ఎన్టీఆర్ కోసం కథపై మరోసారి కసరత్తు చేస్తోన్న కొరటాల, ఆచార్య ఎఫెక్ట్ గట్టిగా పడినట్టుంది

Published : May 05, 2022, 02:01 PM IST

కొరటాల శివ ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. సినిమా కోసం అంతా రెడీ అయ్యింది, ఇక షూటింగ్ కు వెళ్లడమే ఆలస్యం అనకుున్న టైమ్ లో.. మళ్ళీ కథపై కసరత్తు మొదలు పెట్టాడట కొరటాల. మరి ఈ స్టార్ డైరెక్టర్ కు మళ్ళీ  ఓటమి బయం పట్టుకుందా..? 

PREV
17
ఎన్టీఆర్ కోసం కథపై మరోసారి కసరత్తు చేస్తోన్న కొరటాల, ఆచార్య ఎఫెక్ట్ గట్టిగా పడినట్టుంది

ఓటమి ఎరుగని టాలీవుడ్ దర్శకులలో కొరటాల శివ ఒకరు. ఆయన ఇప్పటి వరకూ తీసిన సినిమాలు ప్లాప్ అవ్వలేదు. అందుకే టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో కొరటాల శివ స్థానం ప్రత్యేకం. ఆయన టేకింగ్ కాని, స్క్రీన్ ప్లే కాని డిఫరెంట్ గా  ఉటుంది. 
 

27

అంతే కాదు కొరటాల రాసుకునే కథలు .. వాటి ట్రీట్మెంట్ కొత్తగా ఉంటాయి.అక్కడే ఆయన మార్క్ కొత్తదనం కనిపిస్తూ ఉంటుంది.  హీరోయిజాన్ని కొత్తగా చూపించే కొరటాల పవర్ఫుల్ డైలాగ్స్ ను కూడా హీరోతో చాలా సింపుల్ గా  చెప్పిస్తుంటాడు. అన్ని రకాల ఆడియన్స్ ను  మెప్పిచడంకోసం ఏక్కడ ఏం చేయాలో తెలిసిన దర్శకుడు కోరటాల.

37

అలాంటి కొరటాలకు ఓటమి రుచి చూపించిన సినిమా  ఆచార్య.  భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయింది. దాదాపు రెండేళ్లకు పైగా టైమ్ తీసుకుని మరీ ఈసినిమాను చెక్కారు. అంత టైమ్ తీసుకుని చేసిన సినిమా ఇదా అంటూ.. ఆడియన్స్ పెదవి విరుస్తున్నారు. 
 

47

ఆచార్య ప్లాప్ ప్రభావం గట్టిగా పడినట్టుంది. దాంతో ఇప్పుడు తాను తీయబోయే ఎన్టీఆర్ సినిమా స్క్రిప్ట్ పై కొరటాల మరోసారి దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. ఈసారి మాత్రం దెబ్బ పడకుండా చూసుకోవాలి అని చూస్తున్నాడట కొరటాల. అందుకే కథపై మరోసారి కసరత్తు స్టార్ట్ చేశాడని టాక్. 

57

అంతే కాదు రాజమౌళి సినిమా సెంటిమెంట్ ప్రభావం ఆచార్య సినిమా ప్లాప్ తో మారోసారి రుజువయ్యింది అంటున్నారు సినీ జనాలు. అటు ఎన్టీఆర్ కు కూడా ట్రిపుల్ ఆర్ తరువాత కొరటాలతోనే సినిమా ఉండటంతో ఊమౌతుందా అని బయపడుతున్నాడట కొరటాల. దాంతో తారక్ ఈ విషయంలో కొరటాలకు అభయం ఇచ్చినట్టు టాక్. 
 

67

ఇక  కథలో అన్ని అంశాలు పుష్కలంగా ఉన్నాయా? లేదా? ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే అంశాలేమైనా వదిలేస్తున్నామా? డైలాగ్స్ ఎన్టీఆర్ స్థాయికి తగినట్టుగా ఉన్నాయా? లేదా? అనేవి ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటున్నాడట కొరటాల శివ. 

77

ఇక ఈనెల 20 నుంచి ఈ సినిమా  రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈసినిమాలో హీరోయిన్లు గా చాలా మంది పేర్లు వినిపించాయి. ఆలియ భట్ ను తీసుకున్నా.. ఆమె పెళ్లి కారణంగా ఈసినిమను వదులుకున్నట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం రష్మిక, కీర్తి సురేష్ పేర్లు వినిపిస్తున్నాయి.

click me!

Recommended Stories