'దేవర' రిలీజ్ పై మూకుమ్మడి దాడి ? ఎన్టీఆర్ ని తక్కువ అంచనా వేస్తున్నారే

First Published Apr 8, 2024, 9:33 AM IST

 కొరటాల శివ(Koratala Siva) దర్శకత్వంలో ఎన్టీఆర్(NTR) `దేవర` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ రిలీజ్‌ ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. 

సినిమా ఇండస్ట్రీ అంటేనే పోటీ మయం. ప్రతీ ఒక్కరికీ తమ సినిమానే ఆడాలి, కోట్లు గడించాలి అని ఉంటుంది. అందుకోసం చాలా సార్లు సోలో రిలీజ్, పండుగ రిలీజ్ లు చూసుకుంటారు. అయితే తాము సోలో రిలీజ్ పెట్టుకున్నంతమాత్రాన మిగతావాళ్లు ఆగుతారా..చిన్న సినిమాలు ఒకే వారంలో కుప్పలు తెప్పలు గా రిలీజ్ అయ్యి..దేనికీ ప్రత్యేకమైన గుర్తింపు లేకుండాపోయే పరిస్దితి ఏర్పాటు అవుతుంది. స్టార్ సినిమాలుకి ఆ పరిస్దితి వస్తుందా... దేవర రిలీజ్ కు మాత్రం అదే పరిస్దితి కనపడుతోంది. ఎందుకిలా

తెలుగులో  నెక్ట్స్ పెద్ద సినిమాల్లో ఒకటి దేవర.  ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఈ సినిమా కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.  ఈ సినిమాను ప్రకటించిన తేదీ ఏప్రియల్ 5 కు గ్రాండ్ గా ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేసారు. కానీ అది జరగలేదు.  అవాంతరాలు మధ్యలో చాలా వచ్చాయి.  విలన్ గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ గాయపడడం అలాగే కొన్ని షూటింగ్ పనులు అనుకున్న సమయానికి పూర్తిగా కాకపోవడం జరిగింది. ఈ నేపధ్యంలో  ఆ రిలిజ్ డేట్ కు ఫ్యామిలీ స్టార్ వచ్చింది.

దేవరకు సంబంధించిన కొత్త విడుదల తేదీని ప్రకటించారు. దసరాకు దేవర వేట ఉండబోతోందని ప్రకటించేశారు. అక్టోబర్ 10న దేవర రిలీజ్ కాబోతోందని మేకర్లు తాజాగా అనౌన్స్ చేశారు. అయితే ఈ దసరాకు భారీ పోటీ ఉండేలా కనిపిస్తోంది. ఎటు చూసినా పెద్ద సినిమాలే కనపడుతున్నాయి. అక్టోబర్ నెల మొత్తం పెద్ద సినిమాల రిలీజ్ జాతరలా ఉంది. ఇది దేవరకు దెబ్బ కొడుతుందా అనే ఆలోచన ప్యాన్స్ ని కంగారు పెడుతోంది.

దేవర సినిమాకు చాలా పెద్ద సినిమాల కాంపిటేషన్ ఎదురౌతోంది. పవన్ కల్యాణ్ OG చిత్రం దేవరకు రెండు వారాలా ముందే వస్తోంది. మరో ప్రక్క రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ చిత్రం సైతం అక్టోబర్ రిలీజ్ కే ఎయిమ్ చేస్తున్నారు. నాగచైతన్య తండేలు చిత్రం సైతం అక్టోబర్ లోనే వస్తోంది. ఇవి చాలదన్నట్లు అజిత్ విదా ముయార్చి సినిమా, రజనీకాంత్ వెట్టయాన్ సినిమాలు సైతం అక్టోబర్ లోనే వస్తున్నాయి. ఇన్ని సినిమాలు దేవర చుట్టూ కనపడుతున్నాయి. ఇలాంటి పరిస్దితుల్లో ఏమన్నా ఇబ్బందులు దేవరకు ఎదురౌతాయా?  
 

అయితే ఈ దాడి లాంటి వరస రిలీజ్ లు కావాలని చేస్తున్నది మాత్రం కాదు. ప్లానింగ్ లో వచ్చిన సమస్యలు. ఏప్రియల్ 5 న ముందు అనుకున్న రిలీజ్ డేట్ వచ్చేస్తే ఈ సమస్య రాదు. కానీ ఇప్పుడు అన్ని వైపుల నుంచి లాక్ చేస్తున్నట్లు జరుగుతోంది. దానికి తోడు దాదాపు అక్టోబర్ లో రిలీజ్ అవుతున్న అన్ని సినిమాలు ప్యాన్ ఇండియా స్దాయి సినిమాలే. దాంతో దేవర ఎంత పెద్ద హిట్ అయినా సరే ఖచ్చితంగా కలెక్షన్స్ లో ఇంపాక్ట్ పడే అవకాసం ఉందంటున్నారు. 

ఇన్ని సినిమాలు రిలీజ్ అయితే నెలకు ఇంత సినిమాలు చూడటానికి  బడ్జెట్ అని పెట్టుకున్న మిడిల్ క్లాస్ వారికి ఖచ్చితంగా ఇబ్బంది ఎదురయ్యి..తమకు ఇష్టమైన హీరో సినిమా చూసేసి మిగతావి ఓటిటిలో వచ్చినప్పుడు చూసుకుందాములే అనుకుంటారు. అందులోనూ నెల మొదట్లో వచ్చే సినిమాలు బాగానే చూసేస్తారు. తర్వాత వచ్చే సినిమాల కలెక్షన్స్ పై ఆ ఇంపాక్ట్ పడుతుందనటంలో సందేహం లేదు.

 అయితే దేవర టీమ్ ఇవేమీ పట్టించుకునే పరిస్దితుల్లో లేవు. రాబోయే రోజుల్లో ఎలా ప్రమోషన్స్ చేసి జనాల్లోకి వెళ్లాలి అనేదానిపైనే దృష్టి పెట్టి ఈ మేరకు ప్లాన్ చేస్తున్నారు. మధ్యలో కొన్ని ఊహించని కారణాల వలన బ్రేకులు పడుతున్నప్పటికీ కొరటాలు మాత్రం వీలైనంతవరకు ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్స్ తోనే వర్క్ ఫినిష్ చేస్తున్నాడు.  

ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడిగా తంగం అనే పాత్రలో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ నటిస్తోంది.  అచ్చమైన పల్లెటూరి అమ్మాయి తరహాలో తన  అందంతో మెస్మరైజ్ చేస్తున్న జాన్వి దేవరలో మాత్రం చాలా కీలకమైన పాత్రలోనే కనిపించబోతోందని అర్దమైంది.  ఎన్టీఆర్ పుట్టిన రోజు మే 20న సాంగ్ టీజర్ రావచ్చు అని అలాగే ఓ కొత్త పోస్టర్ ని కూడా వదులుతారని తెలుస్తోంది. అయితే ఈ లోగా మాత్రం టీమ్ ఎటువంటి అప్డేట్స్ ఇవ్వదుట. 
 

‘జనతా గ్యారేజ్’ తర్వాత కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్‌ కాంబోలో వస్తున్న చిత్రం    'దేవర' .ఈ సినిమాకు మంచి బిజినెస్ జరుగుతోంది. ఎక్సపెక్టేషన్స్ పెరిగాయి. ఇప్పటికే విడుదల చేసిన లుక్‌, గ్లింప్స్ లో   చేతిలో ఆయుధంతో ఎన్టీఆర్ లుక్ ఫెర్రోషియస్‌గా ఉంది. ఈ గ్లిప్స్ చూసిన వారంతా ఎన్టీఆర్ కెరియర్ లో దేవర బెస్ట్ మూవీగా నిలిచే అవకాశం ఉందని అంటున్నారు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కంప్లీట్ ఫిక్షనల్ కథాంశంతో సిద్ధమవుతోన్న ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల రైట్స్ కు ఓ రేంజిలో పోటీ నెలకొని ఉంది. అలాగే  ఓవర్ సీస్ రైట్స్ డీల్ క్లోజ్ చేసినట్లు సమాచారం.
 

 ‘దేవర’లో ఎన్టీఆర్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం.   దేవర సినిమాలో ఒక కొత్త ప్రపంచం, చాలా బలమైన పాత్రలు, అత్యంత భారీతనం ఉంటుందని అన్నారు. అందుకే ఒకే భాగంలో దేవర కథను పూర్తిగా చూపించడం కష్టమని అనిపిస్తోందని కొరటాల చెప్పారు. అందుకే రెండు పార్ట్‌ల్లో దేవర సినిమాను తీసుకురావాలని నిర్ణయించినట్టు వివరించారు. 

రూ.300 కోట్లతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. జాన్వీ కపూర్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో సైఫ్‌ అలీఖాన్   విలన్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.   ఈ సినిమాకు లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.  
 

మరో ప్రక్క ఎన్టీఆర్ బాలీవుడ్ రంగప్రవేశానికి అంతా సిద్దమైంది.  'వార్ 2'తో బాలీవుడ్‌లో అరంగేట్రం చేస్తున్నాడు. నందమూరి కుటుంబ వారసుడికి హిందీలో మంచి ఫాలోయింగ్ ఉందని అర్దం చేసుకున్న హిందీ నిర్మాణ సంస్దలు ఆయన్ని తమ సినిమాల్లో చేయమని అడుగుతున్నారు. ఇదంతా ఎన్టీఆర్ తాజా చిత్రం దేవర బిజినెస్ కు కలిసి వస్తోంది. అక్కడ మీడియా ఇప్పుడు ఎన్టీఆర్ గురించి మాట్లాడుతోంది. దాంతో ఎన్టీఆర్ దేవర కొనటానికి అక్కడ బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్స్ ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే ఇదేమీ ఇప్పుటికిప్పుడు వచ్చిన క్రేజ్ కాదు.  

click me!