బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ - యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన నటించబోతోందని గట్టిగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. కొన్ని ఇన్ సైడ్ వర్గాల సమాచారం ప్రకారం.. జాన్వీ కన్ఫమ్ అంటూ ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ పక్కా అనేది తెలిసిపోయింది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) సరసన జాన్వీ తొలిసారిగా నటించబోతుండటంతో ఫ్యాన్స్ కూడా ఖుషీ అవుతున్నారు. తమ మద్దతును జాన్వీకి తెలుపుతున్నారు. అయితే, మార్చి 6న జాన్వీ పుట్టిన రోజు కావడం విశేషం. ఈరోజు రాత్రికి ఈ యంగ్ బ్యూటీ 26వ ఏటా అడుగుపెట్టబోతోంది.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ జాన్వీ కపూర్ కు ముందుగానే పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తమ అభిమాన హీరో సరసన నటించబోతుందనే ప్రచారంతో జాన్వీకి సోషల్ మీడియాలో ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె పేరును ట్రెండ్ చేస్తున్నారు.
ఈక్రమంలో NTR30 చిత్ర యూనిట్ ను ఫ్యాన్స్ అప్డేట్ కోరుతున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఉన్నట్టు ఒక్కసారి అనౌన్స్ చేస్తే చాలంటున్నారు. హైప్ తేవడానికి మిగతావన్నీ తామే చూసుకుంటామని అభిమానులు ట్వీటర్ లో పోస్టులు పెడుతున్నారు.
ఎప్పటి నుంచో జాన్వీ కపూర్ టాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వబోతుందని గట్టిగా ప్రచారం జరుగుతోంది. అదీ ఎన్టీఆర్ సరసన నటించే ఛాన్స్ దక్కించుకుందని స్ట్రాంగ్ గా వినిపిస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో రానున్న ‘ఎన్టీఆర్30’లో హీరోయిన్ గా జాన్వీని కన్ఫమ్ చేసినట్టు ప్రకటన చేయాలని కోరుతున్నారు.
జాన్వీ కపూర్ ప్రస్తుతం ‘మిస్టర్ అండ్ మిస్ మహి’లో నటిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ కొనసాగుతోంది. ఆ మూవీ సెట్స్ లోంచి తాజాగా కొన్ని పిక్స్ ను పంచుకుంది. రాత్రి పగలు షూటింగ్ లో పాల్గొంటున్నట్టు చెప్పుకొచ్చింది. ఈక్రమంలో జాన్వీ కొన్ని గ్లామర్ పిక్స్ నూ పంచుకుని నెటిజన్లకు సండే ట్రీట్ అందించింది.