కరోనాతో ప్రైవేట్‌ లెక్చరర్ల దయనీయ స్థితిని ఆవిష్కరించిన ఎన్టీఆర్‌ `ఎవరు మీలో కోటీశ్వరుడు`..

First Published Aug 1, 2021, 4:06 PM IST

`ఆర్‌ఆర్‌ఆర్‌` స్టార్‌ ఎన్టీఆర్‌ హోస్ట్ గా ప్రసారం కానున్న `ఎవరు మీలో కోటీశ్వరులు` ఓ వినూత్న కాన్సెప్ట్ తో వస్తోంది. జస్ట్ ప్రోమోలోనే సామాజిక అంశాన్ని చర్చించడం అందరిని ఆకట్టుకుంటుంది. ప్రైవేట్‌ స్కూల్‌, కాలేజీలు, టీచర్ల పరిస్థితిని ఆవిష్కరిస్తుంది. 
 

ఎన్టీఆర్‌ రియాలిటీ షోకి హోస్ట్ గా చేయడం ఇది రెండోసారి. ఫస్ట్ టైమ్‌ ఆయన `బిగ్‌బాస్‌` ఫస్ట్ తెలుగు సీజన్‌కి హోస్ట్ గా వ్యవహరించారు. ఆ షోకి క్రేజ్‌ని, పాపులారిటీని తీసుకొచ్చారు. ఓ లెవల్‌ క్రియేట్‌ చేశారు.
undefined
ఇప్పుడు మరో రియాలిటీ షో `ఎవరు మీలో కోటీశ్వరులు` కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఈ షో ఏప్రిల్‌ టైమ్‌లోనే టెలికాస్ట్ కావాల్సి ఉంది. కానీ కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా వాయిదా పడింది. ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు మరోసారి గూస్‌బమ్స్ అప్‌డేట్‌తో వచ్చారు. ఆదివారం రెండో ప్రోమో విడుదల చేశారు. ప్రారంభంలో ఎన్టీఆర్‌తో కూడిన ప్రోమో రిలీజ్‌ చేసిన విషయం తెలిసిందే.
undefined
ఇందులో ఈ షో కి సంబంధించిన ప్రత్యేకతని స్పష్టంగా వివరించారు. అదే సమయంలో సామాజిక అంశంతో షో ప్రారంభించబోతున్నట్టు చెప్పడం ఆకట్టుకుంటుంది. కరోనా కారణంగా ప్రైవేట్‌ స్కూల్‌, కాలేజీల పరిస్థితి ఎలా ఉన్నాయి, సాధారణ ప్రజల ఇబ్బందులు, టీచర్ల దయనీయస్థితిని ఆవిష్కరించింది.
undefined
కరోనాతో ప్రజలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రైవేట్‌ స్టూడెంట్స్ స్కూల్‌, కాలేజ్‌ ఫీజులు కట్టలేని పరిస్థితి నెలకొంది. దీంతో స్టూడెంట్స్ ఫీజులుకట్టడం లేదని యాజమాన్యం లెక్చరర్‌ని ఉద్యోగంలో నుంచి తీసేస్తుంది.
undefined
అప్పటి వరకు క్లాస్‌లో పాఠాలు చెప్పే లెక్చరర్‌ కుటుంబం రోడ్డున పడ్డ పరిస్థితి. దీంతో కుటుంబ పోషణ కోసం టిఫిన్‌ సెంటర్‌ నడుపుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి రావడాన్ని ఇందులో చూపించడం హృదయాన్ని కలిచి వేస్తుంది.
undefined
ఆ లెక్చరర్‌కి ఉద్యోగం లేదు, కానీ టాలెంట్‌ ఉంది, నాలెడ్జ్ ఉంది. ఫీజులు కట్టలేని తన స్టూడెంట్స్ ని ఆదుకోవాలనే తపన ఉంది. అవే ఆయన్ని `మీలో ఎవరు కోటీశ్వరులు` షోకి తీసుకొచ్చింది. ఆయన ఈ షోలో కంటెస్టెంట్‌గా పాల్గొనే అవకాశాన్ని దక్కించుకున్నాడు.
undefined
ఈ షోలో ఆయన ఎట్టకేలకు రూ. 25లక్షలు గెలుచుకున్నాడు. ఈ డబ్బుని ఏం చేయబోతున్నావని ఎన్టీఆర్‌ అడగ్గా.. `సర్‌ నా స్టూడెంట్స్ లో చాలా మంది ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇందులో సగం డబ్బుతో వారి ఫీజులు కడతాను. మిగిలినని తన ఫ్యామిలీ ఖర్చుల కోసం వాడుకుంటాను` అని చెప్పడంతో ఎన్టీఆర్‌ సూపర్బ్ అనడం హార్ట్ టచ్చింగ్‌గా అనిపించింది.
undefined
ఫైనల్‌గా ఇక్కడ మనీ మాత్రమే కాదు మనసులు కూడా గెలుచుకోవచ్చు. ఇక్కడ కథ మీది, కల మీది, ఆట నాది.. కోటీ మీది. రండి గెలుద్దాం ఎవరు మీలో కోటీశ్వరులు అని ఎన్టీఆర్‌ తనదైన స్టయిల్‌లో చెప్పడం ఆకట్టుకుంది.
undefined
ప్రస్తుతం నెలకొన్న సామాజిక సమస్యని తీసుకుని ప్రోమో రెడీ చేయడంతో ఈ షో అందరి హృదయాలను గెలుచుకుంటోంది. ఈ సారి గతం కంటే భిన్నంగా చాలా ఎమోషనల్‌గా, హార్ట్ టచ్చింగ్‌ స్టోరీస్‌తో ఈ షో ఉండబోతుందని అర్థమవుతుంది.
undefined
click me!