీకల్ టీమ్ పర్లేదనిపించింది. గరుడవేగ అంజి అందించిన సినిమాటోగ్రఫీ సూపర్ గా ఉంది. దివంగత సీనియర్ ఎడిటర్ గౌతం రాజు ఎడిటింగ్ చాలా బాగుంది. క్రైమ్ కామెడీకి తగ్గట్టుగా మహిత్ నారాయణ్ సంగీతం, బీజీఎం అందించారు. సాంగ్స్, ఫైట్స్ చిత్రీకరణ గ్రాండ్ గానే అనిపించింది. ఈ విషయంలో చిత్ర నిర్మాతలు అస్సలు తగ్గలేదని అనేలా ఉన్నాయి. రామజోగయ్య శాస్త్రి, భాస్కర భట్ల, మహిత్ నారాయణ్ రాసిన లిరిక్స్ మాసీ వ్ గా ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. రేటింగ్; 2.5
 

నటీనటులు : యోగేశ్వర్, అతిధి, షియాజీ షిండే, సుమన్, మకరంద్ పాండే, జబర్దస్త్ రఘు, భూపాల్, శివాని
దర్శకుడు : సాయి శివాజీ
బ్యానర్ : శ్రీ శంకర ఆర్ట్స్ 
సమర్పణ : ప్రత్యూష
నిర్మాత : జీవీవీ గిరి
సంగీతం : మహిత్ నారాయణ్
విడుదల తేదీ : 23-03-2023
 

Latest Videos

click me!