హెయిర్ కట్ చేయించుకున్న నిత్యా...నెటిజన్స్ సూపర్ రెస్పాన్స్..!

First Published | Oct 30, 2020, 1:00 PM IST

2011లో వచ్చిన అలా మొదలైంది మూవీతో టాలీవుడ్ కి పరిచయమైన నిత్యా మీనన్ మొదటి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది. లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి తెరకెక్కించిన ఆ చిత్రం భారీ విజయం సాధించడంతో నిత్యా మంచి ఫేమ్ సంపాదించుకుంది. 
 

దీనితో వరుసగా అనేక తెలుగు చిత్రాలు చేసింది. జనతా గ్యారేజ్ మూవీలో ఎన్టీఆర్ కి జంటగా నటించే అవకాశం కూడా దక్కించుకుంది ఈ అమ్మడు. నితిన్ తో నిత్యా మీనన్ చేసిన ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే చిత్రాలు మంచి విజయాలు అందుకున్నాయి.
ప్రస్తుతం నిత్యా ఎక్కువగా మలయాళ చిత్రాలే చేస్తుంది. సౌత్ లోని అన్ని ప్రధాన భాషలలో నటించిన నిత్యా మీనన్ హిందీలో కూడా చిత్రాలు చేసింది. నిత్యా మీనన్ గత ఏడాది అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన మిషన్ మంగళ్ మూవీలో నటించారు. ఆ చిత్రంలో నిత్యా స్పేస్ సైంటిస్ట్ గా నటించడం జరిగింది. ఆ మూవీ మంచి విజయం అందుకోగా నిత్యా నటనకు ప్రశంసలు దక్కాయి.

ఇక అభిషేక్ బచ్చన్ కి జంటగా వెబ్ సిరీస్ లో కూడా నిత్యా నటించడం విశేషం. బ్రీత్ అనే టైటిల్ తో విడుదలైన ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ లో అభిషేక్ భార్య పాత్ర చేసిన నిత్యామీనన్, కొన్ని బోల్డ్ సీన్స్ లో నటించింది. నిత్యా ఓ అమ్మాయితో లిప్ కిస్ చేసి సంచలనానికి తెరలేపింది. ప్రస్తుతం మళయాళంతో పాటు తమిళ చిత్రాలలో నిత్యా నటిస్తున్నారు.
ఇక జయలలిత బయోపిక్ లో నటిస్తున్న నిత్యా మీనన్...ఆమె లుక్ లో అద్భుతంగా ఉంది.
కాగాహెయిర్కట్ చేయించుకున్నా..హౌస్ ఈజ్ ఇట్? అని నిత్యానెటిజెన్స్ ని అడిగారు. వైట్ షర్ట్ ధరించిన నిత్యాకర్లీహెయిర్ చాలా అందంగా ఉంది. తమ అభిమాన హీరోయిన్ అలా అడిగేసరికినెటిజెన్స్నుండి సూపర్ రెస్పాన్స్ వస్తుంది.
అందరూ నిత్యా హెయిర్ స్టయిల్ బ్యూటిఫుల్, గార్జియస్ అంటూ పొగిడేస్తున్నారు. అలాగే లైక్స్ తో విరుచుకుపడుతున్నారు.
ఆ మధ్య నిత్యా మీనన్ కొంచెం వళ్ళు చేసి కనిపించింది. దానితో నెటిజెన్స్ ఆమె పట్ల బాడీ షేమింగ్ కి పాల్పడ్డారు. వాళ్లకు నిత్యా తనదైన శైలిలో సమాధానం చెప్పడం జరిగింది.

Latest Videos

click me!