వివాహం తర్వాత కూడా నిహారిక జోరు తగ్గడం లేదు. సోషల్ మీడియాలో గ్లామరస్ పిక్స్, జిమ్ ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తోంది. నిహారిక తరచుగా మోడరన్ డ్రెస్సుల్లో కనిపించడం చూస్తూనే ఉన్నాం. కానీ ఎప్పుడూ ఈ మెగా డాటర్ బికినిలో కనిపించలేదు. ఊహించని విధంగా నిహారిక తాజాగా బికినీలో కనిపించి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది.