Prema Entha Madhuram: ఫుల్ గా మందుకొట్టి ఇంటికి వచ్చిన మాన్సీ.. నీరజ్ ఏం చేశాడంటే?

Navya G   | Asianet News
Published : Feb 17, 2022, 08:15 AM IST

Prema Entha Madhuram: బుల్లితెరపై ప్రసారమయ్యే ప్రేమ ఎంత మధురం (Prema Entha Maduram) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో తెలుసుకుందాం. ఇంట్లో నీరజ్ మాన్సీ రాకపోవడంతో కంగారు పడుతూ ఉండగా ఈ లోపు మాన్సీ (Mansi) ఫుల్లుగా మందు కొట్టి వస్తుంది.  

PREV
15
Prema Entha Madhuram: ఫుల్ గా మందుకొట్టి ఇంటికి వచ్చిన మాన్సీ.. నీరజ్ ఏం చేశాడంటే?

ఇక మాన్సీ నీరజ్ (Neeraj)  మీద పడుతూ మామ్ఇల్లా దమ్ముంటే కిందికి రా అంటూ అరుస్తుంది. అదే సమయానికి వాళ్ళ అత్తగారు కిందకు మంచి నీళ్ల కోసం వస్తుండగా నీరజ్, మాన్సీ ను నోరు మూసి అక్కడినుంచి తీసుకువెళతాడు. అయినప్పటికీ నీరజ్ వాళ్ల మమ్మీ కంటపడతారు.  కానీ నీరజ్, మాన్సీ (Mansi) కి కళ్ళు తిరిగి ఆలా చేస్తుంది అని కవర్ చేస్తాడు.
 

25

మరోవైపు అను (Anu) దగ్గరకు ఒక పెద్ద టెడ్డీబేర్ రూపంలో ఒక వ్యక్తి వచ్చి భయ పెడుతూ ఉంటాడు. దాంతో అను భయపడు కుంటూ ఆర్య సార్.. అంటూ అరుస్తూ ఉంటుంది. ఇక టెడ్డి బియర్ అను మీదకి వస్తూ ఉంటుంది. దాంతో అను వెనక్కి వెళ్ళు అని గట్టిగా అరవడంతో అరవడంతో ఆర్య (Arya) నేనే అంటూ సర్ప్రైజ్ ఇస్తాడు.

35

దాంతో అను (Anu)  ఒకసారిగా ఊపిరి పీల్చుకుంటుంది. ఇక ఆర్య ఇదంతా చేసింది నిన్ను భయపెట్టడానికి కాదు అను నీలో ధైర్యం ఎంతుందో చూడడానికి అని అంటాడు. ఇక తర్వాత అను, ఆర్యకు ఒక హాగ్ కూడా ఇస్తుంది. మరోవైపు ఉదయాన్నే హ్యాంగ్ ఓవర్ తో తలనొప్పి వస్తున్న మాన్సీ.. నీరజ్ (Neeraj) అంటూ గట్టిగా అరుస్తుంది.

45

ఇక ఆ అరుపులు విన్న నీరజ్ (Neeraj)  తల్లి అక్కడ ఏం జరిగిందో అని చూడ్డానికి వెళుతూ ఉండగా నీరజ్ కవర్ చేసి వాళ్ళ అమ్మను వెనక్కి పంపిస్తాడు. ఆ తర్వాత నీరజ్ మాన్సీ రూమ్ లోకి వెళ్లగా మాన్సీ (Mansi) అబ్బా... తలనొప్పి అంటూ మొర పెడుతుంది.
 

55

ఆ తర్వాత మాన్సీ (Mansi) నా డబ్బులతో నేను తాగడం నా తప్పా అని అంటుంది. దాంతో నీరజ్ నీ డబ్బులతో నువ్వు తాగడం తప్పు కాదు. తాగడం ఎవరికి అలవాటు లేని ఈ ఇంట్లో నువ్వు  తాగి రావడం తప్పు అని నీరజ్ (Neeraj) అంటాడు. ఇక ఈ క్రమంలో రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.

click me!

Recommended Stories