పెళ్లికి సిద్ధమైన మరో ప్రేమ జంట.. ముహూర్తం ఫిక్స్ ?.. అలియాభట్‌, కత్రినా కైఫ్‌ లే కారణమా?

Published : May 18, 2022, 03:57 PM IST

బాలీవుడ్‌లో మరో ప్రేమ జంట మ్యారేజ్‌ కి సిద్ధమయ్యింది. ఇటీవల `ఆర్‌ఆర్‌ఆర్‌` హీరోయిన్‌ అలియాభట్‌, బాలయ్య భామ కత్రినా కైఫ్‌ మ్యారేజ్‌లు చేసుకోగా, ఇప్పుడు జంట మ్యారేజ్‌కి సిద్ధమవుతుందట.   

PREV
16
పెళ్లికి సిద్ధమైన మరో ప్రేమ జంట.. ముహూర్తం ఫిక్స్ ?.. అలియాభట్‌, కత్రినా కైఫ్‌ లే కారణమా?

ఇటీవల బాలీవుడ్‌లో వరుసగా తారల పెళ్లిళ్లు జరిగాయి. అలియాభట్‌(Alia Bhatt), రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) గత నెలలో మ్యారేజ్‌ చేసుకున్నారు. మరోవైపు అంతకు ముందే కత్రినా కైఫ్‌(Katrina Kaif), విక్కీ కౌశల్‌(Vicky Kaushal) ఒక్కటయ్యారు. ఈ రెండు జంటలు ప్రేమించుకుని ఒక్కటైన వారే. తమ ప్రేమని ఇంట్లో వారిని ఒప్పించుకుని పెద్దల సమక్షంలోనే గ్రాండ్‌గా, సాంప్రదాయ పద్ధతిలో మ్యారేజ్‌ చేసుకున్నారు. మరోవైపు టీవీ నటీనటులు కూడా మ్యారేజ్‌లు చేసుకోవడంతో బాలీవుడ్‌లో పెళ్లి సందడి కనిపించింది. 

26

ఆ సందడిని ఇంకా కంటిన్యూ చేయబోతుంది మరో జంట. బాలీవుడ్‌లో అత్యంత రొమాంటిక్‌ లవ్‌ కపుల్‌గా పేరు తెచ్చుకున్న అర్జున్‌ కపూర్‌(Arjun Kapoor), మలైక అరోరా(Malaika Arora) కూడా ఒక్కటి కాబోతున్నారట. వీరి కూడా ఈ ఏడాదిలోనే మ్యారేజ్‌ చేసుకోవాలని భావిస్తున్నారట. నవంబర్‌, డిసెంబర్‌లోగానీ మ్యారేజ్‌కి ప్లాన్‌ చేసుకుంటున్నట్టు సమాచారం. కేవలం ఫ్యామిలీ మెంబర్స్, ఇతర సన్నిహితులు మాత్రమే హాజరయ్యేలా ప్లాన్‌ చేసుకుంటున్నట్టు సమాచారం. 
 

36

అయితే ఈ ఇద్దరు మ్యారేజ్‌ చేసుకోవడానికి ప్రధాన కారణం ఇటీవల మ్యారేజ్‌లు చేసుకున్న అలియాభట్‌, కత్రినా కైఫ్‌లే అంటున్నారు. క్రమంగా ఒక్కొక్కరు ఫ్యామిలీ లైఫ్‌లోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో ఇక మలైకా అరోరా, అర్జున్‌ కపూర్‌ కూడి మ్యారేజ్‌ చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. కానీ ఈ జోడి త్వరలో పెళ్లి పీఠలెక్కబోతున్నారనే వార్త ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌ అవుతుంది. 

46

మలైకా అరోరా, అర్జున్‌ కపూర్‌ చాలా ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. మలైకా అరోరా గతంలో సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్‌ని పెళ్లి చేసుకోగా వారికి ఓ పిల్లోడు కూడా ఉన్నాడు. అనంతరం ఈ ఇద్దరు విడిపోయారు. ఆ తర్వాత కొన్ని రోజులు ఒంటరిగానే ఉన్న మలైకా క్రమంగా అర్జున్‌ కపూర్‌తో ప్రేమలో పడింది. తనకంటే ఏజ్‌లో చిన్నవాడైనా అర్జున్‌ ప్రేమలో పడటం చర్చనీయాంశమైంది. అయితే బాలీవుడ్‌లో ఇలాంటికి కామనే కావడంతో, అంతా కామన్‌గానే తీసుకుంటున్నారు. 
 

56

అర్జున్ కపూర్‌ తన 34వ బర్త్ డే సందర్భంగా 2019లో మలైకాతో ప్రేమ వ్యవహారం గురించి బహిరంగంగా ప్రకటించాడు. అప్పటి నుంచి సందర్భం వచ్చినప్పుడల్లా ఒకరిపై మరొకరు ప్రశంసలు కురిపిస్తూ తమ ప్రేమను వ్యక్తం చేస్తున్నారు. దీంతో అభిమానులు సైతం వీరి ప్రేమపై ప్రశంసలు కురిపిస్తున్నారు. బహిరంగంగానే చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. ఓపెన్‌గా డేటింగ్‌ చేసుకుంటున్నారు. తరచూ వార్తల్లో నిలుస్తున్న ఈ జోడీ ఎట్టకేలకు మ్యారేజ్‌ చేసుకుని ఒక్కటి కావాలని నిర్ణయించుకోవడం పట్ల అభిమానుల నుంచి హర్షం వ్యక్తమవుతుంది. 

66

ఒకప్పుడు హీరోయిన్‌గా మెప్పించిన మలైకా అరోరా, ఆ తర్వాత స్పెషల్‌ సాంగ్‌ల్లో మెరిసింది. అడపాదడపా మెరుస్తుంది. మరోవైపు యోగాసనాలతో బిజీగా ఉంటుంది. స్పెషల్‌ వీడియోలో, యోగా ట్రైనింగ్‌తో గడుపుతుంది. ఇక అర్జున్‌ కపూర్‌ హీరోగా బిజీగా ఉన్నారు. ఆయన `ఏక్‌ విలన్‌రిటర్న్స్`, `కుట్టీ`, `ది లేడీ కిల్లర్‌ చిత్రాల్లో నటిస్తున్నాడు. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories