జపనీయుల హృదయాలను దోచుకుంటున్న ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌.. అక్కడ వారేం చేశారో తెలిస్తే వాహ్‌ అంటారు!

Published : Oct 21, 2022, 03:06 PM ISTUpdated : Oct 21, 2022, 03:12 PM IST

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ ప్రస్తుతం జపాన్‌లో ఎంజాయ్‌ చేస్తున్నారు. `ఆర్‌ఆర్‌ఆర్‌` ప్రమోషన్‌ కోసం జపాన్‌ వెళ్లిన ఈ ఇద్దరు స్టార్లు జపనీయుల హృదయాలను గెలుచుకుంటున్నారు. 

PREV
18
జపనీయుల హృదయాలను దోచుకుంటున్న ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌.. అక్కడ వారేం చేశారో తెలిస్తే వాహ్‌ అంటారు!

ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ కలిసి నటించిన `ఆర్ఆర్‌ఆర్‌` నేడు(అక్టోబర్ 21) జపాన్‌లో విడుదలైంది. సినిమా ప్రమోషన్‌ కోసం మూడు రోజుల క్రితం ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌తోపాటు రాజమౌళి జపాన్‌ వెళ్లారు. తారక్‌, చరణ్‌ తమ ఫ్యామిలీలతో కలిసి జపాన్‌ వెల్లడం విశేషం. అక్కడ ఓవైపు సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటూనే ఫ్రీ టైమ్ లో అక్కడి వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. 

28

తాజాగా రెండు రోజులపాటు ప్రమోషన్స్ లో బిజీగా గడిపారు చరణ్‌, ఎన్టీఆర్‌, రాజమౌళి. అక్కడి మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. సినిమా గురించి ప్రమోట్‌ చేశారు. శుక్రవారం సినిమా విడుదలైంది. దీంతో కాస్త రిలీఫ్‌ అయ్యారు. దీంతో ఖాళీ టైమ్‌ని పర్సనల్‌ టైమ్‌కి వాడుకుంటున్నారు. అక్కడి జనాలను కలుసుకుంటూ సరదాగా గడుపుతున్నారు. 

38

`ఆర్‌ఆర్‌ఆర్‌` ప్రమోషన్స్ అనంతరం జపాన్‌లోని తన అభిమానులను కలుసుకున్నారు ఈ ఇద్దరు స్టార్స్. సడెన్‌ సర్‌ప్రైజ్‌తో వారిని ఖుషీ చేశారు. వారితో కాసేపు ముచ్చటించారు. ఆటోగ్రాఫ్‌లిచ్చారు. వారితో సెల్ఫీలు ఇచ్చారు. ఈ సందర్భంగా వారి దిగిన ఫోటోలు, వీడియోలు సోసల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 
 

48

మరోవైపు రామ్‌చరణ్‌ జపాన్‌లోని ఇండియాకి చెందిన అభిమానులను కలుసుకున్నారు. టోక్కోలో ఉన్న ఇండియా ఇంటర్నేషన్‌ స్కూల్‌ని విజిట్‌ చేశారు. భార్య ఉపాసనతో కలిసి ఆయన వారిని కలుసుకున్నారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని వారితో కాసేపు సరదాగా గడిపారు. ఈ పిక్స్ సైతం హల్‌చల్‌ చేస్తున్నాయి.

58

ఈ ఇద్దరు స్టార్లు ఇప్పుడు జపాన్‌లో ఫుల్‌ బిజీగా గడుపుతున్నారు. ఓవైపు ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్‌ చేస్తూనే, మరోవైపు ఇలా అక్కడి అభిమానులను ఆకట్టుకుంటుండటం విశేషం. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 

68

ఎన్టీఆర్‌, చరణ్‌ కలిసి నటించిన `ఆర్ఆర్‌ఆర్‌` ఇప్పటికే ఇండియాతోపాటు వెస్ట్రన్‌ కంట్రీస్‌లో విడుదలై సంచలన విజయం సాధించింది. సుమారు రూ.1200కోట్లు వసూలు చేసింది. రాజమౌళి మ్యాజిక్‌, చరణ్‌, తారక్‌ల నట విశ్వరూపం సినిమాకి హైలైట్‌గా నిలిచాయి. విశేష ఆదరణతోపాటు ప్రశంసలు దక్కాయి.
 

78

 ముఖ్యంగా ఈ చిత్రానికి విదేశీ ఆడియెన్స్, మేకర్స్ నుంచి ప్రశంసలు రావడం విశేషం. అంతేకాదు ఇప్పుడీ చిత్రం పలు విభాగాల్లో ఆస్కార్‌ బరిలోనూ ఉంది. ఆస్కార్‌ అవార్డు కోసం పోటీ పడుతుంది.

88

మరి ఆస్కార్‌ గెలిచి సంచలనం సృష్టిస్తుందా? లేక యదావిధిగా వెనుతిరుగుతుందా? అనేది చూడాలి. ఇప్పటి వరకు ఏ ఇండియా సినిమాకి ఆస్కార్‌ దక్కలేదు. కానీ టెక్నీషియన్లకి ఆస్కార్ దక్కింది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories