Pakka Commercial Review: పక్కా కమర్షియల్ ప్రీమియర్ రివ్యూ.. రెచ్చిపోయిన గోపీచంద్, కమ్ బ్యాక్ అవుతాడా..?

First Published | Jul 1, 2022, 8:45 AM IST

చాలా కాలంగా హిట్లు లేదు గోపీచంద్ కు.. ఇప్పటి వరకూ సాలిడ్ సినిమా పడింది లేదు. ఎప్పుడో కెరీర్ బిగినింగ్ లో సక్సెస్ లు వచ్చాయి అంతే.. ఇక ఇప్పుడు పక్కా కమర్షియల్ సినిమాతో  గోపీచంద్ కంమ్ బ్యాక్ అవుతాడా..  ఈరోజు థియేటర్లలోసందడి చేయబోతున్న పక్కా కమర్షియల్ మూవీ... యూఎస్ లో ముందుగానే ప్రీమియర్స్ తో సందడి చేస్తోంది.. మరి సినిమా ఎలా ఉంది..? 
 

టాలీవుడ్ యంగ్ హీరో  గోపీచంద్‌, రాశీఖన్నా జంటగా.. మారుతీ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా పక్కా కమర్షియల్‌.  సత్య రాజ్‌, సప్తగిరి, వరలక్ష్మి శరత్‌ కుమార్‌, రావు రమేష్‌ తదితరులు ముఖ్యమైన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఈరోజు రిలీజ్ కాబోతోంది. ఇక ముందుగా యూఎస్ లో ప్రీమియర్ షోస్ పడిపోయాయి.. UV క్రియేషన్స్ & GA2 పిక్చర్స్ బ్యానర్‌ కలిసి నిర్మించిన ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం.

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో గోపీచంద్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా పక్కా కమర్షియల్ ఈరోజు జూలై 01, 2022న విడుదలైంది ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు గోపీచంద్. ఈసారి ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యాడు. అందుకే ప్రమోషన్స్ విషయంలో కూడా ఎక్కడా తగ్గలేదు టీమ్. గీతాఆర్ట్స్ నిర్మిస్తుండట.. మారుతి డైరెక్టర్ కావడంతో.. అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. 
 


ఇక ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు గోపీచంద్. మారుతిమీద నమ్మకంతో ఈ సినిమాపై ఆశలు పెంచుకున్నాడు. గత సినిమాల నుంచి తనకు బాగా కలిసి వస్తున్న రాశీ ఖన్నానే హీరోయిన్ గా తీసుకున్నాడు మారుతి. ఈసారి కూడా పక్కా కమర్షియల్  సినిమాతో పక్కా హిట్ కొట్టాలని చూస్తున్నారు. 

ఇక ఈ మూవీ కథ విషయానికి వస్తే... సినిమాలో గోపిచంద్ లాయర్. ఆయన  పేరు రాంచంద్.. అతడి దృష్టిలో ప్రతిదీ పక్కా కమర్షియల్. ఏ విషయం అయినా డబ్బుతో ముడిపెడుతుంటాడు. ఇక  రాంచంద్‌తో సీరియల్ నటిగా ఉన్న హీరోయిన్  ఝాన్సీ(రాసి ఖన్నా) నటించింది. తన సీరియల్ లో  లాయర్ పాత్ర కోసం రాంచంద్ దగ్గర అసిస్టెంట్‌గా చేరుతుంది. అలా ఇద్దరూ ప్రేమలో పడతారు. ఇక అసలు ట్విస్ట్ ఏంటంటే..  రామ్‌చంద్ ఓ కేసు విషేయంలో తన తండ్రితో పోటా పోటీగా  వాదించాల్సి వస్తుంది. ఆకేసు సినిమాను మలుపు తిప్పుంది. ఇంతకీ ఆ కేస్ ఏమిటి..? రాంచంద్ ఆ కేసు ఎందుకు టేకప్ చేయాల్సి వచ్చింది...?   ఇంతకీ ఆ కేసులో మిస్టరీ ఏంటి? అందులో ఎవరు గెలిచారు అనేది  సినిమా చూసి తెలుసుకోవాలి. 

మారుతీ తనకంటూ ఒక  స్పెషల్ స్టైల్ ని ఏర్పరుచుకున్నారు. అయితే ఆయన సినిమాలకు బలం కామెడీ. ఈ సినిమాలో కూడా కామెడీ అద్భుతంగా పేలింది. గోపీచంద్ లో తనకు కావల్సినంత కామెడీ పిండుకున్నాడు మారుతీ. అయితే ఎందుకో ఈ సినిమా మారుతి స్టైల్ లో లేదు అనిపించింది. గోపీచంద్ కు హిట్ ఇవ్వడం కోసం కాస్త కాంప్రమైజ్ అయ్యాడేమో మారుతి అన్నట్టు ఉంటుంది సినిమా.. ఇంతవరకు మారుతీ సినిమాల్లో యాక్షన్  పెద్దగా కనిపించేది కాదు. ఏదో చిన్న చితకా యాక్షన్స్ సీన్స్ తప్పించి పెద్దగా పట్టించుకోడు  ఈ డైరెక్టర్. కానీ పక్కా కమర్షియల్‌లో చాలా యాక్షన్ ఉంది, ఎందుకంటే అతను గోపీచంద్ అభిమానులను సంతృప్తి పరచడం కోసం ఆ అంశాలను జోడించినట్టు తెలుస్తోంది. 

సినిమా ఓపెనింగ్ చాలా బాగుంది. పాత్రల పరిచయం కూడా బాగుంది క ాని.. పోను పోనూ.. కాస్త సాదీ సీదాగా అనిపిస్తూ.. ఆడియన్స్ ను పోర్ కొట్టించేలా ఉండటం ఈసినిమాకు మైనస్ అని చెప్పవచ్చు.  ఫస్ట్ పార్ట్ అంతా..  మారుతీ మార్క్ కామెడీ మరియు గోపీచంద్ మార్క్ యాక్షన్‌తో సాగిపోతుంది. ఇక సెకండ్ హాఫ్ కోసం ఎదురు చూసే ఆడియన్స్ కు పెద్దగా కొత్త దనం కనిపించదు. 

రామ్‌చంద్‌గా గోపీచంద్‌ బాగానే చేసాడు, ఈమధ్య మోనాటనీ చూపిస్తూ వస్తోన్న గోపీచంద్ మరోసారి  ఫుల్‌ లెంగ్త్‌ కామెడీలో ఇరగదీశాడు. గోపీచంద్ లో ఈ కసి చూసి చాలా రోజులైంది, అయితే లౌక్యం తరహా బాడీ లాంగ్వేజ్‌, కామెడీ టైమింగ్‌ని గుర్తుకు తెచ్చినా.. కామెడీ సీన్స్  చేస్తున్నప్పుడు మాత్రం బాగానే చేసాడు. ఝాన్సీగా రాశి కన్న ఫర్వాలేదు అనిపించింది. తన పాత్రకు న్యాయం చేసింది. 

ఇక  రావు రమేష్ ఎప్పటిలాగే, తన ప్రత్యేకమైన కామెడీ టైమింగ్‌తో అద్భుతంగా చేసాడు, సత్యరాజ్. అతని పాత్ర మేరకు మెప్పించాడు. వరలక్ష్మీ శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది. ఇక  మిగిలిన నటీనటులు తమ వంతు పాత్రలకు న్యాయం చేశారు. 
 

ఇక డైరెక్టర్ గురించి చెప్పాలంటే.. మారుతీ అంటే అడల్ట్ ,కామెడీ అనే ముద్ర ఉంది.. ఈసారి యాక్షన్ ను దానికి జోడించాడు. ఈ సినిమాలో కామెడీ కాస్త ఆర్టిఫిషల్ గా అనిపిస్తుంది. ఒకరకంగా కామెడీ మిస్‌ఫైర్ అయింది అనొచ్చు. ఇక మిగతా సినిమా అంతటిని తన దైన స్టైల్ లో నడిపించాడు మారుతి.  
 

టెక్నికల్‌గా పక్కా కమర్షియల్ మారుతీ కెరీర్‌లో బెస్ట్ ఫిల్మ్‌గా నిలిచింది, ఎందుకంటే కర్మ్ చావ్లా సినిమాటోగ్రఫీ అత్యున్నత స్థాయిలో ఉంటుంది. ఇక జేక్స్ బిజోయ్  పాటలను కరెక్ట్ గా చేయలేదనిపిస్తుంది.. కాని  బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది మిగిలిన టెక్నికల్ టీమ్ బాగా కష్టపడ్డారు. మరి ఈ సినిమా ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలంటే ఓరెండు రోజులు ఆగాల్సిందే. 

Latest Videos

click me!