శ్రీరామ నవమి సందర్భంగా సినిమాల అప్డేట్స్.. ఆకట్టుకుంటున్న కొత్త పోస్టర్లు

First Published | Mar 30, 2023, 3:01 PM IST

శ్రీరామ నవమి సందర్భంగా  టాలీవుడ్ లో రూపుదిద్దుకుంటున్న కొత్త సినిమాల నుంచి అదిరిపోయే పోస్టర్లను విడుదల చేశారు. ఈక్రమంలో ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. 
 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన ‘ఆదిపురుష్’ నుంచి ఎలాంటి అప్డేట్ ఇవ్వకుండానే.. శ్రీరామ నవమికి సర్ ప్రైజ్ ఇచ్చారు. చిత్రం నుంచి సీతారాముల పాత్రలోని ప్రభాస్, కృతిసనన్, లక్ష్మణ, హనుమాన్ కు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. శ్రీరామ నవమి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రం జూన్ 16న థియేటర్లలోకి రానుంది.

యంగ్ హీరో తేజ సజ్జ నటిస్తున్న సూపర్ హీరో ఫిల్మ్ ‘హను మాన్’ ఈ చిత్రం నుంచి కూడా శ్రీరామ నవమి సందర్భంగా లేటెస్ట్ అప్డేట్ అందింది. హనుమాన్ చాతిని చీల్చుకొని సీతారాములను ప్రదర్శించిన అద్భుతమైన పోస్టర్ ను విడుదల చేశారు. చిత్రానికి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈచిత్ర టీజర్ విజువల్  వండర్ గా ఆకట్టుకుంది.
 


టాలీవుడ్ మ్యాచో స్టార్  గోపీచంద్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘రామబాణం’.  అభిమానులు, ప్రేక్షకులకు శ్రీరామ నవమి సందర్బంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను వదిలారు. గోపీచంద్, జగపతి బాబు సంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకున్నారు. చిత్రాన్ని శ్రీవాస్ డైరెక్ట్ చేస్తుండగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. 

టాలీవుడ్ ప్రముఖ మహిళా దర్శకురాలు నందిని రెడ్డి డైరెక్ట్ చేస్తున్న కొత్త సినిమా ‘అన్నీ మంచి శకునములే’. సంతోష్ శోభన్ - మాళవికా నాయిర్ జంటగా నటిస్తున్నారు. శ్రీరామ నవమి సందర్భంగా చిత్రం నుంచి ‘సీతా కళ్యాణం’ సాంగ్ ను విడుదల చేశారు. దీంతో పాటు ఓ ఆకట్టుకునే పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. 

శ్రీరామ నవమి రోజునే టాలీవుడ్ హీరో నితిన్ (Nithiin) పుట్టినరోజు కావడం విశేషం.  ఈ సందర్భంగా రీసెంట్ గా నితిన్, వెంకీ కుడుముల, రష్మిక మందన్న కాంబోలో ప్రకటించిన VNR TRIO నుంచి ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ స్పెషల్ పోస్టర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. 

ఈ ప్రత్యేకమైన శ్రీరామ నవమి రోజున నాని ‘దసరా’ చిత్రం విడుదలైన విషయం తెలిసిందే.  ఈక్రమంలోనే త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రాల నుంచి విడుదలైన కొత్త పోస్టర్లు ఆకట్టుకుంటున్నాయి. నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 
 

Latest Videos

click me!