ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ప్రశాంత్ నీల్ సినిమా నుంచి స్పెషల్ వీడియోను మూవీ టీమ్ రిలీజ్ చేసింది. అభిమానుల ఊహలకు అందని విధంగా అద్భుతం చేశాడు జూనియర్ ఎన్టీఆర్.
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న స్పెషల్ గ్లింప్స్ వచ్చేసింది. చాలా కాలంగా కోపంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులను చల్లబరచడంకోసం.. వారి ఆకలి తీరేలా స్పెషల్ గ్లిమ్స్ ను రిలీజ్ చేశారు టీమ్. 4.28 సెకండ్ల డ్యూరేషన్ తో ఉన్న ఈ వీడియోలో ఎన్టీఆర్ ఊచకోత మామూలుగా లేదు. ''నిదురపోయినప్పుడునా కలలోకి నేను చంపినవారి ముఖాలు రావు..మిగిలి ఉన్న శత్రువుల ముఖాలే వస్తాయి. పొరపాటున నా కల్లోకిరావద్దు'' అని ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్.. ఆ వాయిస్ బేస్..తారక్ లుక్ అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది.
26
ఎన్టీఆర్ లుక్ రచ్చరచ్చ..
ఈ సినిమాకు ఇప్పటి వరకూ ఉన్న వర్కింగ్ టైటిల్ డ్రాగన్ ను ఫిక్స్ చేశారు. ఎన్టీఆర్ ఎందుకంత బరువు తగ్గాడో ఈ వీడియో చూస్తే అర్ధం అవుతుంది. తారక్ లుక్ చాలా డిఫరెంట్ గా ఉండబోతోంది ఈసినిమాలో. అందుకు తగ్గట్టుగా తనను తాను చాలామార్చుకున్నాడు కూడా. అంతే కాదు ఎన్టీఆర్ వాయిస్ లో కూడా చాలా ఛేంజ్ కనిపించింది. మునుపటిలా లేదు. గంభీరంగా.. పాత్రకు తగ్గట్టుగా మారిపోయింది.
36
ఆరుగురు విలన్లతో పోరాడతాడా?
డ్రాగన్ వీడియోలో ఎన్టీఆర్ ను చూపించింది చాలా తక్కువ.. విలన్ల పరిచయాలే ఎక్కువగా కనిపించాయి. కానీ ఎన్టీఆర్ పాత్ర మాత్రం ఎలా ఉండబోతుంది అనేది.. అతితక్కువు టైమ్ లోనే అభిమానులకు క్లారిటీ వచ్చేలా చేశాడు ప్రశాంత్ నీల్. ఆరుగురు భయంకరమైన విలన్లు.. ఎవరికి వారు డిఫరెంట్ ఆటీట్యూడ్ తో చూస్తేనే చెమటలు పట్టేలా కనిపించారు. ఈ విలన్ల మధ్యలో ఎన్టీఆర్ డ్రాగన్ పాత్ర కూడా నెగెటీవ్ షేడ్స్ తో ఉండబోతున్నట్టు సమాచారం. ఇక ఈకథకు అసలైన హీరో మీరే అంటూ.. అనిల్ కపూర్ పాత్రను పరిచయం చేశారు.
ప్రశాంత్ నీల్ తీసుకునే సినిమాలన్నీ.. గతకాలపు కథలతోనే ఉంటున్నాయి. వాటిని ఓ సిరీస్ లా చేస్తున్నాడు దర్శకుడు. అందులో హీరోలను మారుస్తున్నాడు అంతే. ఈసినిమా కూడా ఇండియాకు ఫ్రీడంవచ్చిన తరువాత పుట్టుకొచ్చిన విలన్లపై నడుస్తుంటుంది. 1967 లో జరిగిన కథ అంటూ వీడియో స్టార్ట్ అయ్యింది. ఇదే కాదు కేజీఎఫ్, సలార్ కూడా అప్పటి కథలే అని వీడియోలో చూపించాడు. ఇక ప్రశాంత్ నీల్ మార్క్ మిస్ అవ్వకుండా.. అదే డార్క్ స్క్రీన్ ను కంటీన్యూ చేశాడు.
56
రిలీజ్ విషయంలో షాక్ ఇచ్చిన టీమ్..
ఎన్టీఆర్ నుంచి సినిమా వచ్చి చాలా కాలం అవుతోంది. దేవర ఎప్పుడో 2024 లో రిలీజ్ అయ్యింది. మధ్యలో వార్ వచ్చినా.. అది మన సినిమా అనిపించుకోలేదు. దాంతో తారక్ అభిమానులు మంచి ఆకలి మీద ఉన్నారు. అటువంటి టైమ్ లో డ్రాగన్ మూవీ ఫుల్ మీల్స్ అవుతుందని ఆశగా ఉన్నారు.
ఈ గ్లిమ్స్ వీడియోతో మూవీపై ఆశలు పెరిగిపోయాయి. అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. అయితే రిలీజ్ డేట్ విషయంలోనే షాక్ ఇచ్చారు టీమ్. ప్రశాంత్ నీల్ ఈమూవీ రిలీజ్ కోసం మరో ఏడాది తీసుకోబోతున్నాడు. వచ్చే ఏడాది. అంటే 2027 జులై 11న ఈసినిమాను రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చాడు.
66
అప్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులు...
డ్రాగన్ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి చాలా కాలం అవుతోంది. ఇంకా షూటింగ్ కంప్లీట్ అవ్వకపోవడంపై అభిమానులు గుర్రుగ ఉన్నారు. అంతే కాదు ఈసినిమా నుంచి అభిమానులు సంతృప్తి పడేలా అప్ డేట్ మాత్రం ఇవ్వలేకపోయాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. దాంతో ప్రశాంత్ పై ఎన్టీఆర్ అభిమానులు కాస్త కోపంగానే ఉన్నారు. అది గ్రహించిన టీమ్.. ఈ గ్లిమ్స్ ను ప్లాన్ చేశారు. ఇది అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. తారక్ బర్త్ డే గిఫ్ట్ అభిమానులు దిల్ ఖుష్ అయ్యేలా.. చేసింది. మరి సినిమా ఎలా ఉండబోతోందో చూడాలి.