ఇటీవల విడుదలైన 'ఇంప్యూర్' ట్రైలర్, 'ఓఎంజీ' (ఓ మై గాడ్) పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. 'ఓఎంజీ' సాంగ్ ప్రత్యేకత ఏమిటంటే... తెలుగు మూలాలు ఉన్న అమెరికన్ ర్యాపర్, సింగర్ రాజ కుమారి పాడటం. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ 'జవాన్' టైటిల్ ట్రాక్ పాడినది ఆవిడే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' సినిమాలోని 'ధోప్ ' కూడా పాడారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఓజీ'లో 'ఫైర్ స్ట్రోమ్' అయితే ఛార్ట్ బస్టర్ అయ్యింది. 'ఓజీ' సాంగ్ తర్వాత తెలుగులో రాజ కుమారి పాడిన పాట 'ఇంప్యూర్'లో 'ఓఎంజీ' కావడం విశేషం. ఈ పాటకు తెలుగు లిరిక్స్ కడలి సత్యనారాయణ అందించారు. ఈ సినిమాతో రాజ కుమారి సంగీత దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. ఈ పాటతో పాటు మరొక పాటను పాడటమే కాదు, సినిమాలో ప్రత్యేక అతిథి పాత్రలో ఆమె నటించారని నిర్మాత శ్రీదేవి మల్లిపాముల తెలిపారు.
మోడ్రన్ రిలేషన్స్ పై `ఇంప్యూర్`
'ఇంప్యూర్' సినిమా గురించి నిర్మాత శ్రీదేవి మల్లిపాముల మాట్లాడుతూ, `కాలంతో పాటు సమాజంలో మార్పులు వస్తున్నాయి. ఆ మార్పులను చూపిస్తూ మోడ్రన్ రిలేషన్షిప్స్ మీద తీసిన చిత్రమిది. మహిళలను సమాజం చూసే కోణాన్ని సున్నితంగా ప్రశ్నిస్తుంది. మానవ సంబంధాల నేపథ్యంలో, మోడ్రన్ జనరేషన్, అంతకు ముందు తరం మధ్య ఎటువంటి అనుబంధం ఉండాలనేది చెబుతూ తీసిన చిత్రమిది. జెన్ జి మాత్రమే కాదు... అన్ని వయసుల వాళ్ళను, అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే చిత్రమిది` అని చెప్పారు.
యష్న, వారాహి, సాయి కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన 'ఇంప్యూర్' సినిమాలో రాజకుమారి ప్రత్యేక పాత్రలో నటించారు. అభిజీత్, కిరీటి దామరాజు, ఆర్జే కాజల్, శ్రీవాణి ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి స్టోరీ: వారాహి మల్లిపాముల, ఎడిటర్స్: అశుతోష్ మతేల, రామకృష్ణ ఆరమ్, ఒరిజినల్ స్కోర్: కరణ్ పాండవ్ & నిర్వాణ్ ఆత్రేయ, సినిమాటోగ్రాఫర్: జ్ఞానశేఖర్ వీఎస్, మ్యూజిక్ డైరెక్టర్: రాజ కుమారి & కరణ్ పాండవ్, ప్రొడ్యూసర్స్: వారాహి మల్లిపాముల & శ్రీదేవి మల్లిపాముల, డైరెక్టర్: నిశాంతి ఇవని.