శ్రీలీలతో బాలయ్య బాండింగ్, ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ సినిమాకి బలం అని, దర్శకుడు అనిల్ రావిపూడి వాటినే నమ్ముకున్నారని తెలుస్తుంది. అయితే ఈ చిత్రంలో గత బాలయ్య చిత్రాల్లా ఉండదని, కొంత వినోదం, మరికొంత ఎమోషనల్‌గా ఉంటుందని, కూతురు సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుందట. మూడు భారీ ఫైట్లు ఉంటాయన్నారు దర్శకుడు. మొత్తంగా ఈ చిత్రాన్ని యాక్షన్‌గా కంటే ఎమోషనల్ గా తెరకెక్కించినట్టు సమాచారం. బాలయ్య సైతం సినిమా చూసి కన్నీళ్లు పెట్టకుండా ఎవరూ బయటకు రారు అని చెప్పారు.