మీరు పవన్‌ కళ్యాణ్‌ భార్య అయితే, వేరే అమ్మాయితో బేబీని కంటే మీకు ఓకేనా.. రేణు దేశాయ్‌ వ్యాఖ్యలు దుమారం..

Published : Apr 08, 2024, 07:08 AM IST

రేణు దేశాయ్‌.. పవన్‌ కళ్యాణ్‌ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. వారి లేడీ ఫ్యాన్స్ కి దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చారు. ఆమె వీడియో వైరల్‌ అవుతుంది.   

PREV
18
మీరు పవన్‌ కళ్యాణ్‌ భార్య అయితే, వేరే అమ్మాయితో బేబీని కంటే మీకు ఓకేనా.. రేణు దేశాయ్‌ వ్యాఖ్యలు దుమారం..

నటి, పవన్‌ కళ్యాణ్‌ మాజీ భార్య రేణు దేశాయ్‌ ఇప్పుడు తన వ్యక్తిగత లైఫ్‌ని తాను జీవిస్తుంది. ఆమె అడపాదడపా మీడియాతో ముచ్చటిస్తూ ఆసక్తికర విషయాలను పంచుకుంటూ హాట్‌ టాపిక్‌ అవుతుంది. ముఖ్యంగా పవన్‌ కళ్యాణ్‌కి సంబంధించిన విషయాలను పంచుకున్న సమయంలో అవి చాలా వరకు వైరల్‌గా మారుతాయి. తాజాగా అలాంటిదే నెట్టింట వైరల్‌ అవుతుంది. పెద్ద చర్చనీయాంశం అవుతుంది. 
 

28
Pawan Kalyan

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, రేణు దేశాయ్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పవన్‌ తన మొదటి భార్య ఉన్నప్పుడే రేణు దేశాయ్‌తో ప్రేమలో పడ్డారు. `బద్రి` సినిమా సమయంలో వీరి ప్రేమ ప్రారంభమైంది. ఇందులో ఇద్దరు కలిసి నటించారు. `జానీ` సినిమా టైమ్‌కి ప్రేమ మరింత పెరిగింది. ఈ మూవీలో కలిసి నటించడంతోపాటు సినిమాకి రేణు దేశాయ్‌ ఇతర బాధ్యతలు కూడా తీసుకున్నారు. 
 

38
Pawan Kalyan-Renu Desai

ఆ తర్వాత 2009లో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. అప్పటికే తమ ప్రేమకి గుర్తుగా 2004లో అకీరా నందన్‌ జన్మించారు. ఆ తర్వాత ఐదేళ్లకి పెళ్లిచేసుకున్నారు. మొదటి భార్య నందినికి 2007లో డైవర్స్ ఇచ్చాక రేణు దేశాయ్‌ని పెళ్లి చేసుకున్నారు పవన్‌. అప్పటి వరకు వీరిద్దరు సహజీవనంలో ఉన్నారు. అలా అకీరా నందన్‌ జన్మించారు. పెళ్లి తర్వాత ఆద్య జన్మించింది. మూడేళ్లకే 2012లో ఈ ఇద్దరు విడిపోయారు. 
 

48
Pawan Kalyan

రేణు దేశాయ్‌తో విడిపోవడానికి ముందే ఆయన రష్యా అమ్మాయి అన్నా లెజినోవాతో ప్రేమలో పడ్డారు. ఆమెతో సహజీవనం స్టార్ట్ చేశారు. దీంతో రేణు దేశాయ్‌కి విడాకులు ఇచ్చారు పవన్‌ కళ్యాణ్‌. వీరికి కూతురు, కొడుకు ఉన్నారు. ప్రస్తుతం మూడో భార్యతోనే ఉంటున్నాడు పవన్‌ కళ్యాణ్‌. 
 

58
Pawan Kalyan

అయితే తాజాగా రేణు దేశాయ్‌ కామెంట్స్ యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతున్నాయి. ఆమె తనకు జరిగిన అన్యాయంపై స్పందించారు. తనపై పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు నానా రకాలుగా కామెంట్లు చేస్తున్న నేపథ్యంలో ఆమె ఫైర్‌ అయ్యారు. లేడీ అభిమానులను ఉద్దేశించి రేణు దేశాయ్‌ మాట్లాడుతూ, నాకు జరిగింది, మీకు జరిగితే మీకు ఓకేనా, మీరు ఎలా రియాక్ట్ అవుతారంటూ ప్రశ్నించారు. 
 

68
Pawan Kalyan - Renu desai

ఇందులో రేణు దేశాయ్‌ మాట్లాడుతూ, `ఆయన ఒక లేడీతో బేబీని కనేశాడు. ఈ మాటలు నేను ఈజీగా చెబుతున్నా, కానీ రియల్‌గా అంత ఈజీగా లేదు. పవన్‌ కళ్యాణ్‌ ని పిచ్చిగా ఇష్టపడే లేడీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, అదే మీరు ఆయన భార్యగా ఉండి ఉంటే. అదే ఆయన మీతో ఇలా చేసి ఉంటే, 11 ఏళ్ల పెళ్లి తర్వాత, మరో అమ్మాయితో బేబీ కని ఉంటే, అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉండేదో చెబితే బాగుంటుంది. ఇలా చేస్తే మీకు ఓకేనా` అంటూ ఘాటుగా కౌంటర్‌ ఇచ్చింది రేణు దేశాయ్. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్‌ నెట్టింట చక్కర్లు కొడుతుంది. 
 

78

అయితే ఇది ఎప్పుడో కొన్నేళ్ల క్రితం చేసిన ఇంటర్వ్యూ క్లిప్‌ ఇప్పుడు దీన్ని వైరల్‌ చేస్తున్నారు వైఎస్‌ఆర్‌సీపీ అభిమానులు. ఎన్నికల నేపథ్యంలో పవన్‌ కళ్యాణ్‌ తమకు పోటీగా నిలుస్తున్న నేపథ్యంలో జగన్‌ ఫ్యాన్స్ ఈ పని చేయడం గమనార్హం. పవన్‌ని బ్యాడ్‌ చేసే ఉద్దేశ్యంలో భాగంగా ఇలా ఈ క్లిప్ లను వైరల్‌ చేస్తూ ఆయన ఇమేజ్‌ని డ్యామేజ్‌ చేస్తున్నారని పవన్‌ ఫ్యాన్స్ కౌంటర్లు ఇస్తున్నారు. 
 

88

పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఏపీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేపథ్యంలో రాజకీయ ప్రచారంలో ఉన్నారు పవన్‌. ఇక సినిమా కెరీర్‌ పరంగా ఆయన చేతిలో మూడు సినిమాలున్నాయి. వాటిలో `ఓజీ`, `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌`, `హరిహర వీరమల్లు` చిత్రాలున్నాయి. ఎన్నికలు అయిపోయి, ఫలితాలు వచ్చిన తర్వాత మళ్లీ సినిమాల షూటింగ్‌లో పాల్గొనబోతున్నారు పవన్‌. రేణు దేశాయ్‌ గతేడాది `టైగర్‌ నాగేశ్వరరావు` చిత్రంలో మెరిశారు. మంచి పాత్రల్లో నటించేందుకు ఆమె సిద్ధంగానే ఉన్నారు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories