ఈ జనరేషన్ లో ఉన్న ట్యాలెంటెడ్ హీరోయిన్లలో నిత్యామీనన్ ఒకరు. కళ్ళతోనే హావభావాలు పలికించగల నైపుణ్యం నిత్యామీనన్ దగ్గర ఉంది. నటనకు ప్రాధాన్యత ఉన్న చాలా చిత్రాల్లో నిత్యామీనన్ నటించింది. తెలుగులో నిత్యా మీనన్ అలా మొదలైంది చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో చివరగా ఆమె భీమ్లా నాయక్ చిత్రంలో నటించింది.
అయితే నిత్యామీనన్ ప్రస్తుతం తమిళంలో కాదలిక్క నేరమిల్లై చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్ర ఆడియో లాంచ్ వేడుక చెన్నైలో గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ లో నిత్యా మీనన్ ప్రవర్తించిన విధానం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అంతే కాదు నెటిజన్లు ఆమెపై విరుచుకుపడుతున్నారు. నిత్యామీనన్ వరస్ట్ బిహేవియర్ అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు.
ఇంతకీ ఏం జరిగిందంటే.. ఈవెంట్ లో వేదికపైకి నిత్యా మీనన్ రాగానే అక్కడ ఉన్న వ్యక్తి ఆమెని పలకరించి షేక్ హ్యాండ్ అడిగాడు. ఈవెంట్ ఆర్గనైజ్ చేసే సంస్థకి చెందిన వ్యక్తి అతడు. కానీ నిత్యా మీనన్ అతడికి హ్యాండ్ షేక్ ఇవ్వడానికి నిరాకరించింది. నాకు ఆరోగ్యం బాగా లేదు.. నీకు కూడా సోకుతుంది వద్దులే అంటూ షేక్ హ్యాండ్ తిరస్కరించింది.
కానీ ఎవరో తెలిసిన వ్యక్తి రాగానే హాయ్ అంటూ నిత్యా మీనన్ అతడిని హగ్ చేసుకుంది. అదే విధంగా డైరెక్టర్ మిస్కిన్ కనిపించగానే ఆయన బుగ్గపై నిత్యా మీనన్ ముద్దు పెట్టింది. హీరో జయం రవి రాగానే అతడికి కూడా హగ్ ఇచ్చింది. ఆ దృశ్యాలని నెటిజన్లు వైరల్ చేస్తూ ఇదీ ఆమె బిహేవియర్ అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. తనకి ఆరోగ్యం బాగాలేదని కారణం చెప్పి ఒక వ్యక్తిని షేక్ హ్యాండ్ తిరస్కరించింది నిత్యా మీనన్. అంటే జయం రవి, మిస్కిన్ లకి హగ్గులు, కిస్సులు ఇస్తే ఏమీ కాదా అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు.
కొందరు నెటిజన్లు అంతే వరస్ట్ బిహేవియర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిత్యా మీనన్ అభిమానులు మాత్రం షేక్ హ్యాండ్ ఇవ్వడం ఇవ్వకపోవడం అది ఆమె వ్యక్తిగత విషయం అంటూ మద్దతు తెలుపుతున్నారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలా మొదలైంది తర్వాత నిత్యా మీనన్ తెలుగులో జనతా గ్యారేజ్, ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి చిత్రాల్లో నటించింది.